వరంగల్ జిల్లా

తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లా

వరంగల్ జిల్లా, తెలంగాణలోని జిల్లాలలో ఒకటి.[1] 2016 అక్టోబరు 11, న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి. వరంగల్ జిల్లా చూట్టూ మహబూబాబాద్, జనగాం, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. 2021, జూన్ నాటికి హన్మకొండ తాత్కాలికంగా రెండు జిల్లాల కేంద్రంగా ఉండగా, తరువాత వరంగల్ జిల్లా కొత్త ప్రధాన కార్యాలయంగా హన్మకొండ స్థానంలో వరంగల్ ప్రతిపాదించబడింది.[2] 2021, ఆగస్టులో వరంగల్ రూరల్ జిల్లా పేరును తిరిగి వరంగల్ జిల్లాగా మార్చారు.

వరంగల్ జిల్లా

వరంగల్ జిల్లా
తెలంగాణలో జిల్లా స్థానం
తెలంగాణలో జిల్లా స్థానం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్య పట్టణంవరంగల్
మండలాలు15
ప్రభుత్వం
 • జిల్లా కలెక్టర్ఎం. హరిత ఐఏఎస్
విస్తీర్ణం
 • Total2,095 కి.మీ2 (809 చ. మై)
జనాభా
(2011)
 • Total7,16,457
 • సాంద్రత340/కి.మీ2 (890/చ. మై.)
కాలమానంUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)
జాలస్థలిwarangalrural.telangana.gov.in//
వరంగల్ జిల్లా

జిల్లాలోని మండలాలుసవరించు

పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట పూర్వపు వరంగల్ జిల్లాకు చెందిన 15 మండలాలతో వరంగల్ గ్రామీణ జిల్లా ది.11.10.2016న ఇది ఏర్పడింది.[1][3] చివరిగా చూపబడిన నడికూడ మండలం కొత్తగా ఏర్పడింది.

మండలాల జాబితాసవరించు

వరంగల్ రెవెన్యూ డివిజనుసవరించు

  1. వరంగల్ మండలం
  2. ఖిలా వరంగల్ మండలం *
  3. సంగం మండలం
  4. గీసుగొండ మండలం
  5. వర్ధన్నపేట మండలం
  6. పర్వతగిరి మండలం
  7. రాయపర్తి మండలం

నర్సంపేట రెవెన్యూ డివిజనుసవరించు

  1. నర్సంపేట మండలం
  2. చెన్నారావుపేట మండలం
  3. నల్లబెల్లి మండలం
  4. దుగ్గొండి మండలం
  5. ఖానాపూర్ మండలం
  6. నెక్కొండ మండలం

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (1)

చరిత్రసవరించు

పూర్వం వరంగల్ జిల్లాలో అనేక పురాతన చారిత్రిక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని భారత పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. పాతరాతియుగం రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ పాండవుల గుట్ట కూడా ఇక్కడ ఉంది.[4] కాకతీయుల కాలంలో పద్మాక్షి గుట్ట మీద జైన దేవాలయం నిర్మించారు. ఇందులో పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో జైన తీర్థంకరులు, ఇతర జైన దేవతలు, దేవతల శిల్పాలు ఉన్నాయి. పద్మాక్షి ఆలయం పెద్ద రాతి శిఖరంపై నిర్మించబడింది.

జిల్లా ఏర్పాటుసవరించు

హైదరాబాద్ నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రం అనేక చిన్న సర్కార్‌లుగా విభజించబడింది. 1800ల ప్రారంభంలో వరంగల్ సర్కార్ గా మారింది.[5] 1866లో సర్కార్లు రద్దు చేయబడి, విలీనమై జిల్లాలుగా ఏర్పడ్డాయి. వారంగల్,[6] ఖుమ్మెట్టు,[7] భోనఘీర్ సర్కార్‌లలో కొంతభాగం కలపడం ద్వారా వరంగల్ జిల్లా ఏర్పాటుచేయబడింది. భోనగీర్ సర్కార్ నుండి జనగామ ప్రాంతం వరంగల్‌కు మార్చబడింది. వరంగల్‌లోని కమల్‌పూర్ ప్రాంతం కరీంనగర్ జిల్లాకు మార్చబడింది. 1905లో ప్రిన్స్‌లీ స్టేట్ హైదరాబాద్ ను 1. ఔరంగాబాద్ డివిజన్, 2. గుల్బర్గా డివిజన్, 3. గుల్షానాబాద్ డివిజన్, 4. వరంగల్ డివిజన్ నాలుగు విభాగాలుగా విభజించారు. 1905లో జనగాం (చెరియల్) తాలూకా, కోడార్ (కోదాడ్) ఉప తాలూకా ఏర్పడిన తరువాత జిల్లాలు విభజించబడ్డాయి. వరంగల్ జిల్లా నుండి నల్గొండ జిల్లాకు మార్చబడింది.[8] 1905లో వరంగల్ జిల్లా వరంగల్, పాకాల, ఖమ్మం, యెల్లందు, మహబూబాబాద్, మధిర, పాల్వంచ తాలూకాలు, పాత పాల్వంచ సంస్థానంలోని కొంత ప్రాంతం, కొన్ని జాగీర్లతో ఏర్పడింది. ఇది హైదరాబాద్ రాష్ట్రంలోని అనేక జిల్లాల కంటే పెద్దదిగా ఉండేది.[9]

పరిపాలనా నియంత్రణను సులభతరం చేయడానికి వరంగల్ జిల్లా విభజించబడింది. 1953, అక్టోబరు 1న ఖమ్మం జిల్లా ఏర్పడింది. ఖమ్మం, ఇల్లందు, మధిర, బూరుగున్‌పహాడ్, పాల్వంచ తాలూకాలను ఖమ్మం జిల్లాలో భాగం చేశారు. వరంగల్, ములుగు, మహబూబాబాద్, పాకాల వరంగల్ జిల్లాలో ఉండిపోయాయి. కానీ కరీంనగర్ నుండి పరకాల, నల్గొండ నుండి జనగాం వరంగల్ జిల్లాలో భాగంగా మారాయి. జిల్లాలో 6 తాలూకాలు, 2 రెవెన్యూ డివిజన్లు ఉండేవి, తరువాత 1979లో 15 తాలూకాలుగా పెరిగాయి. 1985లో ఎన్.టి. రామారావు మండల వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు వరంగల్ జిల్లా 50 మండలాలుగా విభజించబడింది. కానీ వరంగల్ మండలం, హనంకొండ మండలం నుండి వరంగల్ పట్టణ ప్రాంతాన్ని కలిగివుండగా ఇది మొత్తం 51 మండలాలకు పెరిగింది. వరంగల్ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు 5 కి పెరిగాయి.

తెలంగాణ ఏర్పడిన తరువాత 2016, అక్టోబరులో 33 కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పాత వరంగల్ జిల్లా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, జయశంకర్, మహబూబాబాద్ అనే 5 కొత్త జిల్లాలుగా విడిపోయింది.[10] అయితే, ప్రజల డిమాండ్ మేరకు 2021 ఆగస్టు 12న వరంగల్ రూరల్ జిల్లాను 13 మండలాలతో వరంగల్ జిల్లాగా, వరంగల్ అర్బన్ జిల్లాను 14 మండలాలతో హన్మకొండ జిల్లాగా పునర్వ్యవస్థీకరించబడ్డాయి.[11]

దర్శనీయ స్థలాలుసవరించు

  • భద్రకాళి దేవాలయం: వరంగల్ నగరం నడిబొడ్డున కొలువైవున్న శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు.ఇది అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభాయమానంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం .[12]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "KCR renames Warangal Urban Hanamkonda; Warangal Rural becomes Warangal". NewsMeter.
  3. "Hanamkonda, Warangal in Telangana to be new districts now". The New Indian Express. 13 August 2021.
  4. http://www.aparchaeologymuseum.com/wp-content/uploads/2012/05/Warangal-dt.pdf
  5. "1854 Pharoah and Company Map of the Hyderabad, Sangareddy and Nalgonda Districts of Telangana, India". Archived from the original on 6 February 2021.
  6. "1854 Pharoah and Company Map of the Hyderabad state, Warangal and karimnagar Districts of Telangana, India". Archived from the original on 12 August 2020.
  7. "1854 Pharoah and Company Map of the Hyderabad state, Warangal and khammam Districts of Telangana, India". Archived from the original on 21 October 2020.
  8. Yazdani, Ghulam (1937). "Hyderabad State". Atlantic Publishers & Distri – via Google Books.
  9. "Know Your Corporation".
  10. "Telangana CM hints at 4 new districts due to public, political pressure". www.deccanchronicle.com. 2016-10-04. Retrieved 2016-10-15.
  11. "Hanamkonda, Warangal in Telangana to be new districts now". The New Indian Express. 13 August 2021.
  12. ఈనాడు, వరంగల్లు (1 June 2018). "ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి!". Archived from the original on 17 September 2019. Retrieved 22 January 2020.

వెలుపలి లింకులుసవరించు