తెలంగాణ ఉన్నత న్యాయస్థానం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న హైకోర్టు

తెలంగాణ హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న హైకోర్టు. 1920, ఏప్రిల్ 20న ఏడవ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ప్రారంభించబడింది.[1] హైదరాబాద్ రాజ్యం కోసం ఏర్పాటుచేయబడిన ఈ కోర్టు, 1956లో రాష్ట్ర పునర్య్వస్థీకరణ చట్టం ప్రకారం 1956 నవంబరు 5న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చబడింది. 2014, జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి హైకోర్టుగా ఉండి, 2019 జనవరి 1న పూర్తిస్థాయిలో తెలంగాణ హైకోర్టుగా మార్చబడింది.

తెలంగాణ ఉన్నత న్యాయస్థానం
హైకోర్టు భవనం
స్థాపితం1920 ఏప్రిల్ 20
దేశంభారతదేశం
ప్రదేశంహైదరాబాద్, తెలంగాణ
భౌగోళికాంశాలు17°22′09″N 78°28′19″E / 17.369181°N 78.472039°E / 17.369181; 78.472039
సంవిధాన పద్ధతిఎగ్జిక్యూటివ్ ఎంపిక అర్హతకు లోబడి ఉంటుంది
అధికారం పొందినదిభారత రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014
తీర్పులపై ఉత్తరాభియోగంసుప్రీం కోర్టు
న్యాయమూర్తుల పదవీ కాలం62 సంవత్సరాలకు పదవి విరమణ
స్థానాల సంఖ్య24
{పర్మినెంట్ 18 ; అడిషినల్ 6}
ప్రధాన న్యాయమూర్తి
ప్రస్తుతంఎం.ఎస్‌. రామచందర్‌ రావు (ప్రస్తుతం)
అప్పటినుండి2021 ఆగస్టు 31

చరిత్ర

మార్చు

బ్రిటిషు ప్రభుత్వం రూపొందించిన అనేక నిబంధనలు హైదరాబాద్‌ రాష్ట్రంలోకి ప్రవేశించడంతో, 1893 నాటికి బ్రిటిష్ పాలిత భారతదేశంలో ఉన్న కోర్టుల మాదిరిగానే హైదరాబాద్ హైకోర్టు ప్రస్తావన వచ్చింది. ప్రారంభంలో హైకోర్టు పత్తర్‌గట్టిలో ఏర్పాటుచేయబడింది. 1908 నాటి హైదరాబాదు వరదలు కారణంగా లాల్‌బాగ్‌లో ఉండే అసమన్‌జా నవాబ్ నివాస గృహాంలోకి హైకోర్టు మార్చబడింది. 1912లో హైదరాబాద్‌లో కలరా వ్యాధి రావడంతో పబ్లిక్‌ గార్డెన్స్ హాల్‌కు, నాలుగు నెలల తర్వాత చెత్తబజార్‌లోని సాలార్‌జంగ్ బహద్దూర్ నివాసానికి తరలించబడింది. అక్కడ స్థలం సరిపోకపోడంతో కొంతకాలం తరువాత సైఫాబాద్లోని సర్తాజ్‌జంగ్ నవాబ్ ఇంటికి మార్చబడి, ప్రస్తుత భవనం నిర్మించేంతవరకు అక్కడే కొనసాగింది.

1915, ఏప్రిల్ 15న జైపూర్‌ ప్రాంతానికి చెందిన ఆర్కిటెక్ శంకర్‌లాల్ రూపకల్పనలో, ఇంజినీర్ మెహర్‌ అలీఫజల్ పర్యవేక్షణలో హైకోర్టు భవన నిర్మాణం ప్రారంభించబడింది. శంషాబాద్‌ వద్ద గగన్‌పహడ్ ప్రాంతంలోని కొండలను తొలిచి, ఇండో ఇస్లామిక్ శైలిలో ఎరుపు తెలుపు రంగురాళ్లతో పాతబస్తీలోని మూసినది ఒడ్డున 1919, మార్చి 31న భవన నిర్మాణం పూర్తిచేయబడింది. 18,22,750 రూపాయలతో తొమ్మిది ఎకరాల్లో నిర్మించిన ఈ భవనాన్ని 1920, ఏప్రిల్ 20న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించారు. నిజాం కాలంలో మొదటి ప్రధాన న్యాయమూర్తిగా నవాబ్ ఆలంయార్‌ జంగ్ విధులు నిర్వర్తించాడు.[2]

1956, నవంబరు 5న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చబడింది. 1958లో మరికొన్ని భవనాల నిర్మాణాలు జరిగాయి. తొమ్మిదిన్నర ఎకరాల ప్రభుత్వ మెటర్నిటీ దవాఖాన స్థలాన్ని హైకోర్టుకు కేటాయించడంతో, అక్కడ ప్రత్యేక బ్లాకు నిర్మాణం చేపట్టబడ్డాయి.[3]

తొలి తెలుగు తీర్పు

మార్చు

తెలంగాణ హైకోర్టు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 2023 జూన్ 27న తెలుగులో తీర్పు వెలువరించింది. మచ్చబొల్లారంలోని భూవివాదంపై దాఖలైన అప్పీల్‌ పిటిషన్‌లో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పీ నవీన్‌రావు, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాతృభాషలో తీర్పు చెప్పింది. ఇందుకోసం 45 పేజీల తీర్పును తెలుగులో వెలువరించారు.[4][5]

ఇతర వివరాలు

మార్చు
  1. 1936లో జరిగిన సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వెండి హైకోర్టు భవన ప్రతిమ, వెండికీ బహుకరించారు. 300కిలోల బరువుగల మందపాటి షీట్ పై చెక్కబడిన భవన ప్రతిమ ప్రస్తుతం పురానీ హవేలీలోని నిజాం మ్యూజియంలో ఉంది.
  2. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
  3. 2009, ఆగస్టు 31న హైకోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో గ్రంథాలయం లోపలిభాగంలోకి మంటలు వ్యాపించడంతో మద్రాసు హైకోర్టు నుంచి జస్టిస్ కోకా సుబ్బారావు తెప్పించిన విలువైన పుస్తకాలు, జర్నల్స్ కాలిపోయాయి. కొన్ని ఛాంబర్లు, సమావేశ మందిరం కూడా కాలిపోవడంతో అందులోవున్న నిజాం కాలంలోని అపురూపమైన చిత్రాలు కాలిపోయాయి. వాటన్నింటిని బాగుచేసి 2011, అక్టోబరు 13న ప్రారంభించారు.
  4. తెలంగాణ హైకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తిగా 2019, జనవరి 1న రాధాకృష్ణన్ ప్రమాణం స్వీకరించగా, ప్రస్తుత తాత్కాలిక న్యాయమూర్తిగా ఆర్‌ఎస్ చౌహాన్ కొనసాగుతున్నారు.
  5. 2021, ఆగస్టు 31న ఎం.ఎస్. రామచందర్ రావు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[6]
  6. 2002, ఫిబ్రవరి 1న రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులను (జ్యుడీషియరీ నుంచి జీ అనుపమా చక్రవర్తి, ఎం గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావునాయుడు, ఏ సంతోష్‌రెడ్డి, డాక్టర్‌ డీ నాగార్జున, న్యాయవాదులు.. కాసోజు సురేందర్‌, చాడ విజయ్‌భాసర్‌రెడ్డి, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌ కుమార్‌, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫీయుల్లా బేగ్‌, నాచరాజు వెంకట శ్రవణ్‌ కుమార్‌) నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో హైకోర్టు న్యాయమూర్తులు సంఖ్య 31కి చేరుతుంది. ఇందులో 10 మంది (మూడో వంతు) మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఈ స్థాయిలో మహిళలు న్యాయమూర్తులుగా ఉండడం అరుదు.[7][8][9]

ప్రధాన న్యాయమూర్తులు

మార్చు
క్రమసంఖ్య ప్రధాన న్యాయమూర్తులు పదవికాలం
హైదరాబాద్ హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్
1 కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా 2014 జూన్ 2 – 2015
2 దిలీప్ బాబాసాహెబ్ భోస్లే 2015
3 టి.బి. రాధాకృష్ణన్ 2018 జూలై 7- 2018 డిసెంబరు 31
తెలంగాణ హైకోర్టు
1 టి.బి. రాధాకృష్ణన్ 2019 జనవరి 1 – 2019 ఏప్రిల్ 2
- రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి 2019 ఏప్రిల్ 3 – 2019 జూన్ 21
2 రాఘవేంద్ర సింగ్ చౌహాన్ 2019 జూన్ 22 - 2021 జనవరి 6
3 హిమా కోహ్లీ 2021 జనవరి 7 - 2021 ఆగస్టు 27
- ఎం.ఎస్‌. రామచందర్‌ రావు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి [10] 2021 ఆగస్టు 27 - 2021 అక్టోబరు 05
4 సతీశ్‌ చంద్ర శర్మ 2021 అక్టోబరు 13 - 2022 జూన్ 27
5 ఉజ్జల్ భుయాన్ 2022 జూన్ 27 - 2023 జూలై 13న
పి.నవీన్ రావు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి 2023 జూలై 14 (ఒక రోజు) [11]
అభినంద్ కుమార్ షావిలితాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి 2023 జూలై 15 - [12] 2023 జూలై 19
6 అలోక్ అరధే 2023 జూలై 19 - ప్రస్తుతం

న్యాయమూర్తుల

మార్చు
క్రమసంఖ్య న్యాయమూర్తి పదవికాలం
1 తడకమళ్ల వినోద్ కుమార్ [13] 2019 ఆగస్టు 26 - ప్రస్తుతం
2 కూనూరు లక్ష్మణ్‌ గౌడ్[14] 2019 ఆగస్టు 26 - ప్రస్తుతం
3 అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి 2019 ఆగస్టు 26 - ప్రస్తుతం
4 బి.విజయసేన్ రెడ్డి 2020 మే 3 - ప్రస్తుతం
5 జీ.శ్రీదేవి 2019 మే 15 - ప్రస్తుతం
6 ఎ.రాజశేఖర్ రెడ్డి 2014 సెప్టెంబరు 08 - ప్రస్తుతం
7 పి.నవీన్ రావు 2014 సెప్టెంబరు 08 - ప్రస్తుతం
8 షమీమ్ అక్తర్ 2017 జనవరి 17 - ప్రస్తుతం
9 అభినంద్ కుమార్ షావిలి 2017 సెప్టెంబరు 21 - ప్రస్తుతం
10 ఉజ్జల్‌ భుయాన్‌ [15] 2021 అక్టోబరు 5 - ప్రస్తుతం
11 పి.శ్రీసుధ 2021 అక్టోబరు 13 - ప్రస్తుతం
12 ఎ.వెంకటేశ్వర రెడ్డి 2021 అక్టోబరు 13 నుండి- ప్రస్తుతం[16]
13 జి.రాధారాణి 2021 అక్టోబరు 13 - ప్రస్తుతం
14 పి.మాధవీ దేవి 2021 అక్టోబరు 13 - ప్రస్తుతం
15 ఎన్. తుకారాంజీ 2021 అక్టోబరు 13- ప్రస్తుతం
16 ఎం.లక్ష్మణ్‌ 2021 అక్టోబరు 13 - ప్రస్తుతం
18 జి.అనుపమా చక్రవర్తి 2022 మార్చి 24 - ప్రస్తుతం
19 ఎం. గిరిజా ప్రియదర్శిని 2022 మార్చి 24 - ప్రస్తుతం
20 సాంబశివరావు నాయుడు 2022 మార్చి 24 - ప్రస్తుతం
21 ఏనుగు సంతోష్‌ రెడ్డి 2022 మార్చి 24 - ప్రస్తుతం
22 దేవరాజు నాగార్జున 2022 మార్చి 24 - ప్రస్తుతం
23 కాసోజు సురేందర్‌ 2022 మార్చి 24 - ప్రస్తుతం
24 చాడ విజయభాస్కర్‌రెడ్డి 2022 మార్చి 24 - ప్రస్తుతం
25 సూరేపల్లి నంద 2022 మార్చి 24 - ప్రస్తుతం
26 జువ్వాడి శ్రీదేవి 2022 మార్చి 24 - ప్రస్తుతం[17]
27 మీర్జా సైఫీయుల్లా బేగ్ 2022 మార్చి 24 - ప్రస్తుతం
28 నాచరాజు వెంకట శ్రవణ్ కుమార్ 2022 మార్చి 24 - ప్రస్తుతం[18]
29 కాజా శరత్ 2022 జూలై 25 - ప్రస్తుతం
30 ఏనుగుల వెంకట వేణుగోపాల్ 2022 ఆగస్టు 16 - ప్రస్తుతం
31 జగ్గన్నగారి శ్రీనివాస్ రావు 2022 ఆగస్టు 16 - ప్రస్తుతం
32 నామవరపు రాజేశ్వర్ రావు 2022 ఆగస్టు 16 - ప్రస్తుతం
33 సుజయ్ పాల్
34 మౌషుమి భట్టాచార్య

మాజీ న్యాయమూర్తులు

మార్చు

సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు

మార్చు

హైకోర్టు నూతన భవనం

మార్చు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలంలోని బుద్వేల్‌లో వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల వద్ద కేటాయించిన 100 ఎకరాల స్థలంలో నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌ 2024 మార్చి 27న శంకుస్థాపన చేశాడు.[21][22][23]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. సాక్షి, వీడియోలు (20 April 2019). "తెలంగాణ హైకోర్టుకు వందేళ్లు". Archived from the original on 20 April 2019. Retrieved 20 April 2019.
  2. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (20 April 2019). "హైకోర్టు.. 100 ఏళ్ల చరిత్రకు సాక్షి". Archived from the original on 20 April 2019. Retrieved 20 April 2019.
  3. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (20 April 2019). "హైకోర్టు సేవలకు వందేండ్లు". Archived from the original on 20 April 2019. Retrieved 20 April 2019.
  4. "హైకోర్టులో తొలి తెలుగు తీర్పు". EENADU. 2023-06-30. Archived from the original on 2023-06-29. Retrieved 2023-07-10.
  5. telugu, NT News (2023-06-30). "తొలిసారి తెలుగులో తీర్పు". www.ntnews.com. Archived from the original on 2023-06-30. Retrieved 2023-07-10.
  6. "Justice MS Ramachandra Rao appointed acting Chief Justice of TS High Court". News Meter. 27 August 2021. Retrieved 27 August 2021.
  7. telugu, NT News (2022-02-02). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Namasthe Telangana. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-04.
  8. Vamshidhara, Vujjini (2022-02-02). "SC Collegium okays 7 advocates. 5 judicial officers as Telangana HC judges". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-04.
  9. "హైకోర్టుకు 12 మంది జడ్జీలు!". Sakshi. 2022-02-03. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-04.
  10. Sakshi (27 August 2021). "హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు". Archived from the original on 31 August 2021. Retrieved 31 August 2021.
  11. Eenadu (14 July 2023). "తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ పి.నవీన్‌రావు". Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.
  12. ETV Bharat News (14 July 2023). "Telangana HC Incharge CJ : హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నవీన్‌రావు". ETV Bharat News. Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.
  13. నమస్తే తెలంగాణ, తెలంగాణ (26 August 2019). "ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 28 August 2019. Retrieved 28 August 2019.
  14. సాక్షి, రామన్నపేట (నకిరేకల్‌) (25 August 2019). "హైకోర్టు న్యాయమూర్తిగా బోగారం వాసి". Sakshi. Archived from the original on 28 August 2019. Retrieved 28 August 2019.
  15. Andrajyothy (6 October 2021). "తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ భుయాన్‌". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  16. Sakshi (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు". Sakshi. Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  17. Namasthe Telangana (24 March 2022). "హైకోర్టు నూతన న్యాయ‌మూ‌ర్తుల ప్రమా‌ణ‌స్వీ‌కారం". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  18. V6 Velugu (24 March 2022). "హైకోర్టు కొత్త న్యాయ‌మూ‌ర్తుల ప్రమా‌ణ‌స్వీ‌కారం" (in ఇంగ్లీష్). Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  19. Andhrajyothy (14 November 2023). "తెలంగాణకు చెందిన ఇద్దరు సహా ఐదుగురు హైకోర్టు జడ్జిల బదిలీ". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  20. Namasthe Telangana (14 November 2023). "ఇద్దరు తెలంగాణ హైకోర్టు జడ్జీల బదిలీ". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  21. Andhrajyothy (27 March 2024). "కొత్త హైకోర్టుకు నేడు శంకుస్థాపన". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  22. Sakshi (27 March 2024). "తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  23. The Hindu (27 March 2024). "The court that's been always on the move" (in Indian English). Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.

వెలుపలి లంకెలు

మార్చు