అఫాక్ హుస్సేన్

పాకిస్తానీ మాజీ క్రికెటర్

అఫాక్ హుస్సేన్ (1939, డిసెంబరు 31 – 2002, ఫిబ్రవరి 25) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1961 నుండి 1964 వరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[1]

అఫాక్ హుస్సేన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1939-12-31)1939 డిసెంబరు 31
లక్నో, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ2002 ఫిబ్రవరి 25(2002-02-25) (వయసు 62)
కరాచీ, సింధ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి-చేతి ఆఫ్‌బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 38)1961 అక్టోబరు 21 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1964 డిసెంబరు 4 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 2 67
చేసిన పరుగులు 66 1,448
బ్యాటింగు సగటు 24.54
100లు/50లు 0/0 1/5
అత్యధిక స్కోరు 35* 122*
వేసిన బంతులు 240 9,301
వికెట్లు 1 214
బౌలింగు సగటు 106.00 19.42
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 14
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 5
అత్యుత్తమ బౌలింగు 1/40 8/108
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 52/–
మూలం: Cricinfo, 2014 మే 7

జననం మార్చు

అఫాక్ హుస్సేన్ 1939, డిసెంబరు 31న లక్నోలో జన్మించాడు.

క్రికెట్ రంగం మార్చు

అఫాక్ హుస్సేన్ టెస్ట్ క్రికెట్‌లో అద్వితీయమైన రికార్డును కలిగి ఉన్నాడు, ఔట్ కాకుండానే అత్యధిక టెస్ట్ పరుగులు (66) సాధించాడు.[2] 1961 అక్టోబరులో లాహోర్‌లో ఇంగ్లండ్‌పై 10*, 35* పరుగులు చేశాడు. 1964 డిసెంబరులో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై 8*, 13* పరుగులు చేశాడు.[1]

1962లో పాకిస్థాన్ జట్టుతో పాటు, 1963లో పాకిస్థాన్ ఈగలెట్స్‌తో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. 1964-65లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించిన పాకిస్థాన్ జట్టులో భాగమయ్యాడు.

ఆఫ్-స్పిన్ బౌలర్ గా,[3] లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు. హుస్సేన్ 1957, 1974 మధ్య పాకిస్తాన్‌లోని వివిధ ఫస్ట్-క్లాస్ జట్లకు ఆడాడు. 1960-61లో రైల్వేస్, క్వెట్టా జట్టుకు వ్యతిరేకంగా కరాచీ విశ్వవిద్యాలయం తరపున 108 పరుగులకు 8 వికెట్లు తీశాడు.[4] 1969-70లో లాహోర్ బి పై పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తరపున 122 నాటౌట్ అత్యధిక స్కోరు చేశాడు.[5]

మరణం మార్చు

అఫాక్ హుస్సేన్ 2002, ఫిబ్రవరి 25న పాకిస్తాన్ లోరి కరాచీలో మరణించాడు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Frindall, Bill (2009). Ask Bearders. BBC Books. pp. 24–25. ISBN 978-1-84607-880-4.
  2. "Who holds the record for most runs in Tests without being dismissed?". ESPN Cricinfo. Retrieved 15 September 2020.
  3. Wisden 2003, p. 1613.
  4. Karachi University v Railways and Quetta 1960-61
  5. Lahore B v Pakistan International Airlines 1969-70

బాహ్య లింకులు మార్చు