1947 సెప్టెంబరు 2న వరంగల్ జిల్లా పరకాలలో జలియన్ వాలా బాగ్ దుర్ఘటనను తలపించే సంఘటన జరిగిన దుర్దినం. భారత యూనియన్ లో హైదరాబాదు సంస్థానం విలీనం చేయాలని విమోచనోద్యమకారులు ఆందోళనకు దిగారు. సెప్టెంబరు 2, 1947న పరకాల పట్టణ సమీపంలో ఉన్న పైడిపల్లి తాల్ల నుంచి విమోచనోద్యమకారులు భారత జాతీయ జెండా ఎగురవేయడానికి పరకాలకు వస్తున్నారు. రజాకార్లు ఈ విషయం పసిగట్టి నిజాంచే విమోచనొద్యకారులు జాతీయజెండాను ఎగువరవేయకుండా అడ్డుకోమని ఆదేశం జారీచేయించారు. కాశీంరజ్వీ నేతృత్వంలోని రజాకార్లు విమోచనోద్యమకారులను ఊచకోత కోశారు. పరకాల చాపలబండ వద్ద గుమిగూడిన విమోచనోద్యమకారులపై దాడిచేశారు. కత్తులు, బల్లాలు, బరిశెలతో మారణకాండ కొనసాగించగా 13 మంది ఉద్యమకారులు అక్కడికక్కడే దారుణమరణం చెందారు. మరో ఆరుగురు ఆసుపత్రిలో మృతిచెందారు. మరో ముగురిని రంగాపూర్ గామంలో చేటుకు కటేసి దారుణంగా గొడలి, బడిసెలతో, తుఫాకులతో కాలిచి చంపారు. 200 మందికి పైగా ఉద్యమకారులు తీవ్రంగా గాయపడ్డారువరంగల్ జిల్లా జలియన్ వాలా బాగ్ గా ఈ సంఘటన ప్రాచుర్యం పొందింది. 2003 సెప్టెంబరు 17న విమోచనోద్యమ దినం నాడు అప్పటి కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు సి.హెచ్.విద్యాసాగర్ రావు తన తల్లి చెన్నమ్మ పేరిట పరకాలలో అమరధామం నిర్మించినాడు. ఆనాటి యోధుల సజీవ శిల్పాలు రంగాపురంలో చెట్టుకు కట్టేసి చంపిన తీరు ఆకట్టుకునేలా ఈ అమరధామం ఉంది.