ఆంధ్రప్రభ

తెలుగు దినపత్రిక

ఆంధ్రప్రభ ఒక తెలుగు దిన వార్తాపత్రిక. ఇది 1938 సంవత్సరం ఆగష్టు 15న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని రామనాథ్ గోయంకా మద్రాసులో ప్రారంభించారు [1]. అప్పుడు ఖాసా సుబ్బారావు సంపాదకులుగా ఉన్నాడు. అతని తరువాత న్యాపతి నారాయణమూర్తి సంపాదకులైనాడు. 1942లో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కొంతకాలం విద్వాన్ విశ్వం సంపాదకత్వంలో ఆంధ్రప్రభ వెలిగిపోయింది. 1958-59లో కార్మిక వివాదం కారణంగా పత్రిక యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నార్ల వెంకటేశ్వర రావు సంపాదకత్వానికి రాజీనామా చేశాడు. నార్ల సంపాదకులుగా పనిచేసిన సుమారు పదహారు సంవత్సరాలు ఆంధ్రప్రభ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.నాస్తికుడైన నార్ల వెంకటేశ్వరరావు అనేక సంప్రదాయ విరుద్ధ పోకడలు ప్రవేశ పెట్టారనీ తదనంతర కాలంలో వచ్చిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. యాజమాన్యం మారడానికి ముందు సంపాదకులుగా సుమారు దశాబ్దకాలం పనిచేసిన శ్రీ వి. వాసుదేవ దీక్షితులు గారి విశ్లేషణ, పద విన్యాసం, ఒడుపుగా పాఠకుణ్ణి తన సంపాదకీయం ఆసాంతం చదివించే విధానం‌ నభూతో అన్న చందంగా ఉండేది. విషయంతో బాటు, భాషా పరిజ్ఞానాన్ని పెంచడంతో బాటు భావ ప్రకటనలో చురుకుదనాన్ని, లోతుని అందించారాయన. శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి గురించి ప్రస్తావించకపోతే... ఆంధ్రప్రభ గురించి ఎంత చెప్పుకున్నా... అది‌ సగం కూడా పూర్తయినట్లు కాదు.

ఆంధ్రప్రభ
Andhraprabhalogo.gif
రకంప్రతిదినం
రూపం తీరుబ్రాడ్షీట్
యాజమాన్యందిన్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్
ప్రచురణకర్తదిన్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్
స్థాపించినది1938-08-15
మద్రాసు,[1]
జాలస్థలిhttp://www.prabhanews.com/home

మూలాలుసవరించు

  1. 1.0 1.1 బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ఆంధ్రప్రభ", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 418–419.CS1 maint: extra punctuation (link)

బయటి లింకులుసవరించు