అమరేశ్వరస్వామి దేవాలయం

పల్నాడు జిల్లా పుణ్యక్షేత్రం, పంచారామాల్లో ఒకటి
(అమరారామం నుండి దారిమార్పు చెందింది)

అమరేశ్వర స్వామి దేవాలయం పల్నాడు జిల్లా,అమరావతిలో ఈ దేవాలయం ఉంది.ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఇది ఒకటి.[1]

అమరేశ్వర స్వామి దేవాలయం
ఆలయ గోపురం
ఆలయ గోపురం
అమరేశ్వర స్వామి దేవాలయం is located in ఆంధ్రప్రదేశ్
అమరేశ్వర స్వామి దేవాలయం
అమరేశ్వర స్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :16°34′51″N 80°21′32″E / 16.5809°N 80.358946°E / 16.5809; 80.358946
పేరు
ప్రధాన పేరు :అమరేశ్వర స్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:పల్నాడు జిల్లా
ప్రదేశం:అమరావతి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:అమరేశ్వర స్వామి దేవాలయం
ముఖ్య_ఉత్సవాలు:మహాశివరాత్రి,కార్తీక పౌర్ణమి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రావిడ రకం

స్థల పురాణం

మార్చు

ఈ దేవాలయంలోని శివలింగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ శివలింగం ఒకానొక కాలంలో ఆ శ్రీ రామచంద్రుని చేత పూజించ బడిన శివలింగంగా ప్రసిద్ధిగాంచింది.త్రిపురాసుర సంహార సమయంలో కుమారస్వామి చేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి. పంచారామాలలో ఒకటైన అమరారామం (అమరావతి) కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొనబడింది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి. అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం తెలియజేస్తుంది.ఇక్కడి శివలింగం అత్యంత ఎత్తైనదిగా వుండుటవల్ల అర్చకులు ఒక పీఠమీద ఎక్కి, ప్రతి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తూవుంటారు.ఇక్కడి శివలింగం పైభాగంలో ఎర్రనిరంగు మరక ఉంది. ఆ మరకే రక్తపు మరక.శివలింగం రోజురోజుకీ ఎత్తుగా పెరుగుతూ ఉండటం వల్ల నిలిపేందుకు ఒక మేకును శివలింగం తలమీద కొట్టడంజరిగింది. శివలింగంపైభాగంలో రక్తం మరక ఏర్పడింది. నేటికీ ఆ రక్తపు మరక ఉంది.దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించడని. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.[2]

శాసనాలు

మార్చు

ఈ దేవాలయంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల శాసనాలను చూడవచ్చును. ముఖమండపంలోని ఒక స్తంభంపై కోట రాజు శాసనాన్ని ఉన్నాయి.[3]

ఉత్సవాలు

మార్చు

ఈ దేవాలయం మహాశివరాత్రి, నవరాత్రి, కళ్యాణివుత్సవాలు మొదలైనవి అత్యంత వైభవంగా జరుపుతారు.[4]

రవాణా సౌకర్యం

మార్చు

రవాణా సౌకర్యం ఉంది.గుంటూరు నుండి 40 కిలోమీటర్లు దూరంలో ఉంది. గుంటూరు, విజయవాడ, మంగళగిరిల ద్వారా కూడా ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు.[5][6]

మూలాలు

మార్చు
  1. "Panchamukha : పంచముఖుని పంచారామాలు | Pancharamas of Panchamukha mvs". web.archive.org. 2023-02-18. Archived from the original on 2023-02-18. Retrieved 2023-02-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Venkatakarunasri (2017-11-06). "శివలింగానికి మేకు వల్ల కారిన రక్తపు మరక ఇప్పటికీ పోలేదు...ఎందుకు?". native planet. Archived from the original on 2020-02-29. Retrieved 2020-02-29.
  3. "South Indian Inscriptions - Volume 10 - Kakatiya Dynasty Inscriptions @ whatisindia.com". www.whatisindia.com. Retrieved 2020-02-29.
  4. "Maha Sivaratri celebrated with religious fervour". Retrieved 2020-02-29.
  5. "Tourist Services in Guntur Region". Archived from the original on 2019-04-16. Retrieved 2020-02-29.
  6. "RTC to operate 300 buses to 'Siva Kshetrams". Retrieved 2020-02-29.