అబ్దుల్ వాహెద్
అబ్దుల్ వాహెద్ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు. ఫేస్ బుక్ సామాజిక వేదిక ద్వారా తన కవిత్వాన్ని ప్రకటిస్తున్నారు.
వ్యక్తిగత జీవితం
మార్చువాహెద్ పశ్చిమగోదావరి జిల్లా, గుండుగొలను గ్రామంలో జూలై 24 న జన్మించారు. ఆయన బాల్యాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోనే గడిపారు.
వృత్తి
మార్చుపాత్రికేయునిగా రెండు దశాబ్దాలకుపైగా పత్రిక, ఛానెల్ రంగాల్లో పనిచేశారు. ఆయన హెచ్.ఎం.టివి, స్టూడియో ఎన్, గీటురాయి వంటి ప్రసార మాధ్యమాలలో వివిధ హోదాల్లో పనిచేశారు. వృత్తిజీవితంలో భాగంగా సంస్కృతి టి.వి. చానెల్లో అతిథి దేవోభవ కార్యక్రమంలో ఇంటర్వ్యూలు చేశారు.
సాహిత్యరంగం
మార్చుకవిత్వం పట్ల ఆసక్తితో చిన్నతనం నుంచీ వివిధ సాహిత్యప్రక్రియల్లో కృషి ప్రారంభించిన వాహెద్ వచన కవిత్వాన్ని ఎంచుకుని సాహిత్య ప్రస్థానం సాగిస్తున్నారు. వివిధ పత్రికల్లో ఆయన రాసిన కవితలు ప్రచురితమయ్యాయి. అంతర్జాలంలో తెలుగులో వ్రాయగలిగేలా ఉపకరణాలు అభివృద్ధి అయ్యాకా వివిధ అంతర్జాల వేదికలపై రచనలు చేశారు. ఈ క్రమంలోనే ఫేస్ బుక్ స్వంత పేజీలో, కవిసంగమం ఫేస్ బుక్ వేదికలో కవిత్వాన్ని వ్రాస్తున్నారు. అంతర్జాలం ఆవల కూడా కవిసంగమం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
శైలి
మార్చుఉర్దూ భాషా సౌకుమార్యాన్ని తెలుగులో రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నారు.