అపెండిసైటిస్
అపెండిసైటిస్ అనేది ఉండుకము (అపెండిక్స్) వాపు వచ్చినప్పుడు ఏర్పడే దేహ పరిస్థితి. లక్షణాలు సాధారణంగా కుడి వైపు దిగువ భాగాన్న పొత్తికడుపు నొప్పి, వికారం, వాంతులు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. అయినప్పటికీ, దాదాపు 40% మంది వ్యక్తులలో ఈ ప్రత్యేకమైన లక్షణాలు ఉండవు.[1] ఈ ఉండుకము పగిలినప్పుడు ఉదరము గోడ లోపలి పొర (peritoneum) వెంబడి బాధాకరమైన మంట, సెప్సిస్ వంటి తీవ్రమైన సమస్యలు విస్తృతంగా ఉంటాయి. [2]
అపెండిసైటిస్ | |
---|---|
ఇతర పేర్లు | ఎపిటిఫ్లయిటిస్ |
తీవ్రంగా ఎర్రబడి విస్తరించిన ఉండుకం, పొడవుగా ముక్కలు చేయబడింది. | |
ప్రత్యేకత | శస్త్రచికిత్స, జీర్ణకోశ వ్యాధులు |
లక్షణాలు | కుడి వైపు దిగువ భాగాన్న పొత్తికడుపు నొప్పి, వికారం, వాంతులు, ఆకలి తగ్గడం |
సంక్లిష్టతలు | ఉదరము గోడ లోపలి పొర (peritoneum) బాధాకరమైన మంట, సెప్సిస్ |
రోగనిర్ధారణ పద్ధతి | లక్షణాలు, మెడికల్ ఇమేజింగ్, ప్రయోగశాల పరీక్షలు |
చికిత్స | అపెండక్టమి |
తరుచుదనము | 11.6 మిలియన్ (2015) |
మరణాలు | 50,100 (2015) |
కారణాలు
మార్చుఅపెండిసైటిస్ వ్యాధి ఉండుకము లోపల బోలు భాగంలో అడ్డుఏర్పడడము వల్ల వస్తుంది.[3] ఇది సాధారణంగా గట్టిపడిన మలంతో ఏర్పడిన కాల్సిఫైడ్ "రాయి" ఇక్కడ అడ్డుకుంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్, పరాన్నజీవులు, పిత్తాశయ రాళ్లు లేదా కణితుల నుండి ఎర్రబడిన లింఫోయిడ్ కణజాలం కూడా ఈ అడ్డుపడటానికి కారణం కావచ్చు. [4] ఈ అడ్డుపడటం వలన ఉండుకములో ఒత్తిడి పెరగడం, అపెండిక్స్‌లోని కణజాలాలకు రక్తప్రసరణ తగ్గడం, ఇంకా ఉండుకము లోపల బాక్టీరియా వృద్ధి చెందడం వల్ల వాపు వస్తుంది. [4] [5] వాపు, ఉండుకముకు రక్త ప్రవాహం తగ్గడం, కణజాల గాయం మొదలగునవి అన్ని కలిసి కణజాల మరణానికి కారణమవుతుంది. [6] ఈ ప్రక్రియను చికిత్స చేయకుండా వదిలేస్తే, ఉండుకము పేలవచ్చు, ఉదర కుహరంలోకి బ్యాక్టీరియాను విడుదల చేస్తుంది, ఈ పరిస్థితి సంక్లిష్టతలను మరింత పెంచుతుంది. [6][7]
రోగ నిర్ధారణ
మార్చుఅపెండిసైటిస్ నిర్ధారణ ఎక్కువగా రోగి సంకేతాలు లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. [5] రోగ నిర్ధారణ అస్పష్టంగా ఉన్న సందర్భాల్లో, నిశితంగా పరిశీలించడం, మెడికల్ ఇమేజింగ్, ప్రయోగశాల పరీక్షలు సహాయపడతాయి. రెండు ఇమేజింగ్ పరీక్షలు అల్ట్రాసౌండ్, కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT స్కాన్) అత్యంత సాధారణంగా నిర్వహిస్తారు. [8] తీవ్రమైన అపెండిసైటిస్‌ను గుర్తించడంలో అల్ట్రాసౌండ్ కంటే CT స్కాన్ మరింత ఖచ్చితమైనదిగా కనపడుతోంది.[9] అయినప్పటికీ, CT స్కాన్‌ల వలన రేడియేషన్ కు గురికావడం(ఎక్స్‌పోజర్)వలన ఉన్న ప్రమాదాల కారణంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలకు అల్ట్రాసౌండ్ మొదటి ఇమేజింగ్ పరీక్షగా ప్రాధాన్యత ఇస్తారు. [8]
చికిత్స
మార్చుతీవ్రమైన అపెండిసైటిస్‌కు ప్రామాణిక చికిత్స ఉండుకము శస్త్రచికిత్స (అపెండక్టమి - Appendectomy) ద్వారా తొలగించడం.[4] [5] ఇది పొత్తికడుపులో బహిరంగ కోత ( లాపరోటమీ ) లేదా కెమెరాల సహాయంతో (లాపరోస్కోపీ) కొన్ని చిన్న కోతల ద్వారా చేయవచ్చు. శస్త్రచికిత్స అపెండిక్స్ చీలికతో సంబంధం ఉన్న దుష్ప్రభావాలు తగ్గిస్తుంది లేదా మరణం సంభవించే ప్రమాదాన్ని నివారిస్తుంది. చిరిగే స్థితికి రాని అపెండిసైటిస్ కు కొన్ని సందర్భాల్లో యాంటీబయాటిక్స్ ఉపయోగించడం ప్రభావవంతంగా ఉండవచ్చు.[10]
వ్యాధి ప్రాబల్యం
మార్చుఇది త్వరగా వచ్చే తీవ్రమైన కడుపు నొప్పికి అత్యంత సాధారణమైన ముఖ్యమైన కారణాలలో ఒకటి. 2015లో సుమారు 11.6 మిలియన్ల అపెండిసైటిస్ కేసులు సంభవించాయి, దీని ఫలితంగా 50,100 మంది మరణించారు. [11][12] అమెరికాలో , అపెండిసైటిస్ ఆకస్మిక కడుపు నొప్పికి శస్త్రచికిత్స అవసరమవడం అత్యంత సాధారణ కారణం.[1] యునైటెడ్ స్టేట్స్‌లో ప్రతి సంవత్సరం, అపెండిసైటిస్‌తో బాధపడుతున్న వారిలో 300,000 మందికి పైగా ఉండుకమును శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. [13] 1886లో ఈ పరిస్థితిని మొదటగా రెజినాల్డ్ ఫిట్జ్ వివరించి గుర్తింపు పొందారు.[14]
ఇది కూడా చూడండి
మార్చుప్రస్తావనలు
మార్చు- ↑ 1.0 1.1 Graffeo CS, Counselman FL (November 1996). "Appendicitis". Emergency Medicine Clinics of North America. 14 (4): 653–71. doi:10.1016/s0733-8627(05)70273-x. PMID 8921763.
- ↑ (Spring 1998). "Acute and Suppurative Appendicitis: Disease Duration and its Implications for Quality Improvement".
- ↑ Pieper R, Kager L, Tidefeldt U (1982). "Obstruction of appendix vermiformis causing acute appendicitis. An experimental study in the rabbit". Acta Chirurgica Scandinavica. 148 (1): 63–72. PMID 7136413.
- ↑ 4.0 4.1 4.2 Longo, Dan L.; et al., eds. (2012). Harrison's principles of internal medicine (18th ed.). New York: McGraw-Hill. pp. Chapter 300. ISBN 978-0-07174889-6. Archived from the original on 30 March 2016. Retrieved 6 November 2014.
- ↑ 5.0 5.1 5.2 Tintinalli, Judith E., ed. (2011). Emergency medicine : a comprehensive study guide (7th ed.). New York: McGraw-Hill. pp. Chapter 84. ISBN 978-0-07-174467-6. Archived from the original on 22 December 2016. Retrieved 6 November 2014.
- ↑ 6.0 6.1 Schwartz's principles of surgery (9th ed.). New York: McGraw-Hill, Medical Pub. Division. 2010. pp. Chapter 30. ISBN 978-0-07-1547703.
- ↑ Barrett ML, Hines AL, Andrews RM (July 2013). "Trends in Rates of Perforated Appendix, 2001–2010" (PDF). Healthcare Cost and Utilization Project (HCUP) Statistical Brief #159. Rockville, MD: Agency for Healthcare Research and Quality. PMID 24199256. Archived (PDF) from the original on 2016-10-20.
- ↑ 8.0 8.1 Paulson EK, Kalady MF, Pappas TN (January 2003). "Clinical practice. Suspected appendicitis" (PDF). The New England Journal of Medicine. 348 (3): 236–42. doi:10.1056/nejmcp013351. PMID 12529465. Archived from the original (PDF) on 2017-09-22. Retrieved 2017-11-01.
- ↑ Shogilev DJ, Duus N, Odom SR, Shapiro NI (November 2014). "Diagnosing appendicitis: evidence-based review of the diagnostic approach in 2014". The Western Journal of Emergency Medicine (Review). 15 (7): 859–71. doi:10.5811/westjem.2014.9.21568. PMC 4251237. PMID 25493136.
- ↑ Varadhan KK, Neal KR, Lobo DN (April 2012). "Safety and efficacy of antibiotics compared with appendicectomy for treatment of uncomplicated acute appendicitis: meta-analysis of randomised controlled trials". BMJ. 344: e2156. doi:10.1136/bmj.e2156. PMC 3320713. PMID 22491789.
- ↑ GBD 2015 Disease and Injury Incidence and Prevalence Collaborators (October 2016). "Global, regional, and national incidence, prevalence, and years lived with disability for 310 diseases and injuries, 1990-2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015". Lancet. 388 (10053): 1545–1602. doi:10.1016/S0140-6736(16)31678-6. PMC 5055577. PMID 27733282.
{{cite journal}}
:|author=
has generic name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ GBD 2015 Mortality and Causes of Death Collaborators (October 2016). "Global, regional, and national life expectancy, all-cause mortality, and cause-specific mortality for 249 causes of death, 1980-2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015". Lancet. 388 (10053): 1459–1544. doi:10.1016/s0140-6736(16)31012-1. PMC 5388903. PMID 27733281.
{{cite journal}}
:|author=
has generic name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Mason RJ (August 2008). "Surgery for appendicitis: is it necessary?". Surgical Infections. 9 (4): 481–8. doi:10.1089/sur.2007.079. PMID 18687030.
- ↑ Fitz RH (1886). "Perforating inflammation of the vermiform appendix with special reference to its early diagnosis and treatment". American Journal of the Medical Sciences (92): 321–46.