అప్రస్తుత ప్రశంసాలంకారం

అప్రస్తుత ప్రశంసాలంకారం తెలుగు భాషలో ఒక విధమైన అలంకారము.

లక్షణం మార్చు

ప్రస్తుతమును ఆశ్రయించుకొని, అప్రస్తుతమును తలచుకొన్నచో అది అప్రస్తుత ప్రశంసాలంకారం అవుతుంది.

ఉదాహరణ మార్చు

"వలచిన యువకుని గాలి సోకినంత మాత్రముననే వెన్నలా కరిగిపోయే మనసుతో వశమయే మనుజ అలివేణుల కౌగిటి సుఖము ఎన్ని జన్మలెత్తినా లభింపవు" అని వరూధిని అన్నది.[1]

వివరణ మార్చు

ఇక్కడ అప్రస్తుతమగు లోకంలోని అలివేణుల వర్ణన చేత ప్రస్తుతం అయిన వరూధిని తానట్టి దానననియు, తనను కౌగిటిలో చేర్చటం అనేది ఎన్నో జన్మలెత్తితే గాని లభింపదనియు, అది నీకు (ప్రవరునికి) లభించిందనీ అర్ధం ఇక్కడ తోచడం వల్ల ఇది అప్రస్తుత ప్రశంస.

మూలాలు మార్చు

  1. మను చరిత్రలో అల్లసాని పెద్దన