పల్నాడు జిల్లా

ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా

పల్నాడు జిల్లా, 2022 ఏప్రిల్ 4న నరసరావుపేట కేంద్రంగా ఏర్పడింది.[2] ఇది గతంలో గుంటూరు జిల్లాలో భాగంగా వుండేది. పల్నాడు ప్రాంతమంతా చాలవరకు దీనిలో ఉంది. జిల్లాలో నాగార్జునసాగర్ ఆనకట్ట, అమరావతి స్తూపం, కోటప్ప కొండ, ఎత్తిపోతల జలపాతం, కపోతేశ్వరస్వామి దేవాలయం (చేజర్ల), కొండవీడు కోట ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.

పల్నాడు జిల్లా
జిల్లా
Location of పల్నాడు జిల్లా
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
మండలాలు28
జిల్లా కేంద్రంనరసరావుపేట
Government
 • జిల్లా కలెక్టర్శివశంకర్ లోతేటి (కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్)
 • ఎస్.పివై. రవిశంకర రెడ్డి
 • లోక్‌సభ నియోజకవర్గంనరసరావుపేట
 • పార్లమెంట్ సభ్యుడులావు శ్రీకృష్ణ దేవరాయలు
 • శాసనసభ07
విస్తీర్ణం
 • మొత్తం7,298 కి.మీ2 (2,818 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం20,41,723
 • జనసాంద్రత280/కి.మీ2 (720/చ. మై.)
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం (IST))

భౌగోళికం

మార్చు

జిల్లా విస్తీర్ణం 7,298 చ.కి.మీ. దీనికి ఉత్తరాన తెలంగాణ లోని నల్గొండ జిల్లా తూర్పున ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, దక్షిణాన గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, పడమరన ప్రకాశం జిల్లా ఉన్నాయి.[3]

కొండలు

మార్చు

నల్లమలై, వెంకటాయపాలెం శ్రేణులు, కొండవీడు కొండలు

నల్లమలై కొండలు, అడవులు

పల్నాడు చుట్టూ కర్నూలు జిల్లాలోని నల్లమలై కొండలున్నాయి. మాచర్ల, యర్రగొండపాలెం శ్రేణిలో స్వామికొండ లేక వామికొండ (605 మీ) ఎత్తులో గలదు. కైరాలకొండ (590 మీ) తరువాత ఎత్తైన కొండ. వాయవ్య అంచున గల కొండలు మల్లవరం దగ్గర కృష్ణానదిలో కలిసేవరకు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా పలకరాయి, క్వార్ట్‌జైట్ రాయి లభిస్తుంది. మాచర్లకు పది కి.మీ. దూరంలో ఎత్తిపోతల జలపాతం నల్లమల కొండలపై చంద్రవంక నదిపై ఉంది. దీనిలో 21 మీ. ఎత్తునుండి నీరు పారుతుంది.

వెంకటాయపాలెం శ్రేణి

సత్తెనపల్లి దగ్గరలోని వెంకటాయపాలెం పేరు కలిగిన పలకరాయి, క్వార్ట్జైట్లు గల కొండలే ఇవి. 40 కిమీ పొడవుతో ఈశాన్య - నైరుతీ దిక్కున వుంటాయి. వీటిలో వజ్రాలు కనుగొన్నారట. దీనిలో ఎత్తైనది మైదర్సాల్ (447 మీ). నరసరావుపేట దగ్గర పల్నాడు, వినుకొండ, సత్తెనపల్లి సరిహద్దులు కలిసేచోట కృష్ణానదివైపుకు ఎత్తుతగ్గుతూ వుండే కొండలు ఉన్నాయి.

కొండవీడు

ఇవి నరసరావుపేట దగ్గర 19 కిమీ విస్తరించి, 523మీ ఎత్తువరకు వున్న కొండలు. వీటిలో గ్రానైట్ రాయి నిక్షేపాలున్నాయి. దీనికి పశ్చిమంగా వేరుగా వున్న యల్లమంద లేక కోటప్పకొండ అని పిలవబడే 489 మీ. ఎత్తులో ఉంది. దానికి దక్షిణంగా అద్దంకి వైపు కొన్ని కొండలున్నాయి.

నేల తీరులో రకాలు.
  1. ఎరుపు గ్రేవెల్లి నేల: ఆర్చెయిన్ ఫార్మేషన్ వలన ఇవి ఏర్పడతాయి. మాచెర్ల, వినుకొండలో ప్రధానంగా ఇవి ఉన్నాయి.
  2. నలుపు పత్తి నేల: కృష్ణానది వడ్డునగల ప్రదేశాలు, సత్తెనపల్లి, మాచెర్లకు ఉత్తరంగా ఉన్నాయి. సున్నపురాయి మెత్తగా మారి ఇవి ఏర్పడుతాయి.
  3. ఇసుక అల్లూవియల్ నేల:సముద్రపు వడ్డున గోండ్వానా రాళ్లుగల ప్రదేశాల్లో ఇవి ఉన్నాయి. కొన్ని చోట్ల కంకర (కాల్కేరియస్ నేలలు) ఉన్నాయి.

ఖనిజసంపద

మార్చు

సిమెంట్ తయారీలో వాడే సున్నపురాయి, ఇనుప ఖనిజం, రాగి, సీసం ప్రధాన ఖనిజాలు

  1. సున్నపురాయి: నర్జీ సున్నపురాయి పల్నాడు ప్రాంతంలో ఉంది. సిమెంట్ తయారీలో వాడతారు. బౌద్ధుని కాలంలో దీనిని ఉపయోగించి స్థూపాలు నిర్మించారట
  2. డయాటో మాసియస్ మట్టి: వినుకొండ దగ్గర తిమ్మాయపాలెం, ఐనవోలు దగ్గర దొరుకుతుంది.
  3. రాగి, సీసం ఖనిజం: అగ్నిగుండాల, కారంపూడి దగ్గర ఇవి ఉన్నాయి.
  4. ఇనుప ఖనిజం: మాచర్ల దగ్గర తుమృకోట వద్ద తక్కువ నాణ్యత గల ఇనుప ఖనిజం దొరుకుతుంది.
  5. క్వార్ట్జ్: గాజు తయారీలో వాడే క్వార్ట్జ్ పల్నాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండలో లభ్యమవుతుంది.
  6. కంకర:సున్నపుతయారీలో వాడే కంకర నాదెండ్లలో లభ్యమవుతుంది.
  7. తెల్ల మట్టి: మాచర్లలో లభ్యమవుతుంది.
  8. గ్రానైట్: గోండ్వానా గ్రానైట్ రాయి భవన నిర్మాణంలో వాడుతారు.

వ్యవసాయం

మార్చు

వ్యవసాయ మార్కెట్ యార్డులు చిలకలూరిపేట, నరసరావుపేట,సత్తెనపల్లి, పిడుగురాళ్ల, వినుకొండ, మాచెర్ల, క్రోసూరు లలో ఉన్నాయి.

పరిశ్రమలు

మార్చు

పారిశ్రామిక వాడలు సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ళ నడికూడిలలో [4] సున్నపు రాయి, గ్రానైట్, ఇసుక ఆధారంగా పనిచేసే భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. ది దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్, శ్రీ చక్ర సిమెంట్స్, కెసిపి సిమెంట్స్ ప్రధాన పరిశ్రమలు.

జనాభా గణాంకాలు

మార్చు
పల్నాడు జిల్లాలో మతం (2011)[5]
మతం శాతం
హిందూ
  
86.73%
ముస్లిం
  
11.30%
క్రైస్తవం
  
1.59%
ఇతర లేక వెల్లడించని
  
0.38%
మతాల గణాంకాలు

2011 నాటి జనాభా గణాంకాల ప్రకారం, జిల్లా మొత్తం జనాభా 20,41,723. దీనిలో షెడ్యూలు కులాలు 3,75,554 (18.39%) షెడ్యూలు తెగల జనాభా 1,42,944 (7.00%) .[1]: 77–82 

2011 నాటి జనాభా గణాంకాల ప్రకారం, 87.12% జనాభా తెలుగు, 9.90% ఉర్దూ, 2.41% లంబాడీ మాతృభాషగా పేర్కొన్నారు.[6]

పల్నాడు జిల్లా మండలాల పటం (Overpass-turbo)


పరిపాలనా విభాగాలు

మార్చు

జిల్లా పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలు, 3 రెవెన్యూ డివిజన్లు, 28 మండలాలు ఉన్నాయి. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లులో నరసరావుపేట రెవెన్యూ డివిజను, గురజాల రెవెన్యూ డివిజను గతంలో ఏర్పడిన రెవెన్యూ డివిజన్లుకాగా, సత్తెనపల్లి రెవెన్యూ డివిజను కొత్తగా ఏర్పడింది.[7] మొత్తం 28 మండలాలు, 527 గ్రామపంచాయితీలు, 2 నగర పంచాయితీలు, 6 పురపాలక సంస్థలున్నాయి.[8]బొల్లాపల్లి మండలం గురజాల రెవెన్యూ డివిజన్ నుండి నరసరావుపేట రెవెన్యూ డివిజన్ కు నవంబరు 2022 న మార్చారు.[9]

పట్టణాలు

మార్చు
 
పల్నాడు జిల్లా ఆకర్షణలు (బొమ్మను పెద్దదిగా చేసి, గుర్తులపై మౌజ్ వుంచితే సంబంధిత అంశం కనబడుతుంది)

జిల్లాలో పట్టణాలు: చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ళ, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల, దాచేపల్లి

నియోజకవర్గాలు

మార్చు
లోక్‌సభ నియోజకవర్గం నరసరావుపేట
శాసనసభ నియోజక వర్గాలు (7)

నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం వ్యాసంలోని విభాగం ఇమడ్చబడింది.

ఆకర్షణలు

మార్చు

జిల్లాలో చెప్పుకోదగ్గ వ్యక్తులు

మార్చు
  •  
    కొమెర అంకారావు, కారెంపూడి
    కొమెర అంకారావు: ఇతను కారెంపూడి గ్రామంలో 1983లో రాములు, ఏడుకొండలు దంపతులకు జన్మించాడు. ఇతను ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, అడవులు సంరక్షణ, పెంపకం, వృద్ధి కోసం నడుముకట్టి, గత రెండు దశాబ్దాలుగా పైగా అలుపెరుగనిపోరాటం చేస్తూ, నల్లమల అడవులలో ప్లాస్టిక్ నిర్మూలన చేస్తూ, సమాజాన్ని చైతన్య పరుస్తూ సరికొత్త హరిత అడవులు సృష్టిస్తున్న, భారతీయ పర్యావరణ యోధుడు, పర్యావరణ వేత్త, నల్లమల అడవితల్లి బిడ్డగా గుర్తింపు పొందాడు.[10]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "District Census Hand Book – Guntur" (PDF). Census of India. Registrar General and Census Commissioner of India.
  2. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-08-20. Retrieved 2022-08-20.
  4. "Industrial Profile-Guntur District by AP Industries Dept 2001-02" (PDF). Archived from the original (PDF) on 2012-05-13. Retrieved 2012-05-24.
  5. "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
  6. "Table C-16 Population by Mother Tongue: Andhra Pradesh". Census of India. Registrar General and Census Commissioner of India.
  7. "New Districts In AP: ఏపీలో కొత్త జిల్లాలివే.. గెజిట్ విడుదల". ETV Bharat News. Retrieved 2022-04-03.
  8. "పాలనలో... నవశకం". ఈనాడు. Retrieved 2022-04-16.
  9. "3 mandals to be shifted to other divisions". Times of India. 2022-11-12. Retrieved 2024-04-27.
  10. "కొమెర జాజి: నల్లమల అడవిలో పార్టీలు చేసుకునే కుర్రాళ్లకు ఆయన ఎందుకు క్లాసు తీసుకుంటారు? - BBC News తెలుగు". web.archive.org. 2024-08-06. Archived from the original on 2024-08-06. Retrieved 2024-08-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  11. "Those memories are safe! - Sakshi". web.archive.org. 2021-10-03. Archived from the original on 2021-10-03. Retrieved 2021-10-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

మార్చు