అన్నే వెంకటేశ్వరరావు

అన్నే వెంకటేశ్వరరావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సీనియర్ సీపీఎం నాయకుడు.[1]

జీవిత విశేషాలు మార్చు

అతను రైతు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ఉద్యమ నిర్మాతల్లో ఒకడు. మెట్ట, ఏజెన్సీ, కొల్లేరు ప్రాంతాల్లో రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై, భూ సమస్యలపై జరిగిన పోరాటాలకు అన్నే నాయకత్వం వహించాడు. ప్రజాఉద్యమాల్లో 13 సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపాడు.[2] అతని భార్య అన్నే అనసూయ. ఆమె కూడా సీపీఐ (ఎం) సీనియర్‌ నాయకురాలు, భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.[3] ఆమె పిల్లలతోపాటు జైలు కెళ్లిన ధీరవనిత. 1952లోనే కమ్యూనిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలిగా ఉంది. అవిభక్త కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఏర్పడినప్పుడు సిపిఎం వైపు నిలిచింది.

అతను కొంతకాలం సిపిఎంకు దూరంగా ఉన్నాడు కానీ అతని భార్య అనసూయ మాత్రం కడవరకూ స్థిరంగా సిపిఎంలో నిలిచింది. అన్నే దంపతులిద్దరూ స్వచ్ఛందంగా తమను బాధ్యతల నుంచి తప్పించి యువతరానికి అవకాశం ఇవ్వాలని కోరిన నిరాడంబరులు. కమిటీల్లో స్థానం వద్దని కార్యకర్తలుగా ఉంటూనే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అందరినీ ఆకర్షించేవారు. కుటుంబం మొత్తాన్ని పార్టీ సానుభూతిపరులుగా మార్చడం వీరి ప్రత్యేకత. పాత ఏలూరు, చింతలపూడి తాలూకాల్లో నిర్వహించిన భూపోరాటాల్లో వేలాది ఎకరాలు సాధించి, పేదలకు దక్కేలా చేసిన నేతల్లో వీరు ముఖ్యులు.[4]

మూలాలు మార్చు

  1. "అన్నే వెంకటేశ్వరరావు". 10tv.in. Retrieved 2018-04-14.[permanent dead link]
  2. Stories, Prajasakti News. "నేటి తరానికి అన్నే ఆదర్శం". Prajasakti. Retrieved 2018-04-14.[permanent dead link]
  3. "CPM leader passes away". The Hans India. Retrieved 2018-04-14.
  4. Stories, Prajasakti News. "అన్నే అనసూయ అస్తమయం". Prajasakti. Archived from the original on 2017-12-03. Retrieved 2018-04-14.