ప్రకాశం జిల్లా

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా

ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లో ఒక జిల్లా. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఒంగోలు. ఇది 1970 ఫిబ్రవరి 2న, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లాల యొక్క కొంత భాగముల నుండి ఆవిర్భవించింది. తరువాత 1972లో, జిల్లాలోని వినోదరాయునిపాలెము గ్రామములో పుట్టిన ఆంధ్ర నాయకుడైన టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది. 2022 ఏప్రిల్ 4 న కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా గుంటూరు జిల్లానుండి చేరిన భాగం, బాపట్ల జిల్లాలో, నెల్లూరు నుండి చేరిన కొంత భాగం తిరిగి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపబడింది.

ప్రకాశం జిల్లా
జిల్లా
.
.
నిర్దేశాంకాలు: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E / 15.5; 80.05
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లా కేంద్రముఒంగోలు
విస్తీర్ణం
 • మొత్తం14,322 km2 (5,530 sq mi)
విస్తీర్ణపు ర్యాంకు1
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం22,88,000
 • సాంద్రత159.8/km2 (414/sq mi)
జనగణన గణాంకాలు
కాలమానంUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 0( )

భారతాన్ని తెనిగించిన కవిత్రయాల్లో ఒకరైన ఎర్రాప్రగడ,సంగీత విద్వాంసుడు త్యాగరాజు, శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ జిల్లా వారే. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. మార్కాపురం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. ప్రకాశంజిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు. Map

చరిత్ర సవరించు

ఉమ్మడి జిల్లా చరిత్రకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా , గుంటూరు జిల్లాల చరిత్రే ఆధారం. ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాక, పల్లవ, చాళుక్య,కాకతీయ రాజ వంశాలు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్కొండ, కర్ణాటక నవాబులు పరిపాలించారు. భారతాన్ని తెనిగించిన కవిత్రయములో ఒకరైన ఎర్రాప్రగ్గడ, సంగీతంలో పేరుగాంచిన శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాంతానికి చెందినవారే.

స్వాతంత్ర్యోద్యమ సమయంలో చీరాల పేరాల ఉద్యమం నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, నరసింహరావు ప్రసిద్దులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ తర్వాత మొదటిగా ఒంగోలు జిల్లా ఏర్పడింది. ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా యొక్క మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలతో (మార్కాపురం, గిద్దలూరు) ఏర్పడినది. [2][3][4]

1972 లో టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తుగా ప్రకాశం జిల్లాగా [5] పేరు మార్చబడింది.

2022 ఏప్రిల్ 4 న ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రకాశం జిల్లాలోని 13 మండలాలు బాపట్ల జిల్లా లో చేర్చబడ్డాయి. కందుకూరు శాసనసభ నియోజకవర్గం మండలాలు మరల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో కలపబడ్డాయి.[1][6]

భౌగోళిక స్వరూపం సవరించు

ఉత్తరాన నాగర్‌కర్నూల్ జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాలు, పశ్చిమాన కర్నూలు జిల్లా, దక్షిణాన వైఎస్‌ఆర్ జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు, తూర్పున బంగాళా ఖాతము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలోని మధ్య ప్రాంతం చిన్న చిన్న పొదలతో, కొండలతో, రాతి నేలలతో కూడి జిల్లాకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి.[7]

కొండలు సవరించు

త్యాగరాజు నల్లమల, వెలుగొండలు జిల్లాలోని ముఖ్యమైన కొండలు. నల్లమల కొండలు గిద్దలూరు మండలం, మార్కాపురం మండలాలలో వ్యాపించి ఉండగా, వెలుగొండ కర్నూలు జిల్లా, వైఎస్‌ఆర్ జిల్లాల సరిహద్దులలో ఉన్నాయి. నల్లమలలో నంది కనుమ (నంది కనుమ వద్ద పాతరాతి యుగపు (క్రీ.పూ 10000 - క్రీ.పూ 8000) నాటి రాతి పనిముట్ల పరిశ్రమ ఉన్నట్టు GSI వారు కనుగొన్నారు), మాబాల కనుమ అనే రెండు ముఖ్యమైన కనుమలు ఉన్నాయి. నంది కనుమ పశ్చిమాన గల కర్నూలు జిల్లా,బళ్ళారి జిల్లాలకు, తూర్పున కోస్తా జిల్లాలకు ప్రధాన మార్గం కాగా, మాబాల కనుమ పశ్చిమాన ఆత్మకూరు, కర్నూలును తూర్పున దోర్నాల, యర్రగొండపాలెం, మార్కాపురం లను కలుపుతుంది.

జలవనరులు సవరించు

 
ఉమ్మడి ప్రకాశం జిల్లా నీటివనరుల పటము (2015)

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, మూసీ, మానేరు, పాలేరు, రొంపేరు, జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నదులు. వీటిలో 220 కి మీలు ప్రవహించే గుండ్లకమ్మ నది జిల్లా యొక్క తాగునీటి, సాగునీటి అవసరాలకు తల్లి వంటిది. మానేరు, పాలేరు, రొంపేరు సాగు తాగు నీటి అవసరాలు తీరుస్తాయి. కంభం వెలిగొండ, గుండ్లకమ్మ, మోపాడు, రాళ్లపాడు చెరువులు తాగు సాగునీటి అవసరాలకు ప్రధాన నదులపై నిర్మించారు. తమ్మిలేరు, సగిలేరు ఈగిలేరు, గుడిశలేరు అనే చిన్న నదులు, వాగేరు వాగు, నల్లవాగు, వేడిమంగల వాగు వంటివి కూడా జిల్లాలో పరిమితంగా ప్రవహిస్తున్నాయి.[7]

భారీ నీటిపారుదల ప్రాజెక్టులు సవరించు

పూర్తయినవి

ఒంగోలు శాఖా కాలువ M. 16-5-330 వద్ద 1.514 టిఎంసి నీటిని నిల్వకు రిజర్వాయర్ కట్టబడింది. ఇది ఓబచెత్తపాలెం గ్రామం, చీమకుర్తి మండలం దగ్గర 2009 లో నిర్మించబడింది. 72,874 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించగా, 32,475 ఎకరాలు 2013-14లో స్థిరీకరించబడింది. దీనికి 47.61కోట్లరూపాయలు 2015 మే వరకు ఖర్చయ్యింది.56గ్రామాలకు మంచినీటి సౌకర్యం లభిస్తుంది.[8]

నిర్మాణంలో వున్నవి

మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు సవరించు

 • రాళ్లపాడు ప్రాజెక్టు
 • మోపాడు ప్రాజెక్టు
 • కంభం చెరువు
 • వీరరాఘవునికోట ఆనకట్ట
 • పాలేరు బిట్రగుంట ఆనకట్ట

చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టు సవరించు

నీటి చెరువుల ద్వారా కూడా వ్యవసాయం జరుగుతుంది. ఇవి 10 నుండి 40హెక్టార్ల విస్తీర్ణములో ఉన్నాయి.

వాతావరణం, వర్షపాతం సవరించు

జిల్లా లోని కోస్తా ప్రాంతాల్లో సముద్రపు గాలి వలన అన్నికాలాల్లోను వాతావరణం ఒకే రకంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంటుంది. జూన్‌- సెప్టెంబరులో నైరుతి ఋతుపవనాలు, అక్టోబరు - డిసెంబరులో ఈశాన్య ఋతుపవనాల వలన వర్షాలు కురుస్తాయి.

నేలలు సవరించు

ఎర్ర, నల్ల రేగడి, ఇసుక నేలలు జిల్లాలో ఉన్నాయి.

వృక్ష సంపద సవరించు

కోస్తా ప్రాంతంలో కొత్తపట్నం, సింగరాయకొండ, ఉలవపాడులో జీడి మొదలైన చెట్లతో కూడిన అడవులు ఉన్నాయి. ఉలవపాడు మామిడి, సపొటా తోటలకు ప్రసిద్ధి.

ఖనిజ సంపద సవరించు

పలకలు, బలపాలకు పనికివచ్చే రాయి విస్తారంగా గిద్దలూరు మండలంలోని ఓబయనాపల్లి నుండి మార్కాపురం మండలంలోని కుళ్లపేట వరకు దొరుకుతుంది. భారతదేశం వుత్పత్తిలో దాదాపు 80 శాతం ఇక్కడేజరుగుతుంది. కోగిజేడు, మార్లపాడు గ్రామంలో మాగ్నటైట్, ముడి ఇనుము నిక్షేపాలున్నాయి. ఇంకా క్వార్ట్జ్, జిప్సం, సిలికా, సున్నపురాయి, బేరియం సల్ఫేట్ దొరుకుతున్నాయి. ప్రపంచంలోనే అతి శ్రేష్ఠమైన గాలక్సీ గ్రానైటు జిల్లాలో దొరుకుతుంది.[9]

ఆర్ధిక స్థితి గతులు సవరించు

వ్యవసాయం సవరించు

 
ఒంగోలు జాతి గిత్త

వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో జిల్లా ప్రసిద్ధి చెందింది. వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, కొర్రలు, పప్పు ధాన్యాలు, మిరప, పత్తి,శనగ, వేరుశనగ, ఆముదం ఇక్కడ పండే ఇతర పంటలు. పత్తివుత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది.


పరిశ్రమలు సవరించు

జిల్లాలో ఐరన్‌ ఓర్‌, గ్రానైట్‌, ఇసుక, సిలికా, బైరటీస్‌, సున్నపురాయి, పలకలకు సంబంధించిన గనులు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలు చీమకుర్తి, ఆర్‌.ఎల్‌.పురం, బూదవాడల్లో 8.60 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు, వివిధ రంగుల గ్రానైట్‌ నిక్షేపాలు జిల్లాలోని ఉప్పుమాగులూరు, దర్శి, కనిగిరి, , బ్లాక్‌ పెరల్‌ గ్రానైట్‌ నిల్వలున్నాయి. ఇవేగాక ప్రత్తి జిన్నింగ్, పొగాకు, మంగుళూరు టైల్స్, పలకల తయారీ, జీడిపప్పు పరిశ్రమలు ఉన్నాయి. దేశానికి అవసరమైన రాతి పలకలో 80% మార్కాపురం నుండే 100కు పైగా పరిశ్రమలలో వుత్పత్తి చేయబడుతుంది. సముద్ర తీరం (పాకల,ఊళ్ళపాలెం,కేసుపాలెం,కరేడు ....మొదలైనవి. )పొడుగునా ఉప్పును పండిస్తారు. అవస్థాపన: జిల్లాలో ఆరు పారిశ్రామిక వాడలు ( ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు అభివృద్ధి కేంద్రము (Ongole growth center), ఒంగోలు ఆటోనగర్, వుడ్ కాంప్లెక్స్) ఉన్నాయి. [10]

విభజన పూర్వపు ప్రకాశం జిల్లా పరిశ్రమల గణాంకాలు (2012 నాటివి)
పరిశ్రమ రకం సంఖ్య పెట్టుబడి (కోట్లు) ఉపాధి వివరణలు
భారీ, మధ్య తరహా 30 389 ఉదా: ఐటిసి, అమరావతి టెక్స్టైల్స్, జయవెంకటరమణ స్పిన్నింగ్ మిల్స్, ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్స్
సూక్ష్మ, చిన్న తరహా 28,088 150.66 1,65,728

డివిజన్లు లేదా మండలాలుు సవరించు

ప్రకాశం జిల్లా మండలాల పటం (Overpass-turbo)


 • రెవిన్యూ డివిజన్లు (3): ఒంగోలు, కనిగిరి, మార్కాపురం

మండలాలు సవరించు

మండలాలు: 38 [1]

గ్రామ పంచాయితీలు సవరించు

715 గ్రామపంచాయితీలున్నాయి. [11]

నగరాలు, పట్టణాలు సవరించు

నియోజకవర్గాలు సవరించు

 1. లోక్‌సభ నియోజకవర్గములు(2) [1]
  1. ఒంగోలు లోకసభ నియోజకవర్గం : సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం తప్ప మిగిలిన ప్రకాశం జిల్లా
  2. బాపట్ల లోకసభ నియోజకవర్గం పరిధి: బాపట్ల జిల్లా తో పాటు ప్రకాశం జిల్లా లోని సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం
 2. శాసనసభ నియోజకవర్గములు (8) [1]
  1. ఎర్రగొండపాలెం
  2. ఒంగోలు
  3. కనిగిరి
  4. కొండపి
  5. గిద్దలూరు
  6. దర్శి
  7. మార్కాపురం
  8. సంతనూతలపాడు

రవాణా వ్యవస్థ సవరించు

 
ఒంగోలు రైల్వే స్టేషను

ఎన్.హెచ్.16., రాష్ట్ర రహదారులు, జిల్లా పరిషత్ రహదారులు, ఇతర జిల్లా రహదారులు వున్నాయి. చెన్నై - ఢిల్లీ రైలు మార్గం, గుంతకల్లు -గుంటూరు రైలు మార్గం జిల్లాలోని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కలిగిస్తున్నాయి.

జనాభా లెక్కలు సవరించు

2011 భారత జనగణన ప్రకారం, 2022 లో సవరించిన జిల్లా పరిధిలో జనసంఖ్య 22.88 లక్షలు, [1] [13][14][15]

సంస్కృతి సవరించు

ఉమ్మడి ప్రకాశం సంస్కృతి రెండు ప్రాంతాల (రాయలసీమ, కోస్తా) మేళవింపుగావుంది. మార్కాపూర్ డివిజన్ లో కర్నూలు ప్రాంత, గుంటూరు ప్రాంత సంస్కృతులు కలసినవున్నాయి. ఒంగోలు, కందుకూరు డివిజన్లలో ప్రధానంగా బియ్యం ఆహారం తీసుకోగా, మార్కాపూర్ డివిజన్లో రాగి, మొక్కజొన్న, బియ్యం ఆహారంగావాడుతారు. ఈ జిల్లా తీరంలో వున్న మత్స్యకారుల సంస్కృతి ఈ జిల్లాకు వైవిధ్యాన్ని పెంచుతుంది. ఈ జిల్లా తెలుగు మాండలికం, బాగా ఎక్కువగా అర్థమయ్యే తెలుగు మాండలికాల్లో రెండవది.

పశుపక్ష్యాదులు సవరించు

ఒంగోలు గిత్త ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. అమెరికా, హాలండ్. మలేషియా, బ్రెజిల్, అర్జెంటీనా లాంటి చాలా దేశాలకు ఎగుమతి చేయబడింది. మలేషియాలో ఒక ద్వీపం ఒంగోలు ద్వీపంగా పేరుపెట్టారు. ఈ జాతి పశువులు ప్రపంచంలో లక్షలలో వుంటాయి . 2002 భారత జాతీయ పోటీల చిహ్నం ఐన వీర1 ఒంగోలు గిత్త. పొట్టి కొమ్మల ఒంగోలు జాతి గిత్తలు, నంది శిల్పాలలాగా వుంటాయి.

విద్య సవరించు

ఒంగోలు ప్రాంతంలో బాలికలకు ప్రత్యేకంగా పాఠశాలలు లేని కాలంలో మొదటిసారిగా 1867లో అమెరికన్ బాప్టిష్ట్ మిషన్ కు చెందిన క్లైవ్ దంపతులు ఒక బాలికల పాఠశాలను 1867లో స్థాపించుటయే గాక, ఒక లోయర్ గ్రేడ్ ట్రైనింగ్ స్కూలు కూడా 1892లో స్థాపించారు. 2014-15 సంవత్సరంలో 4751 విద్యాసంస్థలలో 610126 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.[2]

పర్యాటక ఆకర్షణలు సవరించు

 
ప్రకాశం జిల్లా దర్శనీయ ప్రదేశాలు(జుమ్ చేసి మౌజ్ సూచికలమీద ఉంచి వివరాలు, లింకులు పొందవచ్చు)
 
చెన్నకేశవస్వామి దేవాలయం,మార్కాపురం
 
శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టు. మల్లవరం
 
భైరవకోన గుహాలయాల సముదాయం

వైద్యం సవరించు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9 అల్లోపతి వైద్యశాలలు, 46 డిస్పెన్సరీలు, 90 అయుర్వేద వైద్యశాలలు, 1 యునాని వైద్యశాల ఉన్నాయి.

సహకార సంఘాలు సవరించు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2,62,000 మంది సభ్యులతో జిల్లాలో 1275 సహకార సంఘాలున్నాయి. వీటిలో 1086 సాధారణ, 69 చేనేత,68 పారిశ్రామిక, 31 మత్స్యకార, 21 పాలసరఫరా సహకార సంఘాలు.

క్రీడలు సవరించు

జిల్లాలో ఎండాకాలంలో పలు చోట్ల ఎడ్ల బలప్రదర్శన నిర్వహిస్తారు . జిల్లా నలుమూలలనుండి రైతుల పాల్గొంటారు.

ప్రముఖవ్యక్తులు సవరించు

ఆంధ్రకేసరి బిరుదాంకితులు ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు, కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య. శాసనసభ స్పీకర్ దివికొండయ్య,పిడతల రంగారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఈ జిల్లావారే. సంగీత ప్రపంచంలో పేరుగాంచిన వారిలో త్యాగరాజు, శ్రీరంగం ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేసిన షేక్ చినమౌలానా . సినీరంగంలో ప్రముఖులు దగ్గుబాటి రామానాయుడు అత్యధిక చలన చిత్రాలు నిర్మించిన నిర్మాతగా పేరుతెచ్చుకున్నాడు. ఇంకా గిరిబాబు,రఘుబాబు గోపిచంద్, టి.కృష్ణ ఈ జిల్లా వారే.

ఇవీ చూడండి సవరించు

మూలాలు సవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
 2. 2.0 2.1 Chief Planning Officer, Prakasam District (2015). "Handbook of statistics 2015 Prakasam district" (PDF). Archived from the original (PDF) on 2019-07-21. Retrieved 2019-07-21.
 3. Chief Planning Officer, Prakasam District (2014). "Handbook of statistics 2014 Prakasam district (searchable pdf)" (PDF). Archived from the original (PDF) on 2018-07-13. Retrieved 2019-07-22.
 4. "ప్రకాశం జిల్లా". ఈనాడు ప్రతిభ. Archived from the original on 2019-04-13. Retrieved 2019-10-26.
 5. "ఎపిఆన్లైన్ లో జిల్లా పరిచయపత్రం". Archived from the original on 2016-10-19. Retrieved 2012-02-03.
 6. "కొత్త జిల్లా తాజా స్వరూపం". Eenadu.net. 31 March 2022. Retrieved 31 March 2022.
 7. 7.0 7.1 "District Resource Atlas-Prakasam District" (PDF). 2018-12-01. Archived from the original (PDF) on 2019-07-17. Retrieved 2019-07-17.
 8. "Prakasam Irrigation Profile" (PDF). AP Irrigation. Archived from the original (PDF) on 2018-12-21.
 9. APSAC (2018). DISTRICT SURVEY REPORT, PRAKASAM DISTRICT (PDF). Archived from the original (PDF) on 2019-10-17.
 10. "పరిశ్రమాభివృద్ధిశాఖ జిల్లా పరిశ్రమలపత్రం" (PDF). Archived from the original (PDF) on 2012-05-13. Retrieved 2012-05-17.
 11. "డెమోగ్రఫీ". ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. Retrieved 2022-04-30.
 12. "STATISTICAL INFORMATION OF ULBs & UDAs" (PDF). 2019-02-27. p. 3. Archived from the original (PDF) on 2019-07-17.
 13. "District Census Handbook Prakasam-Part A" (PDF). 2014-06-16. Archived from the original (PDF) on 2018-11-14.
 14. "District Census Handbook Prakasam-Part B" (PDF). 2014-06-16. Archived from the original (PDF) on 2015-08-25.
 15. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.

వెలుపలి లంకెలు సవరించు