(‘అబ్రక్సాస్‌’ అని పలకాలి) క్రైస్తవులలో బాసిలిడియన్లు అనే ఒక తెగ ఉంది. జీసస్‌ను శిలువ వేసారని నమ్మకపోవడం లాంటి ప్రత్యేకతలు ఉన్న వర్గం ఇది. వారు ఉపయోగించే ఒక పదం ‘అబ్రక్సాస్‌’. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ పదం విలువ 365. సర్వేశ్వరుడు ఇన్ని స్వర్గాలను ఒక క్రమం ప్రకారం సృష్టించాడని వారు నమ్ముతారు. ‘అబ్రక్సాస్‌’ అనే పదాన్ని ఒక రత్నం మీద చెక్కించి తాయెత్తులాగా వాడుకొనే ఆచారం ఈ వర్గంలో ఉంది. ‘అబ్రకదబ్ర’, ‘కబ్బలా’(హిబ్రూ భాషలో మంత్రం లాంటి పదం) పదాలను రత్నాల మీద చెక్కించి తాయెత్తులలోనూ, ఉంగరాల లోనూ వాడుకొనే సంప్రదాయమూ ఉంది.

Gemstone carved with Abraxas, obverse and reverse.