అభినందన్ వర్థమాన్
వింగ్ కమాడర్ అభినందన్ వర్థమాన్ (జ. 1983 జూన్ 21) భారతీయ ఎయిర్ ఫోర్స్ అధికారి, MiG-21 బైసన్ యుద్ద విమాన పైలట్.[1][2] అతను 2019 భారత-పాకిస్తాన్ సైనిక ప్రతిష్టంభన సమయంలో మూడురోజులపాటు పాకిస్థాన్‌లో యుద్ధ ఖైదీగా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా మీడియా ద్వారా గుర్తింపు పొందాడు.
వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ | |
---|---|
జననం | 1983 జూన్ 21 |
రాజభక్తి | భారతదేశం |
సేవలు/శాఖ | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ |
ర్యాంకు | వింగ్ కమండర్ |
సర్వీసు సంఖ్య | 27981 |
పోరాటాలు / యుద్ధాలు | 2019 భారత-పాకిస్తాన్ సైనిక ప్రతిష్టంభన |
జీవిత విశేషాలు
మార్చుఅభినందన్ 1983 జూన్ 21న తమిళనాడులో ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్థమాన్ కు జన్మించాడు.[3] అతని తల్లి వైద్యురాలు.[3] అతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో యుద్ధ విమానాల పైలట్ గా 2004లో చేరాడు. [3]
నియంత్రణ రేఖ దాటిన అభినందన్
మార్చు2019 పిబ్రవరి 26 న పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానం జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగం లోకి చొచ్చుకు వచ్చింది. నౌషెరా సెక్టార్ బేస్ క్యాంప్ నుంచి అభినందన్ మిగ్ 21 యుద్ధ విమానంతో శతృవుల ఎయిర్ క్రాఫ్ట్ లను ఎదరించారు. ఎఫ్-16 భూమికి ఎనిమిది వేల అడుగుల ఎత్తున ఉండగా.. అభినందన్ తన మిగ్ 21 యుద్ధ విమానాన్ని 15 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పాక్ ఎయిర్ క్రాప్ట్ ను టార్గెట్ గా చేసుకుని కాల్పులు జరిపారు. దీనితో అది తిరుగుముఖం పట్టింది. అయినప్పటికీ, అభినందన్ దాన్ని వదల్లేదు. వెంటాడారు. ఈ సందర్భంగా అభినందన్.. తన దళ నాయకుడికి ఓ చిన్న సందేశాన్ని పంపించారు. నేను తరుముకుంటూ వారి వెనుకే వెళ్తున్నా.. అని మిగ్ 21లో అమర్చిన రేడియో ద్వారా మాట్లాడారు.
ఎఫ్-16ను వెంటాడే సమయంలో అభినందన్ నడుపుతున్న మిగ్-21 అత్యంత వేగంగా ప్రయాణించినట్లు రాడార్ లో రికార్డయ్యింది. నాలుగు సెకెన్ల వ్యవధిలో కిలోమీటర్ దూరాన్ని అధిగమించినట్లు స్పష్టమైంది. అంటే గంటకు 900 కిలోమీటర్ల వేగంతో మిగ్-21 ప్రయాణించింది. ఆ వేగంతో 86 సెకెన్ల పాటు మిగ్ ప్రయాణించింది. ఈ వైమానిక పోరాటంలో అభినందన్ విమానం పాకిస్తానీ భూభాగంలోకి వెళ్ళగా, పాకిస్తానీ వైమానిక దళం వారు దీన్ని కూల్చివేశారు.[4] దీనితో అభినందన్ ప్యారాషూట్ సహాయంతో పాక్ గడ్డపై దిగారు. పాకిస్తాన్ వైపు నియంత్రణ రేఖకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో అభినందన్ దిగినట్లు వెల్లడైంది. నియంత్రణ రేఖ సమీపంలో అభినందన్ మిగ్ 21 ద్వారా ఆర్ 73 క్షిపణిని ప్రయోగించారు. అది నేరుగా ఎఫ్-16ను ఛేదించింది.
ప్యారాషూట్ సహాయంతో పాక్ గడ్డపై
మార్చుపాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని భీంబర్ జిల్లా హోరాన్ గ్రామం భూభాగంలో ప్యారాషూట్ సహాయంతో పాక్ గడ్డపై దిగారు. ఆయన నేలపై పాకుతూ బయటకు వచ్చారు. కానీ అక్కడకు చేరుకున్న స్థానిక ప్రజలు ఆయనను చుట్టుముట్టారు.
నేను భారత్‌లోనే దిగానా అని తన దగ్గరకు ముందుగా చేరుకున్న కొందరు యువకులను ఆ పైలట్ అడిగారు. తన నడుం చుట్టూ ఉన్న పారాచ్యూట్ బెల్టును తనకుతానుగానే తొలగించుకున్నారు. భారత దేశంపై భక్తిని చాటే కొన్ని నినాదాలు చేశారు. కానీ అక్కడున్న యువకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
దీంతో ఆ వ్యక్తి తన చుట్టూ ఉన్నవారిని భయపెట్టేందుకు తన తుపాకి తీసి ఓసారి గాల్లోకి కాల్చారు. కానీ ఈ పరిణామంతో చుట్టూ ఉన్న యువకులు ఆగ్రహంతో అక్కడున్న రాళ్లను తీసి ఆ పైలట్‌పై విసిరారు. దీంతో ఆయన గాల్లోకి మరికొన్ని రౌండ్లు కాల్పులు జరుపుతూ పరుగందుకున్నారు. కానీ అక్కడున్న యువకులు తర్వాత సైన్యానికి అప్పగించారు.
భారత సమాచారం అతని వద్ద తన జేబుల్లో ఉన్న కొన్ని పేపర్లను బయటకు తీసి, చింపి, వాటిని నాశనం చేసేశారు. కొన్నింటిని నోట్లో పెట్టుకుని నమిలేశారు. కానీ అక్కడున్న యువకులు ఆయన దగ్గర నుంచి కొన్ని పేపర్లను లాక్కున్నారు.
మూడు రోజుల పాటు అభినందన్ పాక్ దళాల అదుపులో ఉన్నారు.
అప్పగింత
మార్చు2019 మార్చి 1 న పాకిస్తాన్ అధికారులు అభినందన్‌ను భారత అధికారులకు అప్పగించారు. వాఘా వద్ద సరిహద్దును దాటి అతడు భారత్‌లోకి ప్రవేశించాడు.[5]
మూలాలు
మార్చు- ↑ Dawn.com (28 February 2019). "2 Indian aircraft violating Pakistani airspace shot down; 2 pilots arrested". DAWN.COM. Retrieved 28 February 2019.
- ↑ "Saved From Pakistani Mob, Downed Indian Pilot Becomes Face of Kashmir Crisis". The New York Times. February 27, 2019.
- ↑ 3.0 3.1 3.2 "Pilot Abhinandan Profile, Family, All you need to know about IAF Wing Commander Abhinandan Varthaman". www.timesnownews.com.
- ↑ Pubby, Manu (28 February 2019). "Abhinandan Varthaman's MiG21 locked in Pakistan's F16". The Economic Times. Retrieved 2019-03-01 – via The Economic Times.
- ↑ Dawn.com (2019-03-01). "Captured IAF pilot handed over to officials in Delhi". DAWN.COM. Retrieved 2019-03-01.