కవిసంగమం

(కవిసంగమం - తెలుగు కవిత్వ వేదిక నుండి దారిమార్పు చెందింది)

కవిసంగమం అనేది ఫేస్ బుక్ సామాజిక మాధ్యమంలో తెలుగు కవిత్వాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్న సమూహం పేరు. కవిసంగమం ఫేస్ బుక్ కవిసంగమం సమూహం 2012లో ప్రారంభం అయింది. ప్రముఖ కవి యాకూబ్ దీనికి నాంది పలికారు. తాము రాసిన కవిత్వాన్ని గ్రూపు వేదికగా మిత్రులతో పంచుకోవడం, సలహాలూ సూచనలూ తీసుకోవడంతో కవిత్వ రచనపై ఇష్టాన్ని పెంచడంతో పాటు మెళకువలు తెలుసుకోవడం, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం దీనిలో ప్రధానంగా జరుగుతుంది. ప్రతిరోజూ ప్రత్యేక అంశాన్ని పిన్ పోస్టు చేయడం ద్వారా అవగాహన కల్పించడం మరో విషయం. అంతర్జాలంలోనే కాకుండా ప్రత్యక్షంగా కలుసుకుని నెలనెలా కవిత్వం పఠనం చేయడం, ప్రముఖ కవులనూ వారి కవిత్వాన్నీ పరిచయం చేయడం, కవిత్వ సంభంధ కార్యక్రమాలను నిర్వహించడం దీనిలోని ప్రధానాంశాలు.

ప్రారంభం

మార్చు

కవిసంగమం ఫేస్ బుక్ కవిసంగమం సమూహం చిన్ని ప్రయత్నంతో 2012 లో ప్రారంభం అయింది. ప్రముఖ కవి యాకూబ్ దీనికి నాంది పలికారు. అంతర్జాలంలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకొని ఫేస్ బుక్ చేస్తున్న వివిధమైన సామాజిక చలనాలను (సోషల్ డైనమిక్స్) గమనించి తెలుగు కవులకు ఒక మంచి వేదికగా దీన్ని మలచుకోవచ్చు అనే ఆలోచన ఈయన దీనిని రూపొందించారు. అతనికి వ్యక్తిగతంగా పాతిక ఏండ్లుగా పరిచయమైన కవి ప్రపంచాన్ని ముఖ్యంగా ఇప్పుడిప్పుడే గొంతువిప్పుతున్న వారు ఆధునిక నెట్ ప్రపంచాన్ని తెలుసుకున్న యువతీ యువకులైన కవులను ఒకచోటికి తేగలిగారు. ఈ రెండు సంవత్సరాలలో ఇది బాగా వ్యాప్తి చెందినది. ఇప్పటివరకున్న వివరాల ప్రకారం 200 మందికి పైగా కవులు, 4,300 మందికి పైగా కవితాభిమానులు ఈ వేదికలో పాలుపంచుకుంటున్నారు.[1]

తెలుగులో ఒక కవి సుమారు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు కవిత్వం రాసి లేదా ఒక ఏడాదిలో రాసిన కవితలను అన్నింటిన ఒక కవితా సంకలనంగా తెచ్చి, మరికాస్త కష్టపడి దానికి డబ్బుఖర్చూ పెట్టి పుస్తకావిష్కరణ చేయిస్తాడు. ఎవరో ఒక మంచి అనుభవజ్ఞుడో పేరున్నవాడో వచ్చి దాన్ని ఆవిష్కరిస్తాడు. రెండో రోజు పేపర్లో వార్త వస్తుంది. కాని ఆ పుస్తకాన్ని ఎవరు చదువుతారు. సదరు కవే ఒక వంద కాని రెండు వందల కాపీలు కాని తనకు తెలిసనవారికి పోస్టులో, ఆ ఖర్చులూ ఆయనే పెట్టుకొని పంపిస్తాడు. ఆ వందమందిలో కనీసం ఒక పాతిక మంది దాన్ని చదువుతారో లేదో. అందులో ఒక నలుగురు ఆయిదుగురు కాస్త వ్యక్తిగత క్రమశిక్షణ, మంచి బుద్ధీ ఉన్నవారు. మీ కవితలు బాగున్నాయని ఒక నెలకో ఏడాదికో ఉత్తరం రాస్తారు. దానికి ఈ అల్పసంతోషి అయిన కవి ఎంతో సంతోషిస్తాడు.

తెలుగు కవులకు నిన్న మొన్నటిదాకా ఉన్న పరిస్థితి ఇది. కాని కవిసంగమం ఈ పరిస్థితిన బద్దలు కొట్టింది. ఈ పరిస్థితిని బద్దలు కొట్టింది నిజానికి ఫేస్ బుక్ అంటే అంతర్జాల పరిజ్ఞానం. ఈ పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టి ఆధునిక తెలుగు కవిత్వానికి దీన్ని ఒక వేదికగా మలచిన ఘనత నిస్సందేహంగా యాకూబ్ కు దక్కుతుంది. దీనితర్వాత కవిసంగమంలో భాగం కాని వారు కూడా ఫేస్ బుక్ లో తమ కవిత్వన్ని పెడుతున్నారు. బ్లాగుల్లో పెడుతున్నారు. ఈ కవితలు కూడా భాగస్వామ్యం రీత్యా కవిసంగమం లోనికి వస్తున్నాయి. అంతే కాదు గూగులమ్మను అడిగి తెలుగు కవిత్వాన్ని గురించి తెలుసుకోవలనుకున్నవారికి కూడా కవిసంగమంలోని కవుల వివరాలు కవితలు అందుబాటులోనికి వస్తున్నాయి.

ఒక కవి తన కవితను రాసిన తర్వాత ఏ మాత్రం ఎడం లేకుండా అంటే రాత్రి కవితను రాస్తే తెల్లవారి పాటికి తన బృందంలోని సుమారు 200 మంది కవిత్వంపైన ప్రేమ ఉన్న పాఠకులకు అందేలా చేస్తున్నాడు. ఇది ఫేస్ బుక్ వేదిక మీద సాధ్యం అవుతూ ఉంది. అంతే కాదు దీని విజయం ఏమంటే ఆకవికి చాలా విలువైన అభిప్రాయ మాల మరుసటి రోజు సాయంత్రానికి తెలిసి పోతూఉంది. ఒక కవితకు సుమారు వందకు పైగా అభిప్రాయ ప్రకటనలు ఒక్కరోజులో రావడం ఒక్కరోజులో కొన్ని వందలమంది సాధారణ పాఠకులు కాక కవిత్వం కోసం ఉన్న ప్రత్యేకమైన పాఠకులు ఆ కవితను చదవడం మామూలు విషయం కాదు. ఆ కవికి వచ్చే ప్రోత్సాహం కాని సంతోషం కాని ఇంతకు ముందు సంప్రదాయ పద్ధతుల్లో అచ్చుపుస్తకం ద్వారా రావడం అన్నది కలలో కూడా ఊహించడానికి సాధ్యం కానిది. కవికి వచ్చే స్థితిని కాస్సేపు పక్కకు పెట్టి కవిత్వానికి వచ్చే స్థితిని గురించి ఆలోచిస్తే మరింత సంతోషకరంగా కనిపిస్తూ ఉంది. కవిత్వ వ్యాప్తి ఇబ్బడి ముబ్బడిగా మునుపెన్నడూ లేని వేగంతో వ్యాప్తి చెందుతూ ఉంది. ఇది తెలుగు సాహిత్య కారులు అందరూ సంతోషంగా గర్వించదగిన విషయం.

మరొక ముఖ్యమైన తెలుసుకోవలసిన విషయం ఏమంటే.. తెలుగు కవిత్వం ఒక కొత్త శకంలోనికి ప్రవేశించింది అని చెప్పాలి. తెలుగు కవిత్వం ఇప్పటిదాకా రెండు మాధ్యమాలలో ప్రవర్తిస్తూ ఉంది. అది ఒకటి మౌఖిక మాధ్యమం రెండోది లిఖిత మాధ్యమం. ఈ రెండు కలిసిన మిశ్రమాధ్యమంలో కొన్ని కవితా ప్రక్రియలు ప్రవర్తించాయి. అవి శతకాలు, తత్త్వాలు వాగ్గేయకారుల పాటలు. కాని అంతర్జాలం కారణంగా మరొక మాధ్యమం వచ్చింది అది ఎలక్ర్టానిక్ మాధ్యమం, దీన్నే విద్యున్మాధ్యమం అని అనాలి. ఇది ఎలా ప్రత్యేక మాధ్యమం అయిందో చెప్పవచ్చు. ఒక కవి తన కవితను బ్లాగులో కాని ఫేస్ బుక్ లో కాని రాస్తున్నాడు అంటే ప్రచురిస్తున్నాడు. అతని పాఠకులు కూడా ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే చదువుతున్నారు. దానిపైని అభిప్రాయాలు కూడా అదే మాధ్యమంలో విస్తరిస్తున్నాయి. అదే మాధ్యమంలో కల కాలం నిలబడుతున్నాయి. అంటే ఇక్కడ కవిత్వం పుట్టుక, వ్యాప్తి నిలకడ అనేవి మొత్తం ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఈ కారణంగా తెలుగు కవిత్వం పూర్తిగా నూతన ప్రసార మాధ్యమంలోనికి చేరిందని చెప్పవచ్చు. ఇది నూతన మాధ్యమంగా నూతన యుగంగా చెప్పుచ్చు. అంతే కాదు ఈ ఆధునిక అంతర్జాల సాంకేతిక కారణంలో తెలుగుకవిత్వంలో గుణాత్మక పరిణామం కూడా వచ్చిందని చెప్పవచ్చు. ఇటీవలికాలంలో కవిసంగమం సభ్యుడైన వంశీధర రెడ్డి రాసిన కవితలు, అఫ్సర్, యాకూబ్ రాసిన కొన్ని కవితలు, దెంచనాల శ్రీనివాస్ మరీ ఇటీవల ప్రకటించిన భస్మసారంగి కవితలు చూస్తుంటే ఆధునిక సాంకేతికత ఆధునికత ఎంతగా తెలుగు కవిత్వాన్ని ప్రభావితం చేస్తూ ఉందో తెలిసి సంతోషం కలుగుతూ ఉంది. ఇందువల్ల తెలుగు కవిత్వం మూడో మాధ్యమంలోనికి ప్రవేశించినదని చెప్పవచ్చు. తెలుగు కవిత గుణాత్మక పరిణామాన్ని, మాధ్యమ పరిణామాన్ని పొందినదని మూడో మాధ్యమంలోనికి ప్రవేశించింది.

అయితే కవిసంగమం కన్నా ముందే కొన్ని బ్లాగు పత్రికలు తెలుగు కవిత్వాన్ని అంతర్జాల ప్రపంచంలోనికి తీసుకుపోయాయి. పన్నెండు సంవత్సరాలుగా వస్తున్న తెలుగు బ్లాగు పత్రికలు మనకు ఉన్నాయి. ఈమాట, అనే పత్రిక వీటిలో చాలా పాతదిగా కనిపిస్తూ ఉంది. బ్లాగుల హారాలు జల్లెడ, కూడలి కూడా తెలుగు కవిత్వానికి మంచి వ్యాప్తిని తీసుకువచ్చాయి. వీటి ప్రభావాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేము. ఇటీవల వచ్చిన సారంగ, వాకిలి, విహంగ వంటి పత్రికలు కూడా మంచి వ్యాప్తికి కారణం అవుతున్నాయి. కాని బ్లాగుకు కొన్ని పరిమితులున్నాయి. అవేమంటే నాకు ఒక బ్లాగు ఉందన్న సంగతి తెలిసిన వారు నా గురించి తెలిసినవారు మాత్రమే నా బ్లాగులో ఉన్న కవితలను చదువుతారు. అక్కడ ఒక సమాజం అనేది ఉండదు. మూకుమ్మడిగా ఒకే సారి ఒక గుంపుగా అందరికీ చేర్చే వీలు ఉండదు. కాని ఫేస్ బుక్ గ్రూపులో ఈ సౌకర్యం ఉంది. కవిత్వ వేదికగా ఫేస్ బుక్ ప్రయోగం చాలా విజయవంతం అయినదని చెప్పవచ్చు. ముఖ్యంగా కవిసంగమం ప్రయోగం తెలుగు కవిత్వానికి కొత్త ఒరవడిని సృష్టించింది.

అంతర్జాలాన్ని ఈసడించేవారు. ఆఁ దాన్ని ఎవరు చూస్తున్నారు అనేవారు, దాన్ని అసహ్యించుకునేవారు మనకున్నారు. పెద్దతరం వారిని తప్పు పట్టడం కాదు కాని వారి కాలానికే అందుబాటులో ఉన్న సాంకేతికను ఆహ్వానించలేకపోవడం వల్ల వారిని వారు వెనుకటి కాలానికి పోయిన వారుగా ప్రకటించుకుంటున్నట్లు లెక్క. ఇక సమక్షంలో పొగడి వెనుకనుండి తెగడే గోడమీది పిల్లులు కూడా మనకున్నాయి. వారిని ఉజ్జగించడంమంచిది. కాని పెద్దతరంలో కూడా కొందరు ఇంటర్ నెట్ ప్రభావాన్ని ఫేస్ బుక్ సామాజిక పరిణామ శక్తిని గ్రహించిన వారున్నారు. తెలుగు కవిత్వానికి కూడా ఒక కొత్త మాధ్యమం కొత్త యుగం వచ్చినదని గ్రహించినవారున్నారు. మొదట ఫేస్ బుక్ ప్రయత్నాన్ని కవిసంగమాన్ని నిరసించినవారు కూడా క్రమంగా దీని శక్తిని గ్రహిస్తున్నారు. ఇది ఒక కొత్త ఒరవడి అని తెలుసుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. నిన్నగాక మొన్న జరిగిన కవిసంగమం కవిత్వపు పండుగKavisangamam Poetry Festival చాలా ఆనందాన్ని కలిగించింది. కొత్తతరం సంగతి అలా ఉంచి పాత తరానికి కూడా అంతర్జాల మాధ్యమానికి ఉన్న శక్తిని గురించి తెలుగు కవిత్వపు కొత్త ఉనికిని గురించి తెలియజెప్పడంలో ఈ పండుగ సఫలం అయిందని భావించవచ్చు.

అలాగే ప్రతిరోజూ కవిసంగమంలో ఒక శీర్షికను రాయించడం కూడా ఒక కొత్త ఒరవడి. నౌడూరి మూర్తి, అఫ్సర్, వాడ్రేవు చినవీరభద్రుడు, హెచ్చార్కె, నారాయణస్వామి వెంకటయోగి, కెక్యూబ్ వర్మ, ఎం.నారాయణ శర్మ, అబ్దుల్ వాహెద్, రాజారామ్ తూముచర్ల, అన్నవరం దేవేందర్‌ వంటి ఉద్దండులయిన వారితో పాటు కొత్తతరం శారద శివపురపు, విరించి విరివింటి, కట్టా శ్రీనివాసరావు, అరుణ గోగులమండ లతో కూడా రాయిస్తూ వారిని కవిత్వ విమర్శకులుగా పరిచయం చేయడం కూడా తెలుగుకవిత్వానికి మంచి కాంట్రిబ్యూషనే.

కార్యక్రమాలు

మార్చు

కవిత్వంతో ఒక సాయంత్రం పేరుతో కవిసంగమం ఆధ్వర్యంలో ప్రతినెలా ఒక సాయంత్రంపూట ఎంపిక చేసిన ఐదుగురు కవుల కవిత్వమూ వారి కవిత్వ నేపథ్యంతో ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం ~

  • కొత్తగా రాస్తునవాళ్ళు ప్రత్యక్షంగా సీనియర్ కవులను కలవడం,
  • వారి కవిత్వానుభావాల్ని వినడం, కవిత్వ రహాస్యాలను తద్వారా అవగతం చేసుకోవడం ;
  • అలాగే తామూ చదవడం,రాయడం,
  • కవిత్వం వినడం,
  • కవిత్వం చదవడం
  • కవిత్వ తత్వాన్ని అవగాహన చేసుకోవడం
  • తమను తాము ఇంప్రూవ్ చేసుకోవడం,
  • పాల్గొంటూ,వింటూ నేర్చుకోవడం -

ఆ సిరీస్ ల వివరాలు

  • జూలై 26,2014 - శంషాద్ మహమ్మద్ కవితాసంపుటి ఆవిష్కరణ సభ .
  • జూలై 27,2014 - అఫ్సర్ 'కవితో ఒక సాయంత్రం 'సభ .
  • సెప్టెంబరు 14,2014 - నిర్మలారాణి తోట కవితాసంపుటి ఆవిష్కరణ సభ.
  • ఫిబ్రవరి 22,2014 - కవి నారాయణస్వామి వెంకటయోగితో ఒక కవిత్వ సాయంత్రం కార్యక్రమం జరిగింది.

కవిసంగమం సిరీస్ 1

మార్చు

కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు :నగ్నముని | వసీరా | కిరణ్ గాలి, మెర్సీ మార్గరెట్, చింతం ప్రవీణ్

  • తేది : 2013 జనవరి 27
  • వేదిక : లామకాన్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 2

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : నిఖిలేశ్వర్ | పులిపాటి గురుస్వామి | నందకిషోర్, జయశ్రీనాయుడు, క్రాంతి శ్రీనివాసరావు
  • తేది : 2013 ఫిబ్రవరి 9
  • వేదిక :లామకాన్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 3

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : విమల | బివివి ప్రసాద్ | యజ్ఞపాల్ రాజు, శాంతిశ్రీ, చాంద్ ఉస్మాన్
  • తేది : 2013 మార్చి 9
  • వేదిక :లామకాన్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 4

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : వరవరరావు | కాసుల లింగారెడ్డి | అనిల్ డ్యాని, మెరాజ్ ఫాతిమా, నరేష్ కుమార్
  • తేది :2013 ఏప్రిల్ 13
  • వేదిక :లామకాన్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 5

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : దేవిప్రియ |కోడూరి విజయకుమార్ | సివి సురేష్, వనజ తాతినేని, బాలు వాకదాని
  • తేది : 2013 మే 11
  • వేదిక :లామకాన్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 6

మార్చు

కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : అమ్మంగి వేణుగోపాల్ | రెడ్డి రామకృష్ణ | మొయిద శ్రీనివాసరావు, రాళ్ళబండి శశిశ్రీ, తుమ్మా ప్రసాద్

  • తేది : 2013 జూన్ 8
  • వేదిక : లామకాన్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 7

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : శీలా వీర్రాజు | సత్యశ్రీనివాస్ | లుగేంద్ర పిళ్ళై, సొన్నాయిల కృష్ణవేణి, కృపాకర్ పొనుగోటి
  • తేది : జూలై 13
  • వేదిక : గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 8

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : ఇంద్రగంటి శ్రీకాంతశర్మ |దాసరాజు రామారావు |కాశి రాజు, పూర్ణిమా సిరి, శ్రీకాంత్ కాన్టేకర్
  • తేది : ఆగస్టు 10
  • వేదిక :గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 9

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : దీవి సుబ్బారావు |కుమారవర్మ|భాస్కర్ కొండ్రెడ్డి, భార్గవి జాలిగామ, పోతగాని
  • తేది :సెప్టెంబరు 14
  • వేదిక :గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 10

మార్చు

కవిసంగమం సిరీస్ 11

మార్చు

కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : -నందిని సిధారెడ్డి |జాన్ హైడ్ కనుమూరి |మోహన్ రావిపాటి, కవితా చక్ర, బాలసుదాకర మౌళి

  • తేది :నవంబరు 9
  • వేదిక :గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 12

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు :
  • తేది :
  • వేదిక :గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 13

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : హెచ్చార్కె,|ఖాదర్ మొహియుద్దీన్ | విజయ్ కుమార్ Svk | మధు ఇరువూరి కవిత్వం వినిపించారు.
  • తేది :ఫిబ్రవరి 15,2014
  • వేదిక :గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 14

మార్చు

కవిసంగమం సిరీస్ 15

మార్చు

కవిసంగమం సిరీస్ 16

మార్చు

కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : - రామాచంద్ర మౌళి, స్కైబాబ, వాహెద్, అరుణ నారదభట్ల, పసనకర్ల ప్రకాష్

  • తేది :జూన్ 14, 2014
  • వేదిక :గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 17

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : నాళేశ్వరం శంకరం | ఆర్క్యూబ్ | మడిపల్లి రాజ్ కుమార్ | శంషాద్ మహమ్మద్ | సురేష్ వంగూరి
  • తేది : జూలై 11,2014
  • వేదిక :గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 18

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు :- శిఖామణి | వేముగంటి మురళీకృష్ణ |రాజశేఖర్ గుదిబండి పాల్గొన్నారు.
  • తేది :సెప్టెంబరు 20,2014
  • అనుభంద కార్యక్రమం : కవి వర్చస్వి కవితాసంపుటి ‘‘లోకాస్సమస్తా’’ ఆవిష్కరణ జరిగింది. దీనిలో రాళ్ళబండి కవితాప్రసాద్, సినీనటులు, కవి, రచయిత ఎల్. బి. శ్రీరామ్ పాల్గొన్నారు.
  • వేదిక :గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 19

మార్చు

కవిసంగమం సిరీస్ 20

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : శీలా సుభద్రాదేవి | రేణుక అయోల | శ్రీనివాస్ గద్దపాటి | సి.వి.శారద | కపిల రాంకుమార్
  • తేది :నవంబరు 23,2014
  • వేదిక :గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు :
  • కార్యక్రమం ఫోటోల లింకు :
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా :

కవిసంగమం సిరీస్ 21

మార్చు
 
కవిసంగమం సిరీస్ - 22

కవిసంగమం సిరీస్ 22

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : సుధామ | జి.వి. రత్నాకర్ | కృష్ణమణి | అరుణ గోగులమండ | కంచర్ల శ్రీనివాస్
  • తేది: ఆగస్టు 08, 2015
  • వేదిక: గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు:
  • కార్యక్రమం ఫోటోల లింకు:
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా:

కవిసంగమం సిరీస్ 23

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు: వాడ్రేవు చినవీరభద్రుడు | దెంచనాల శ్రీనివాస్ | శ్రీనివాస్ సాహి | సుభాషిణి తోట
  • తేది: సెప్టెంబరు 12, 2015
  • వేదిక: గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు:
  • కార్యక్రమం ఫోటోల లింకు:
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా:

Event

కవిసంగమం సిరీస్ 24

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు: దర్భశయనం శ్రీనివాసాచార్య| బాలు రెడ్డిబోయిన | రాజేష్ కుమార్| రోహిణీ ఉయ్యాల | రసూల్ ఖాన్
  • తేది:నవంబరు 14, 2015 (రెండవ శనివారం)
  • వేదిక: గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు:
  • కార్యక్రమం ఫోటోల లింకు:
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా:

Event

కవిసంగమం సిరీస్ 25

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు: వఝల శివకుమార్ | కె. విల్సన్ రావు | రాఘవ రాఘవ| శాంతి ప్రబోధ |నవీన్ కుమార్
  • తేది: డిసెంబరు 12, 2015 (రెండవ శనివారం)
  • వేదిక: గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు:
  • కార్యక్రమం ఫోటోల లింకు:
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా:

కవిసంగమం సిరీస్ 26

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : జూకంటి జగన్నాధం | అరణ్యకృష్ణ | సత్యగోపి | వైష్ణవి శ్రీ | సిద్ధార్ధ కట్టా
  • తేది: మార్చి 12, 2016
  • వేదిక: గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు:
  • కార్యక్రమం ఫోటోల లింకు:
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా:

Event

కవిసంగమం సిరీస్ 27

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు : సతీష్ చందర్ | రాజారాం తూముచర్ల | ఇబ్రహీం నిర్గుణ్ | సరిత భూపతి | రాజు పెండ్యాల
  • తేది: ఏప్రిల్ 16, 2016
  • వేదిక: గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు:
  • కార్యక్రమం ఫోటోల లింకు:
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా:

Event

కవిసంగమం సిరీస్ 28

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు: పెన్నా శివరామకష్ణ | అన్వర్‌ | బిల్లా మహేందర్‌ | డా. యశోద పెనుబాల | పెనుగొండ బసవేశ్వర్‌ పాల్గొన్నారు.[2]
  • తేది: మే 14, 2016
  • వేదిక: గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు:
  • కార్యక్రమం ఫోటోల లింకు:
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా:

కవిసంగమం సిరీస్ 29

మార్చు
  • కవిత్వాన్ని చదివేందుకు పాల్గొన్న సభ్యులు: కందుకూరి శ్రీరాములు | బొల్లోజు బాబా | రాజ్‌కుమార్‌ బుంగ | సి.హెచ్. ఉషారాణి | రాజేష్‌ కుమార్‌ మల్లి.[3]
  • తేది: జూలై 9, 2016
  • వేదిక: గోల్డెన్ త్రెషోల్డ్
  • కార్యక్రమం విడియోల లింకు:
  • కార్యక్రమం ఫోటోల లింకు:
  • కార్యక్రమం వివరాలు సంక్షిప్తంగా:

కవిసంగమం సిరీస్ 30

మార్చు

వార్షికోత్సవం/పొయట్రీ ఫెస్టివల్స్

మార్చు

ఫిబ్రవరి 9, 2012న కవిసంగమం గ్రూపు ఫేస్బుక్ లో కవిత్వ వేదికగా మొదలయ్యింది. ఎంతోమంది టెక్నికల్ గా కనీస అవగాహన వున్న సాహితీ మిత్రులను కలుపుకుంటూ సాగింది. ఫేస్బుక్ కవితావేదికగా తన అస్తిత్వాన్ని నిలుపుకుంటోంది. వివిధ సాహిత్యసందర్భాల్ని సృష్టించింది. కొత్తగా రాస్తున్నవాళ్ళు ఎందరో ఇవాళ తమదైన ముద్రను దీని ద్వారా ఏర్పరుచుకున్నారు. చర్చలు, సూచనలు, సందేహాలు, నివృత్తులు వీటన్నింటి మధ్య తమను తాము నిరూపించుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు.

ప్రధమ వార్షికోత్సవం

మార్చు
  • తేదీ : ఆగస్టు 15, 2012 (బుధవారం)
  • వేదిక : EFLU ( English & Foriegn Languages Univrsity), Tarnaka,Hyderabad.
  • ప్రత్యేక అతిథి : శ్రీ సుభోధ్ సర్కార్ en:Subodh Sarkar ( ప్రముఖ బెంగాలీ కవి)
  • ఫేస్ బుక్ గ్రూప్ ఈవెంట్ లోని వివరాలు
  • సుభోద్ సర్కార్ అధికారిక వెబ్ సైట్
  • ఆగస్టు2012 పదిహేనున ఇఫ్లూలో జరిగిన 'కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్' జరిగింది.ఆంధ్రజ్యోతి,పాలపిట్ట,దక్కన్ క్రానికల్,హిందూ వంటి పత్రికలూ ఈ కృషిని ప్రస్తావిస్తూ ఆర్టికల్స్ ను ప్రచురించాయి.అలాగే ఒక ప్రయత్నంగా,ఒక ప్రయోగంగా 144 కవితలతో 'కవిసంగమం-2012 ' కవితా సంకలనం వెలువడింది . ఇందులో తొట్టతోలిగా ముద్రణలో కన్పించినవారు ఎనభై మందికి పైగానే వర్థమాన కవుల కవితలున్నాయి.

బెంగాలీ కవి సుబోద్ సర్కార్ అతిథిగా పాల్గొని కవిసంగమం కాన్సెప్ట్ ను చూసి ముచ్చటపడ్డాడు.గొంతెత్తిన కొత్తకవుల కవిత్వంతో ఉక్కిరిబిక్కిరే అయ్యాడు.అప్పటివరకూ కవిత్వంలో లేని పేర్లేన్నో ఇవాళ కవిత్వరంగంలో వినబడుతున్నాయి. ఆమధ్య వచ్చిన ప్రసిద్ధ తమిళకవి చేరన్ రుద్రమూర్తి చేసిన ప్రసంగాలు,చదివిన కవిత్వం ;మనవాళ్ళు అనువదించి వేదికపై చదివిన ఆయన కవితలూ- ఇదంతా 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్ ' గా ఎంతో ఉపయోగపడ్డాయి.

కవితో ముఖాముఖి

మార్చు

సుభోెధ్ సర్కార్

మార్చు
  • తేదీ:
  • వేదిక:
  • ఫోటోలు:
  • విడియోలు

చేరన్ రుద్రమూర్తి

మార్చు
  • తేదీ:
  • వేదిక:
  • ఫోటోలు:
  • విడియోలు:

అప్సర్

మార్చు
  • తేదీ: 2014 జూలై 27 ఆదివారం సాయంత్రం 6 గంటలు
  • వేదిక: గోల్డెన్ థ్రెషోల్డ్
  • ఫోటోలు:
  • విడియోలు:

శీతాంశు యశచ్చంద్ర

మార్చు
  • తేదీ:
  • వేదిక:
  • ఫోటోలు:
  • విడియోలు:

వెంకటయోగి

మార్చు
  • తేదీ:
  • వేదిక:
  • ఫోటోలు:
  • విడియోలు:

రాజిత సల్మా

మార్చు
  • తేదీ:
  • వేదిక:
  • ఫోటోలు:
  • విడియోలు:

కృష్ణుడు/కృష్ణారావు

మార్చు

జర్నలిస్టుగా, కవిగా రెండు దశాబ్దాలకు పైగా ఢిల్లీలో నివాసం. మూడు దశాబ్దాల వృత్తి అనుభవం. అయిదు దశాబ్దాలకు పైగా జీవితానుభవం. ఇప్పటివరకూ ఇండియా గేట్ పేరుతో కాలమ్స్ సంకలనం; ఇంకెవరు, ఉన్నట్లుండి - పేర్లతో రెండుకవితా సంపుటాలు వెలువడ్డాయి. కలువకొలను రామ్మోహన రాజుతో కలిసి విపశ్యన కవులకు జవాబుగా కవితా సంకలనం వెలువరించారు. క్రితంతర్వాత కవుల్లో ఒకరు. అనేక జాతీయ కవితా సమ్మేళనాల్లో కవితలు చదివారు. తాజాగా నవంబరు 21,22,23 తేదీల్లో పాట్నాలో భారతీయ కవితా సమరొహ్ లో పాల్గొన్నారు. అనేక పత్రికల్లో కవితలు, సాహిత్య విమర్శా వ్యాసాలూ వెలువడ్డాయి.

  • తేదీ: ఆదివారం 2014 డిసెంబరు 07 సాయంత్రం 6 గంటలు
  • వేదిక: గోల్డెన్ థ్రెషోల్డ్
  • ఫోటోలు:
  • విడియోలు:

సింధీ కవి లక్ష్మణ్ దూబే

మార్చు

ఈయన ప్రముఖ సింధీ కవి, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత

  • తేదీ: సోమవారం, ఫిబ్రవరి 2వ తారీఖు 6:00pm
  • వేదిక: గోల్డెన్ థ్రెషోల్డ్, అబిడ్స్
  • ఫోటోలు:
  • విడియోలు:

ప్రత్యేక కార్యక్రమాలు

మార్చు

కవిసంగమంలోని కవులు/రచయితలు

మార్చు
  1. కవి యాకూబ్
  2. శిలాలోలిత
  3. పైడి తెరేష్ బాబు
  4. రాళ్ళబండి కవితాప్రసాద్
  5. కట్టా శ్రీనివాసరావు
  6. శ్రీరామోజు హరగోపాల్
  7. యర్రంశెట్టి యశస్వి
  8. స్రవంతి ఐతరాజు
  9. స్వర్ణలతా నాయుడు
  10. శ్రీనివాస్ వాసుదేవ్
  11. శ్రీనివాస్ రామడుగుల
  12. శ్రీనివాస్ గద్దపాటి
  13. రోజా రమణి బోయపాటి
  14. కత్తిమండ ప్రతాప్
  15. అబ్దుల్ వాహెద్
  16. కాశి రాజు
  17. అన్నవరం దేవేందర్‌
  18. వర్మ కలిదిండి
  19. పసునూరు శ్రీధర్ బాబు
  20. కపిల రాంకుమార్
  21. తోట నిర్మలారాణి
  22. మెరాజ్ ఫాతిమా
  23. రక్షిత సుమ
  24. అనిల్ డ్యాని
  25. విలాసాగరం రవీందర్
  26. సిరి లాబాల
  27. మల్లావఝ్ఝల నారాయణ శర్మ
  28. షాజహానా
  29. స్కైబాబ
  30. అరవిందరాయుడు దేవినేని
  31. కొంపెల్ల శర్మ

మూలాలు

మార్చు
  1. మాగజిన్ మాలికా. "చిక్కని కవిత్వంతో చక్కని సంకలనం "కవిసంగమం"". magazine.maalika.org. Archived from the original on 1 జూన్ 2015. Retrieved 20 October 2016.
  2. నవతెలంగాణ, దర్వాజ (9 May 2016). "కవిసంగమం సిరీస్‌-28". Retrieved 27 July 2016.
  3. ఆంధ్రజ్యోతి, వివిధ (4 July 2016). "కవిసంగమం సిరీస్‌ 29". Archived from the original on 6 July 2016. Retrieved 27 July 2016.

ఇతర లింకులు

మార్చు

[1]

"https://te.wikipedia.org/w/index.php?title=కవిసంగమం&oldid=4339533" నుండి వెలికితీశారు