అభీరులు విదేశస్తులని వారు శకులతోపాటు ఇరాన్ నుండి భారత దేశానికి వలస వచ్చినట్లు మహ భాష్యం చెప్పుతుంది. వీరు క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో మొదట క్షాత్రపుల వద్ద సేనాధిపతులుగా ఉన్నారు. శాతవాహనులు పతనానంతరం 10 మంది రాజులు 67 సంవత్సరాలు పాలించినట్లు పురాణ శాసనాలు తెలుపుతున్నాయి. రాజ్య స్థాపకుడు ఈశ్వరసేనుడు. అభీరుల రాజ్యం దక్షిణాన కదంబ రాజ్యం వరకు తూర్పున ఇక్ష్వాకు రాజ్యం వరకు విస్తరించి ఉంది[1]

మూలాలు

మార్చు
  1. "Sujanaranjani". www.siliconandhra.org. Retrieved 2020-01-25.
"https://te.wikipedia.org/w/index.php?title=అభీరులు&oldid=2953336" నుండి వెలికితీశారు