అప్పర్ సియాంగ్ జిల్లా

అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా

అప్పర్ సియాంగ్ జిల్లా, భారతదేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[2][3] జిల్లా ముఖ్యపట్టణం యింగ్‌కియోంగ్

అప్పర్ సియాంగ్ జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ పటంలో అప్పర్ సియాంగ్ జిల్లా స్థానం
అరుణాచల్ ప్రదేశ్ పటంలో అప్పర్ సియాంగ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
ముఖ్య పట్టణంయింగ్‌కియోంగ్
విస్తీర్ణం
 • మొత్తం6,188 కి.మీ2 (2,389 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం35,289[1]
జనాభా వివరాలు
 • అక్షరాస్యత60.0%[1]
 • లింగ నిష్పత్తి891[1]
Websiteఅధికారిక జాలస్థలి

చరిత్ర

మార్చు

జిల్లా ప్రాంతం ఒకప్పుడు స్వతంత్ర టిబెట్ దేశంలో ఉంది. అప్పుడీ ప్రాంతం పెమకొ అని పిలువబడేది. మెంబా, ఖంబా, ఇడు మిష్మి గిరిజనులు ఈ ప్రాంతం వదిలి వెళ్ళిన తరువాత ఇక్కడ ఆది ప్రజల ఆధిక్యం కొనసాగింది. 1999లో తూర్పు సియాంగ్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.[4]

భౌగోళికం

మార్చు

ఎగువ సియాంగ్ జిల్లా కేంద్రం యింగ్కాంగ్ వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 6,118.[5] వైశాల్యంలో జిల్లా రష్యా లోని న్యూసైబేరియా ద్వీపానికి సమానం.[6] జిల్లాలో బృహత్తరమైన ఎగువ సియాంగ్ హైడ్రాలిక్ ప్రాజెక్ట్ ఉంది.

జాతీయ అభయారణ్యం

మార్చు
  • మౌలింగ్ నేషనల్ పార్క్.

శాసన వ్యవస్థ

మార్చు

ఎగువ సియాంగ్ జిల్లాలో రెండు పార్లమెంటరీ నియోజక వర్గాలు ఉన్నాయి. అవి ట్యూటింగ్-యింగ్కియోగ్, మారియాంగ్-గెకు. ఇవి అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి[7]

జనాభా గణాంకాలు

మార్చు

గణాంకాలు (2011)

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాలో మొత్తం జనాభా 35,320. వీరిలో 18,699 మంది పురుషులు కాగా, 16,621 మంది మహిళలు ఉన్నారు.జిల్లాలో మొత్తం 7,324 కుటుంబాలు నివసిస్తున్నాయి. జిల్లా సగటు లింగ నిష్పత్తి 889.

జిల్లా మొత్తం జనాభాలో 18.5% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 81.5% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 79.2% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 55.6% మంది నివసిస్తున్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 944 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 877 ఉంది.

జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4988, ఇది మొత్తం జనాభాలో 14%. 0-6 సంవత్సరాల మధ్య 2563 మంది మగ పిల్లలు ఉండగా, 2425 మంది ఆడ పిల్లలు ఉన్నారు.దీని ప్రకారం పిల్లల లింగ నిష్పత్తి 946గా ఉంది, ఇది జిల్లా సగటు లింగ నిష్పత్తి (889) కంటే ఎక్కువ.

జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 59.99%. ఎగువ సియాంగ్ జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 57.35% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 44.96% ఉంది.

మతాలు

మార్చు

ఎగువ సుబన్‌సిరి జిల్లాలో ఆది, మెంబా గిరిజనప్రజలు నివసిస్తున్నారు. ఆది ప్రజలు " డోంగి-పొలొ అనుసరిస్తుండగా మెంబా ప్రజలు టిబెటన్ బుద్ధిజం అనుసరిస్తున్నారు.

భాషలు

మార్చు

ఎగువ సియాంగ్ జిల్లాలో సినో-టిబెటన్ , ఆది భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ భాషను దాదాపు 1,40,000 మంది మాట్లాడుతున్నారు. ఇది టిబెటన్ , లాటిన్ లిపిలో వ్రాస్తుంటారు.[8]

వృక్షజాలం , జంతుజాలం

మార్చు

1986 లో ఎగువ సియాంగ్ జిల్లాలో 483 చ.కి.మీ వైశాల్యంలో " మౌలింగ్ నేషనల్ పార్క్ " ఏర్పాటు చేయబడింది.[9] సైన్సు ప్రపంచంలో సరికొత్తగా కనిపెట్టబడిన క్షీరదం ఎగిరే ఉడుత ఈ జిల్లాలో కనిపిస్తుంది.[10]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "District Census 2011". Census2011.co.in.
  2. "Arunachal Pradesh Population Census 2011, Arunachal Pradesh Religion, Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in. Retrieved 2023-09-21.
  3. "Upper Siang District Population Religion - Arunachal Pradesh, Upper Siang Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in. Retrieved 2023-09-21.
  4. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  5. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1113. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  6. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. New Siberia (Novaya Sibir) 6,201km2
  7. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011.
  8. M. Paul Lewis, ed. (2009). "Adi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  9. Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 25 September 2011.
  10. Choudhury, A.U. (2013). Description of a new species of giant flying squirrel of the genus Petaurista Link, 1795 from Siang Basin, Arunachal Pradesh in North East India. The NL & Journal of the Rhino Foundation for nat. in NE India 9: 30–38, plates.

భోగోళిక స్థితి

మార్చు

వెలుపలి లింకులు

మార్చు