అబ్దుల్ ఖాదర్ వేంపల్లి

చిత్రకారుడు, నటుడు, కవి

డాక్టర్. హాజీ వేంపల్లి అబ్దుల్ ఖాదర్ సాహిత్య ప్రస్థానం

తెరచిన పుస్తకం ప్రపంచాన్ని చూపిస్తే ఆ ప్రపంచాన్ని పౌర సమాజంలోకి నడిపించే వాడే రచయిత. కవి సృష్టి కవిత్వం సమాజ గతిని మార్చే చైతన్యమే సాహిత్యం. ఈ సాహిత్యం నిక్షిప్తమైన అక్షరం అంతరంగం తెలిసిన స్వాప్నికుడు డాక్టర్ వేంపల్లి అబ్దుల్ ఖాదర్. 1964లో తొలి రచన జీవిత వైచిత్రితో ఆయన సాహిత్య ప్రస్థానం ప్రారంభమైంది. 40 వ దశకం మధ్యలో పుట్టిన ఆయన విద్యాభ్యాసం కలికిరిలో జరిగింది. డ్రాయింగ్ మాస్టర్ గా గ్రేట్ వన్ తెలుగు పండిట్ గా,తెలుగు లెక్చరర్ గా ప్రిన్సిపాల్ గా, రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యుడిగా ఆయన ప్రయాణం సాగింది. ఏ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందారో అదే వర్సిటీలో పాలకమండలి సభ్యులయ్యారు. అర్ధ శతాబ్దం పాటు వర్సిటీ అభ్యున్నతికి కృషి చేశారు. ఆయన కథా సంపుటిలోని బిడ్డలు కథ ఎస్ వి యూనివర్సిటీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ డిగ్రీ తలగుతుల సిలబస్లో చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదర్ కలం నుంచి అన్ని సాహిత్య ప్రక్రియలోను - అంటే కథ, కవిత, సాహిత్య విమర్శ, పద్యరచన, నవల, నాటిక వంటి రచనలు జాలువారాయి. మల్లెరేకు, బిడ్డలు, మెతుకు కధా సంపుటులు, చినుకు, మేఘం, కిరణం కవితా సంపుటులు, వాకిలి, ఆలోచన సాహిత్య విశ్లేషణలు. పసిడి పలుకు శతక సాహిత్యం - అభిమానులను అల్లరించాయి. ఎందరో సాహిత్యకారుల రచనలకు ముందుమాటలు రాశారు. ఆయన కవితలు కన్నడ, మలయాళం, తమిళం, తులు వంటి ద్రావిడ భాషల్లోకి అనువాదమయ్యాయి. డాక్టర్ అబ్దుల్ ఖాదర్ ను ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతి రావు ఎచ్ ఏం టీవీ ఛానల్ లో అర్థగంట సేపు ముఖాముఖిలో మాట్లాడారు.(https://www.youtube.com/watch?v=O963dSAB2vI&t=129s).

ఆ సందర్భంగా వందేళ్ళ కథకు వందనాలు పుస్తక ఆవిష్కరణ సభలో అబ్దుల్ ఖాదను సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, గొల్లపూడి మారుతి రావు ప్రభృతులు సన్మానించారు. వందలాది కళా సాహిత్య సాంస్కృతిక విద్యాసంస్థలు ఎన్నో సత్కరించాయి. ఎన్నో వందలాది ఉపన్యాసాలు ఇచ్చారు. ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ప్రతిభావంతుల ర్యాలీలు మొక్కల పెంపకం ఆయుర్వేద ఉచిత చికిత్స శిబిరాలు వంటి వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ముఖ్యపాత్ర వహించారు. స్థానిక జామియా మసీదు, రాష్ట్ర పండిత పరిషత్, సాగునీటి సంఘం, లైన్స్ క్లబ్ అధ్యక్షులుగా, చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా విశిష్ట సేవలు అందించారు. రాష్ట్ర నూర్ బాషా ముస్లిం సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులుగా రాష్ట్ర కలికిరి శాఖ రిటైర్డ్ ఉపాధ్యాయుల గౌరవ అధ్యక్షుడిగా పనిచేశారు. మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షుడుగా ఉన్న రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యులుగా చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పర్యటించి తెలుగు భాష అమలుకు, వికాసానికి విశేషమైన కృషి చేశారు. తెలుగు భాష వెలగాలంటే వారసత్వ సంపదగా వచ్చే ప్రాచీన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల సాంస్కృతిక మూలాలను బ్రతికించుకోవాలని ప్రచారం చేశారు. 2024 సంవత్సరం నాటికి 79 వసంతాలు దాటుతున్నా ఆయన మొక్కవోని లక్ష్యంతో చెక్కుచెదరని ఆదర్శంతో సామాజిక హితం కోరే సృజనాత్మక రచనలు చేస్తున్నారు. సాహిత్య సభలు, అష్టావధానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1999లో జక్కదనులో హిడింబాసుర వధ వంటి తెలుగు షార్ట్ ఫిలిం నిర్మాణం చేశారు. సినీ నటులు రోజా, చంద్రమోహన్, విజయ్ కుమార్ ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన్ని సన్మానించారు. స్టేట్ బెస్ట్ టీచర్, రాష్ట్ర భాషా సంఘం, పులికంటి సాహితీ సత్కృతి, రంజని కుందుర్తి, కుప్పం రెడ్డమ్మ, భరత ముని, న్యూఢిల్లీ ప్రభసాంద్ర, లైన్స్ క్లబ్, నాగభైరవ విశిష్ట పురస్కారాలు, కళావతి రేవతి, మదనపల్లి ఫైన్ ఆర్ట్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులు పొందారు. వీరి లేఖిని నుండి మరిన్ని ప్రజాహిత చైతన్య రచనలు విలువడాలని ఆకాంక్షిద్దాం!.

డాక్టర్ వేంపల్లి సాహిత్య వారసత్వం :

ఆయన తండ్రి వేంపల్లి హుస్సేన్ సాహెబ్ చేసే ప్రతి పనిలోనూ, ఆడే ప్రతి మాటలోనూ సృజనాత్మకత ఉట్టిపడేది. ఆయన మాటలు ఎంతో ఆసక్తికరంగా, భావస్ఫోరకంగా, వర్ణనాత్మకంగా, ప్రతీకలుగా ఉండేవి. శ్రోతలకదే మంచి విందు భోజనం. మడక మేడి పట్టాడంటే నూలుకు కొండ్ర పడేది. మడి చుట్టూ అండ కొట్టాడంటే త్రోవన పోయే వాళ్ళు నిలిచి చూసేవారు. పాదులు తీస్తే చేయి తిరిగిన రచయిత అక్షరాలు రాసినట్టు ఉండేవి. వ్యవసాయ పనిముట్లు అద్భుతంగా చెక్కేవాలు. బహుశా ఆయన సృజనాత్మకత, కళాత్మక దృష్టే ఆయన్ని కవిగా రచయితగా నిలబెట్టాయి.

~ డాక్టర్ వేంపల్లి అబ్దుల్ ఖాదర్ కవి, రచయిత, విమర్శకుడు మరియు కళాకారుడు

రచనా వ్యాసంగం మార్చు

1966లో 'ఆంధ్రప్రభ' వారపత్రికలో ప్రచురితమైన 'జీవితచక్రం' అనే కవితతో వీరి రచనా వ్యాసంగం ప్రారంభమైనది. అప్పటినుండి కథలు, వచన కవితలు, మొదలగునవి ఎన్నో వ్రాశారు.

సాహిత్య కళారంగాలు మార్చు

అబ్దుల్‌ ఖాదార్‌ వేంపల్లి గారు వ్రాసి ప్రచురించిన వాటిలో ముఖ్యమైనవి.

  1. చినుకు (వచన కవితా సంపుటి)
  2. మల్లెరేకు (కథాసంపుటి)
  3. వాకిలి (సాహిత్య వ్యాసాలు)
  4. మేఘం (వచన కవితా సంపుటి) [1]

ఖాదర్ అష్టావధానం, నాట్యావధానం వంటివాటిలోనూ భాగస్వామిగా పాల్గొన్నారు. చిత్రకారునిగానూ, నటునిగానూ, కవిగానూ పలు పురస్కారాలు పొందారు.

అవార్డులు- పురస్కారాలు మార్చు

అబ్దుల్ ఖాదర్ వేంపల్లి అందుకున్న పురస్కారాలు

  1. 1999లో రంజని కుందుర్తి జాతీయ సాహితీ పురస్కారం
  2. 2000 సంవత్సరములో ఎక్స్‌రే అవార్డు
  3. 2003లో పులికిం సాహితీ సంస్కృతి పురస్కారం
  4. 2004లో ప్రవాసాంధ్రా వసంతోత్సవ పురస్కారం
  5. 2005 లో ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా పురస్కారం

లక్ష్యం మార్చు

ప్రజలను మానవతా మూర్తులుగా తీర్చి దిద్దే ప్రయత్నమే వీరి లక్ష్యంగా పనిచేస్తున్నారు.

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు