అబ్దుల్ ఆజాద్ ఖాన్ పఠాన్

శ్రీ అబ్దుల్‌ ఆజాద్‌ ఖాన్‌ పఠాన్‌

బాల్యము మార్చు

అబ్దుల్‌ ఆజాద్‌ ఖాన్‌ పఠాన్‌ ప్రకాశం జిల్లా రాచర్ల గ్రామంలో 1971 జూన్‌ ఒకటిన జన్మించారు. తల్లితండ్రులు: ఇమాంబి, మహబూబ్‌ ఖాన్‌. చదువు: బి.ఎ(తెలుగు).,విద్వాన్‌ (హింది).

ఉద్యోగము మార్చు

ప్రజాశక్తి దినపత్రికకు విలేఖరిగా పనిచేస్తున్నారు.

రచనా వ్యాసంగము మార్చు

2003లో ప్రచురితమయిన 'ఓ గులాబీ ప్రేమగీతం' కవితతో సాహిత్య వ్యాసంగం ఆరంభం చేశారు. ఇతని కవితలు, వ్యాసాలు పలు పత్రికల లో ప్రచురితం అయ్యాయి. పలు సత్కారాలు పొందారు. సాహిత్య-సాంస్కతిక కార్యక్రమాల ఏర్పాటు పట్ల ఆసక్తి గలవారు. మతసామరస్యం ప్రధాన ప్రాతిపదికగా చాల సర్వమత సమ్మేళనాల నిర్వహణ చేపట్టి మత సామరస్యానికి తన వంతు ప్రాత్ర పోషించారు. ఈయనకు సామాజిక, రాజకీయాంశాల మీద రచనలు చేయడం ఇష్టం.

మూలాలు మార్చు

అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010

ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌

చిరునామా వినుకొండ - 522647. పుట 29