ప్రజోపయోగ పరిధి

(Public domain నుండి దారిమార్పు చెందింది)

భారత చట్టాల ప్రకారం గ్రంథాలు, రచయిత జీవితకాలం, 60 సంవత్సరాలు నకలుహక్కులు అమలులో వుంటాయి.ఆ తరువాత ప్రజోపయోగపరిధిలోకి చేరతాయి. అంటే వాటినే ఏ అనుమతి అవసరంలేకుండా ఏ అవసరానికైనా వాడుకోవచ్చు. అంటే 2012 సంవత్సరంలో పరిశీలించినట్లయితే 1950లో లేక అంతకుముందు మరణించిన రచయితల కృతులు ప్రజోపయోగ పరిధిలోకి చేరతాయి