వికీపీడియా:మొలక

అడ్డదారి:
WP:STUB

మొలకలు అంటే వ్యాసాలే, కానీ ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న దశలో ఉన్నాయన్న మాట. ఇంకా వికీపీడియా సభ్యుల దృష్టి వాటి మీద పడలేదు. వ్యాసం ప్రారంభం అయితే జరిగింది గాని, పూర్తిస్థాయి వ్యాసానికి ఉండవలసినంత సమాచారం అందులో ఇంకా లేదు. అంతమాత్రం చేత మొలకలు అంటే పనికిరానివని అనుకోరాదు. వ్యాసం తయారయే క్రమంలో మొలక అనేది మొదటి అడుగు. ఈ మొలకలతో ఎలా వ్యవహరించాలో నిర్దేశించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.

మొలకను గుర్తించుట

మార్చు

మొలక అంటే చాలా చిన్న వ్యాసం, కాని మరీ పనికిరానంత చిన్నదేమీ కాదు. సాధారణంగా, మొలక పరిమాణం కనీసం వ్యాసపు శీర్షికను నిర్వచించేటంత పెద్దదిగా నైనా ఉండాలి. అంటే సుమారు 3 నుండి 10 వాక్యాలన్న మాట. విషయం మరీ క్లిష్టమైనదైతే మొలక పెద్దదిగా ఉండవచ్చు; అలాగే, మరీ స్వల్ప విషయానికి సంబంధించిన చిన్న వ్యాసం మొలక కాకపోవచ్చు. వికీకరణ చెయ్యవలసిన పెద్ద వ్యాసాలు మొలకల కిందకి రావు. వీటికి, {{శుద్ధి}} అనే ట్యాగు తగిలించాలి.

చాలా కొద్ది సమాచారం ఉండే చిన్న వ్యాసాలు తొలగింపుకు గురయ్యే అవకాశం ఉంది. వికీపీడియా నిఘంటువు కాదు, చిన్న చిన్న నిర్వచనాలు పెట్టడానికి. అందుకోసం దాని సోదర ప్రాజెక్టు - విక్షనరీ — ఉంది చూడండి.

మొలక వర్గీకరణ

మార్చు

మొలకలను వాటి అంశం ఆధారంగా పేర్చేందుకు వివిధ వర్గాలు ఉన్నాయి. కొత్తగా తయారు చేసిన మొలకలను ఈ వర్గాల్లో ఏదో ఒకదాని లోకి చేర్చాలి. తద్వారా ఆయా మొలకలను గుర్తించడం, వాటిపై తమతమ ఆసక్తుల మేరకు పనిచేసేందుకూ వాడుకరులకు తేలిగ్గా ఉంటుంది. చిన్న వ్యాసాన్ని రాసాక అది మొలక అని తెలియ జేసేందుకు గాను, వ్యాస విషయానికి సంబంధించిన మూసను (మూస పేరు నిలువు వరుసలో ఉన్న మూస) వ్యాసంలో చేర్చండి.

ఆ వర్గాలు, సంబంధిత మూసల వివరాలు కింద ఇచ్చాం.

క్ర.సం మొలక వర్గం పేరు వివరం మూస పేరు
1 వర్గం:ఆధ్యాత్మిక మొలక వ్యాసాలు (23 పేజీలు) అధ్యాత్మిక విషయాలకు సంబంధించిన వ్యాసాలు {{మొలక-ఆధ్యాత్మికం}}
2 వర్గం:పుణ్యక్షేత్రాల మొలక వ్యాసాలు (6 పేజీలు) పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, అక్కడి విశేషాలకు సంబంధించిన వ్యాసాలు {{మొలక-పుణ్యక్షేత్రాలు}}
3 వర్గం:పౌరాణిక వ్యక్తుల మొలక వ్యాసాలు (17 పేజీలు) పౌరాణిక వ్యక్తులకు సంబంధించిన వ్యాసాలు. చారిత్రిక వ్యక్తుల వ్యాసాలు ఇందులో చేరవు {{మొలక-పౌరాణిక వ్యక్తులు}}
4 వర్గం:వ్యక్తుల మొలక వ్యాసాలు (56 పేజీలు) చారిత్రిక వ్యక్తుల వ్యాసాలతో సహా అన్ని జీవిత చరిత్ర వ్యాసాలు. పౌరాణిక వ్యక్తులు పాత్రలు ఇందులో చేరవు {{మొలక-వ్యక్తులు}}
5 వర్గం:చరిత్ర మొలక వ్యాసాలు (12 పేజీలు) చరిత్రకు సంబంధించిన వ్యాసాలు {{మొలక-చరిత్ర}}
6 వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు (56 పేజీలు) వృక్షజాతులు, ప్రజాతులు వగైరా వ్యాసాలు {{మొలక-వృక్షశాస్త్రం}}
7 వర్గం:జంతుశాస్త్రం మొలక వ్యాసాలు (68 పేజీలు) మానవుడు కాకుండా ఇతర జంతువులు, పక్షులు, కీటకాలు, సూక్ష్మ జీవులు {{మొలక-జంతుశాస్త్రం}}
8 వర్గం:మానవ శరీర మొలక వ్యాసాలు (16 పేజీలు) మానవ శరీరానికి సంబంధించిన వ్యాసాలు {{మొలక-మానవ దేహం‎}}
9 వర్గం:భౌగోళిక మొలక వ్యాసాలు (7 పేజీలు) స్థలాలు, నదులు, పర్వతాలు వంటి భౌగోళిక విశేషాలు {{మొలక-భౌగోళికం}}
10 వర్గం:శాస్త్ర సాంకేతిక మొలక వ్యాసాలు (49 పేజీలు) ఇతర శాస్త్ర సాంకేతికాంశాలన్నిటికీ సంబంధించిన వ్యాసాలు {{మొలక-శాస్త్ర సాంకేతికాలు}}
11 వర్గం:సంస్థల మొలక వ్యాసాలు (11 పేజీలు) సంస్థలకు సంబంధించిన వ్యాసాలు {{మొలక-సంస్థ}}
12 వర్గం:తెలుగు సినిమా మొలక వ్యాసాలు (499 పేజీలు) తెలుగు సినిమాల వ్యాసాలు {{మొలక-తెలుగు సినిమా}}
13 వర్గం:గ్రామాల మొలక వ్యాసాలు (340 పేజీలు) ఆంధ్ర, తెలంగాణ గ్రామాల వ్యాసాలు {{మొలక-గ్రామం}}
14 వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు (22 పేజీలు) పుస్తకాలు, పుస్తక ప్రచురణ సంస్థలు {{మొలక-పుస్తకాలు}}
15 వర్గం:మీడియా మొలక వ్యాసాలు (16 పేజీలు) పత్రికలు, టీవీలు, సీరియళ్ళు, సామాజికమాధ్యమాలు {{మొలక-మీడియా}}
16 వర్గం:మౌలిక సదుపాయాల మొలక వ్యాసాలు (0 పేజీలు) రోడ్లు, రైలు మార్గాలు, ఆనకట్టలు వంటి మౌలిక సదుపాయాలు {{మొలక-మౌలిక సదుపాయాలు}}
17 వర్గం:రాజకీయాల మొలక వ్యాసాలు (4 పేజీలు) రాజకీయాలు, పరిపాలనలకు సంబంధించిన వ్యాసాలు {{మొలక-రాజకీయాలు}}
18 వర్గం:ఆహార మొలక వ్యాసాలు (15 పేజీలు) ఆహారం, వంటలు {{మొలక-ఆహారం}}
19 వర్గం:ఆరోగ్య మొలక వ్యాసాలు (1 పేజీలు) ఆరోగ్యం, వైద్యం {{మొలక-ఆరోగ్యం}}
20 వర్గం:కంప్యూటరు మొలక వ్యాసాలు (0 పేజీలు) కంప్యూటరు, సాఫ్టువేరు {{మొలక-కంప్యూటరు}}
21 వర్గం:సంగీత మొలక వ్యాసాలు (11 పేజీలు) సంగీతం, సంగీత పరికరాలు {{మొలక-సంగీతం}}
22 వర్గం:హిందూ పంచాంగ మొలక వ్యాసాలు (365 పేజీలు) హిందూ పంచాంగానికి సంబంధించిన వ్యాసాలు {{మొలక-హిందూ పంచాంగం}}
23 వర్గం:సంఖ్యా మొలక వ్యాసాలు (60 పేజీలు) సంఖ్యాయుత వ్యాసాలు {{మొలక-సంఖ్య}}
24 వర్గం:పేర్ల మొలక వ్యాసాలు (41 పేజీలు) పేర్లు, ఇంటిపేర్ల వ్యాసాలు {{మొలక-పేరు}}
25 వర్గం:ఘటన మొలక వ్యాసాలు (0 పేజీలు) ఘటనలు, వార్షిక దినోత్సవాలకు చెందిన వ్యాసాలు {{మొలక-ఘటన}}
26 వర్గం:విద్యాలయాల మొలక వ్యాసాలు (1 పేజీలు) విద్యాలయాల వ్యాసాలు {{మొలక-విద్యాలయం}}
27 వర్గం:వ్యవసాయ మొలక వ్యాసాలు (7 పేజీలు) వ్యవసాయానికి సంబంధించిన వ్యాసాలు {{మొలక-వ్యవసాయం}}
28 వర్గం:తేదీ మొలక వ్యాసాలు (0 పేజీలు) తేదీ, వారం, నెల, సంవత్సరాల వ్యాసాలు {{మొలక-తేదీ}}
29 వర్గం:పరికరాల మొలక వ్యాసాలు (18 పేజీలు) పరికరం / ఉపకరణం / పనిముట్టు / గాడ్జెట్‌కు సంబంధించిన వ్యాసాలు {{మొలక-పరికరం}}
30 వర్గం:కళల మొలక వ్యాసాలు (14 పేజీలు) కళల వ్యాసాలు {{మొలక-కళ}}
31 వర్గం:సాహిత్యం మొలక వ్యాసాలు (50 పేజీలు) సాహిత్యం, భాషా సంబంధ వ్యాసాలు {{మొలక-సాహిత్యం}}
32 వర్గం:ఆటల మొలక వ్యాసాలు (2 పేజీలు) ఆటలకు సంబంధించిన వ్యాసాలు {{మొలక-ఆట}}
33 వర్గం:గృహ వస్తువుల మొలక వ్యాసాలు (14 పేజీలు) గృహ వస్తువులకు సంబంధించిన వ్యాసాలు {{మొలక-గృహం}}
34 వర్గం:సాంప్రదాయిక విజ్ఞాన మొలక వ్యాసాలు (4 పేజీలు) భారతీయ సాంప్రదాయిక విజ్ఞాన వ్యాసాలు (జ్యోతిష్యం, క్షుద్ర పూజలు వగైరా) {{మొలక-సాంప్రదాయిక విజ్ఞానం}}
35 వర్గం:జీవన విధాన మొలక వ్యాసాలు (30 పేజీలు) జీవన విధాన సంబంధ వ్యాసాలు {{మొలక-జీవన విధానం}}
36 వర్గం:అక్షరాల మొలక వ్యాసాలు (47 పేజీలు) అక్షరాల వ్యాసాలు {{మొలక-అక్షరం}}
37 వర్గం:ఆర్థిక మొలక వ్యాసాలు (0 పేజీలు) ఆర్హిక, వ్యాపార, వాణిజ్య సంబంధ వ్యాసాలు {{మొలక-ఆర్థికం}}
38 వర్గం:సామాజిక మొలక వ్యాసాలు (35 పేజీలు) సమాజ సంబంధ వ్యాసాలు {{మొలక-సమాజం}}
39 వర్గం:కాలం మొలక వ్యాసాలు (0 పేజీలు) కాలం, ఋతువులు, దిక్కులు.. తత్సంబంధ వ్యాసాలు {{మొలక-కాలం}}

కొత్తగా సృష్టించిన వ్యాసం పై వర్గాల్లో దేనికీ చెందదని భావిస్తే, కింది పనుల్లో ఏదో ఒకటి చెయ్యవచు:

  • కొత్త మూసను, కొత్త వర్గాన్నీ సృష్టించి, దాన్ని పై పట్టికలో చేర్చడం.
  • లేదంటే {{మొలక}} అనే జనరిక్ మూసను చేర్చడం.

కానీ, ఏ మూసనూ చేర్చకుండా మొలక వ్యాసాన్ని అలాగే వదిలెయ్యకండి.

ఒక చక్కని మొలక వ్యాసం ఎలా ఉండాలి

మార్చు

నమోదైన వాడుకరి ఎవరైనా మొలక వ్యాసాన్ని సృష్టించవచ్చు.

ఒక మొలకను ప్రారంభించేటపుడు, దాని ప్రధాన ఉద్దేశం విస్తరణ అని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్లుగా, ఇతర వాడుకరులు దాన్ని విస్తరించేందుకు సరిపడినంత కనీస సమాచారం ఉండాలి. ఆ సమాచారం విషయాన్ని, సందర్భాన్నీ తగినంతగా పరిచయం చెయ్యాలి - అలా లేని వ్యాసాలను సత్వర తొలగింపు విధానం కింద తొలగించే అవకాశం ఉంది. పుస్తకాల నుండి గానీ, ఇతర విశ్వసనీయ మూలాల నుండి గాని మీ తొలి సమాచారాన్ని సేకరించవచ్చు. ఆ సమాచారం సరియైనదీ, నిష్పాక్షికమైనదీ అయి ఉండాలి. మీ స్వంత వాక్యాల్లో రాయండి: ఉన్నదున్నట్లుగా కాపీ చెయ్యడం గ్రంథచౌర్యం అవుతుంది. కొన్ని సందర్భాల్లో కాపీహక్కుల ఉల్లంఘన కూడా కావచ్చు.

విషయాన్ని నిర్వచించడంతో మొలకను మొదలుపెట్టండి. కొన్నిసార్లు విషయాన్ని నిర్వచించడం అసాధ్యం; అటువంటప్పుడు విషయం గురించి స్పష్టమైన వివరణ ఇవ్వండి. ఉదాహరణకు ఆ స్థలం ఎందుకు ప్రసిధ్ధి చెందింది, ఫలానా వ్యక్తి గొప్పదనం ఏమిటి మొదలైనవి.

తరువాత, ఈ ప్రాథమిక నిర్వచనాన్ని విస్తరించాలి. ఇంతకు ముందు సూచించిన పధ్ధతుల ద్వారా తగినంత సమాచారాన్ని సేకరించవచ్చు. కొన్ని వాక్యాలు రాసిన తరువాత వాటిలోని పదాలకు, సంబంధిత అంతర్గత లింకులు పెట్టాలి. అనవసరంగా, అతిగా లింకులు పెట్టవద్దు; ఏమైనా సందేహాలుంటే, మునుజూపు చూడు మీట నొక్కి, ఒక పాఠకుడి దృష్టితో వ్యాసాన్ని చదవండి. అవసరం లేదనిపించిన చోట లింకులు పెట్టకండి.

చివరిగా, ఒక ముఖ్యమైన కీలకమైన అంచె: మొలకలో మీరు పెట్టిన సమాచారానికి తగిన మూలాలను ఉదహరించండి; మూలాలను ఎలా పెట్టాలో చూడండి.

వ్యాసాన్ని సమర్పించిన తరువాత అది ఎన్నో దశల గుండా ప్రస్థానం చెందుతుంది. ఎవరైనా సభ్యుడు దానిని విస్తరించవచ్చు, సరైన సమాచారం దొరికినపుడో, తీరుబడిగా ఉన్నపుడో మీరే దానిని విస్తరించవచ్చు.

మొలకలు ఎక్కడెక్కడున్నాయి

మార్చు

ఇవీ చూడండి

మార్చు