అన్వర్ పాష మహ్మద్: నిజామాబాద్
అన్వర్ పాష మహ్మద్ వక్త, ప్రయోక్త. ప్రముఖ రచయిత.
బాల్యము
మార్చుఅన్వర్ పాష మహ్మద్ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 1959, జూలై 22 న జన్మించారు. వీరి తల్లి తండ్రులు. జైబుబున్నీసా, ఎం.ఎ సలీం. చదువు: ఎం.ఎ (చరిత్ర)., ఎం.ఎ (ఆర్కియాలజీ)., ఎం.ఎ. (రాజనీతి శాస్త్రం)., ఎల్‌ఎల్.బి.
ఉద్యోగం
మార్చురాష్ట్ర వాణిజ్య పన్నులశాఖలో ఉన్నతాధికారి.
రచనా వ్యాసంగము
మార్చు1977లో 'శ్మశానం' కవిత ప్రచురితం అయినప్పటి నుండి అనేక కవితలు, కథానికలు, వ్యాసాలు పత్రికలలో ప్రచురితం అయ్యాయి.
ప్రచురణ
మార్చువస్తుసేవల చట్టం (2010). రాష్ట్ర వాణిజ్యశాఖాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజల ప్రయోజనార్థం తెలుగులోకి అనువదించి గ్రంథాలను ప్రచురించారు.
లక్ష్యం
మార్చుసర్వమానవ సమానత్వం, సర్వజనావళి సౌభాగ్యం వీరి లక్ష్యము.
మూలాలు
మార్చు- సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 45