అబ్దుల్ బారీ (ప్రొఫెసరు)
భారతీయ రాజకీయవేత్త
అబ్దుల్ బారీ (1892-1947) భారతీయ విద్యావేత్త, సంఘ సంస్కర్త. అతను సయ్యద్ ఇబ్రహీం మాలిక్ బాయా వారసుడు. అతను విద్య ద్వారా ప్రజలను జాగృతం చేసి, భారతీయ సమాజంలో సంస్కరణ తీసుకురావడానికి కృషి చేసాడు. [1] బానిసత్వం, సామాజిక అసమానతలు, మతపరమైన అసమానతలు లేని భారతదేశం +గురించి -అతను భావన చేసాడు. [2] స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, చివరకు ఉద్యమం కోసమే తన జీవితాన్ని త్యాగం చేశాడు. [3] [4] [5]
అబ్దుల్ బారీ | |
---|---|
జననం | అబ్దుల్ బారీ 1892 కన్సువా, బీహార్ |
మరణం | 1947 మార్చి 28 |
మరణ కారణం | ఫతువా రైల్వే క్రాసింగు వద్ద కాల్చి చంపారు |
సమాధి స్థలం | పట్నాలో పీర్‌మొహానీ శ్మశానం |
జాతీయత | భారతీయుడు |
విద్య | పాట్నా విశ్వవిద్యాలయానికి చెందిన, పాట్నా కళాశాల నుండి ఎం.ఏ |
వృత్తి | టాటా కార్మిక సంఘం అధ్యక్షుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1917–1947 |
టాటా స్టీల్ కార్మిక సంఘం | |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | 1921, 1922, 1942 ల్లో స్వాతంత్ర్య సమరం లో భాగంగా బీహార్, బెంగాల్, ఒరిస్సాల్లో కార్మికుల ఐక్యత కోసం కృషి చేసాడు |
పదవీ కాలం | 1936–1947 |
అంతకు ముందు వారు | సూభాస్ చంద్ర బోస్ |
తరువాతివారు | మైకెల్ జాన్ |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు |
ఉద్యమం | క్విట్ ఇండియా ఉద్యమం |
జీవిత విశేషాలు
మార్చు1937 లో టిస్కో (ప్రస్తుతం టాటా స్టీల్) మేనేజ్‌మెంట్‌తో అతని మొదటి చారిత్రిక ఒప్పందం. [6]
అబ్దుల్ బారీ మొదటి వర్ధంతి సందర్భంగా, 1948 మార్చి 22 న మజ్దూర్ అవాజ్‌లో ప్రచురించబడిన సందేశం ద్వారా రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, జాతికి అతడు చేసిన సేవను గుర్తు చేసుకున్నాడు. [1]
అతని పేరు పెట్టబడిన ప్రదేశాలు, సంస్థలు
మార్చు- అబ్దుల్ బారి మెమోరియల్ కళాశాల, గోల్మురి, జంషెడ్‌పూర్
- అబ్దుల్ బారీ టౌన్ హాల్, జెహనాబాద్
- బారీ మైదాన్ సక్చి, జంషెడ్‌పూర్
- బారి పార్క్, రాంచీ
- ప్రొ. అబ్దుల్ బారీ టెక్నికల్ సెంటర్, పాట్నా
- ప్రొ. అబ్దుల్ బారీ మార్గం, పాట్నా
- ప్రొ. అబ్దుల్ బారి మెమోరియల్ హై స్కూల్, నోముండి ఐరన్ మైన్, సింగ్‌భూమ్ (W), జార్ఖండ్
- బారీ మైదాన్, బర్న్‌పూర్, అసన్సోల్
- ప్రొ. అబ్దుల్ బారీ రైలు-రోడ్డు వంతెన, కోయిల్వార్
- బారి మంజిల్ (యునైటెడ్ ఐరన్ & స్టీల్ వర్క్స్ యూనియన్), కుల్తి
ఆకరాలు
మార్చు- డా. రాజేంద్ర ప్రసాద్: కరెస్పాండెన్స్ అండ్ సెలెక్ట్ డాక్యుమెంట్స్ సంపుటి 8 - వాల్మీకి చౌధురి. సెంచురీ పబ్లికేషన్స్ ప్రచురణ
- రాజేంద్ర ప్రసాద్ రాసిన "మహాత్మా గాంధీ పాదాల వద్ద" ఆసియా పబ్లికేషన్ హౌస్ ప్రచురణ
- ప్రభుత్వం ప్రచురించిన కలికింకర్ దత్త రచించిన "బీహార్‌లో స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర"
- సరూప్ & సన్స్ ప్రచురించిన రీతు చతుర్వేది రచించిన "బీహార్ థ్రూ ఏజెస్"
- "మై డేస్ విత్ గాంధీ", నిర్మల్ కుమార్ బోస్ పేజీ 139
- కలిసి పనిచేయడం: శిక్షణ సాంకేతిక ఇతర మార్పులలో కార్మిక నిర్వహణ సహకారం - జెనీవా లోని అంతర్జాతీయ కార్మిక కార్యాలయం, ప్రచురించిన అలన్ గ్లాడ్‌స్టోన్, మునెటో ఓజాకిల రచన
- ది పాలిటిక్స్ ఆఫ్ ది లేబర్ మూవ్‌మెంట్: ది ఎస్సే ఆన్ ఆన్ డిఫరెన్షియల్ ఆస్పిరేషన్స్ దిలీప్ సిమియోన్
- హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కో లిమిటెడ్ డా. ఎన్. ఆర్. శ్రీనివాసులు
- టాటా వర్కర్స్ యూనియన్ యొక్క అధికారిక వెబ్‌సైట్
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Choudhary, Valmiki. Dr. Rajendra Prasad: Correspondence and Select documents Volume 8. Centenary Publication. p. 421.
- ↑ Gladstone, Alan; Ozaki, Muneto (1991). Working together: labour-management cooperation in training and in technological and other Changes. Geneva: International Labour Office. p. 191.
- ↑ Prasad, Rajendra (1961). At the feet of Mahatma Gandhi. Asia Publication House. p. 178.
- ↑ Datta, Kalikinkar (1957). History of the freedom movement in Bihar. Govt. of Bihar.
- ↑ Chaturvedi, Ritu (2007). Bihar Through the Ages. Sarup & Sons. p. 55.
- ↑ Simeon, Dilip. "The Politics of the Labour Movement: An Essay on Differential Aspirations". Archived from the original on 23 ఆగస్టు 2017. Retrieved 30 January 2011.