అఫ్తాబ్ గుల్

పాకిస్తానీ మాజీ క్రికెటర్

అఫ్తాబ్ గుల్ ఖాన్, (జననం 1946, మార్చి 31) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1969 నుండి 1971 వరకు పాకిస్తాన్ తరపున ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.

అఫ్తాబ్ గుల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అఫ్తాబ్ గుల్ ఖాన్
పుట్టిన తేదీ (1946-03-31) 1946 మార్చి 31 (వయసు 78)
గుజ్జర్ ఖాన్, బ్రిటిష్ ఇండియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 57)1969 ఫిబ్రవరి 21 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1971 జూలై 8 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 6 101
చేసిన పరుగులు 182 6,179
బ్యాటింగు సగటు 22.75 36.77
100లు/50లు 0/0 11/42
అత్యధిక స్కోరు 33 140
వేసిన బంతులు 6 745
వికెట్లు 14
బౌలింగు సగటు 34.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/20
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 48/–
మూలం: ESPNCricinfo, 2017 జూన్ 15

అఫ్తాబ్ గుల్ ఖాన్ 1946, మార్చి 31న పాకిస్తాన లోని గుజ్జర్ ఖాన్ లో జన్మించాడు.

క్రికెట్ రంగం

మార్చు

1964-65 నుండి 1977-78 వరకు పాకిస్తాన్‌లో అనేక ఫస్ట్-క్లాస్ జట్లకు ప్రాతినిధ్యం వహించడంతోపాటు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు.

1971లో ఇంగ్లాండ్ పర్యటనలో 1000కు పైగా పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన మొదటి టెస్ట్ మొదటి ఓవర్‌లో, అలాన్ వార్డ్ నుండి వచ్చిన బంతి అతని తలపై తగిలి రిటైర్ అవ్వవలసి వచ్చింది. 1974లో ఇంగ్లాండ్‌లో కూడా పర్యటించాడు కానీ,ఏ టెస్టులు ఆడలేదు.[1]

వృత్తిరీత్యా న్యాయవాది. గుల్ మొదట్లో 2010 పాకిస్థాన్ క్రికెట్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో క్రికెటర్ సల్మాన్ బట్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. Richards, Giles (9 October 2010). "Pakistan cricketer calls on Marxist in case for the defence". The Guardian. Retrieved 2023-09-10.
  2. Dani, Bipin (7 October 2010). "Gul the right man to contest Butt's case". The Nation (in అమెరికన్ ఇంగ్లీష్). Lahore, Pakistan: Nawaiwaqt Group. Retrieved 2023-09-10.
  3. "Salman Butt hires lawyer of Indian origin". Cricbuzz (in ఇంగ్లీష్). Times Internet. 19 April 2013. Retrieved 2023-09-10.

బాహ్య లింకులు

మార్చు