వాంతి
బలవంతంగా జీర్ణకోశంలోని పదార్ధాలు నోరు, అరుదుగా ముక్కు ద్వారా బయటకు రావడాన్ని వాంతి బహువచనం వాంతులు (Vomiting) అంటారు. ఇది ఒక వ్యాధి లక్షణము. కొన్ని ప్రాంతాలవారు దీనినే కక్కు అంటారు.
వాంతులు వివిధ కారణాల వలన కలుగుతాయి. జీర్ణాశయంలోని కారణాలు, తల నొప్పి వంటి కొన్ని మెదడుకు సంబంధించిన బయటి కారణాలు. వాంతి అవుతుందేమో నన్న భయాన్ని వికారం అంటారు. ఎక్కువగా వాంతులవుతున్నప్పుడు వీటిని ఆపడానికి వైద్యం అవసరం. తీవ్రమైన పరిస్థితులలో ద్రవాలను నరం ద్వారా ఎక్కించవలసి వస్తుంది.
భాషా విశేషాలుసవరించు
బ్రౌన్ నిఘంటువు ప్రకారం కక్కు అనే క్రియా పదానికి వాంతి అని అర్ధం ఉంది.[1] కక్కు [ kakku ] kakku. తెలుగు v. a. To vomit. కక్కు kakku. n. Vomiting: the thing vomited. కక్కుడు kakkuḍu. n. Vomiting.
తెలుగు మాండలికాలులో మహబూబ్ నగర్ జిల్లాలో వాంతిని కక్కు అంటారు.[2]
కారణాలుసవరించు
జీర్ణ వ్యవస్థసవరించు
- జీర్ణాశయం వాపు (ఆహార సంబంధమైనవి, వైరస్)
- పైలోరిక్ స్టెనోసిస్ (చిన్న పిల్లలలో ఎక్కువగా కనబడుతుంది)
- ప్రేగులో అడ్డంకి
- విపరీతమైన కడుపు నొప్పి
- పిత్తాశయము, క్లోమము, ఉండుకము, కాలేయము వాటికి సంబంధించిన వాపులు
- ఆహర సంబంధిత అలర్జీ (పిల్లలకు పట్టే పాలలోని లాక్టోజ్ పడకపోవడం)
మెదడు, జ్ఞానేంద్రియాలుసవరించు
- ఎక్కువగా కదలిక వలన లోపలి చెవిలోని జ్ఞానేంద్రియాల మూలంగా
- తలకు దెబ్బ తగలడం
- మెదడులో రక్తస్రావం
- మైగ్రేన్ అనే ప్రత్యేకమైన తలనొప్పి
- మెదడులో ట్యూమర్లు
- మెదడులోని పీడనం ఎక్కువగా ఉండటం.
జీవ క్రియలుసవరించు
- రక్తంలో కాల్షియమ్ ఎక్కువ కావడం
- యురీమియా (రక్తంలో యూరియా ఎక్కువ కావడం, మూత్రపిండాల వైఫల్యం కారణంగా
- అధివృక్క గ్రంధి వైఫల్యం
- రక్తంలో గ్లూకోజ్ తక్కువ కావడం
గర్భానికి చెందినవిసవరించు
మందులు, ఇతర పానీయాలుసవరించు
మానసినమైనవిసవరించు
మూలాలుసవరించు
- ↑ [1][permanent dead link]
- ↑ తెలుగు మాండలికాలు, మహబూబ్ నగర్ జిల్లా, డా. కె.లక్ష్మీనారాయణ శాస్త్రి, తెలుగు అకాడమి, హైదరాబాదు 1999, పేజీ: 90.
బయటి లింకులుసవరించు
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
Look up వాంతి in Wiktionary, the free dictionary.