అమరావతి కథా సంగ్రహం 76-100

నూరు కథలు అమరావతి కథలు. రచన సత్యం శంకరమంచి ఈ నూరు కథల్నీ ఆంధ్రజ్యోతి వార పత్రిక వారు రెండు సంవత్సరాలపాటు 1975-77 మధ్య ధారావాహికంగా వేశారు. కథలన్నీ కూడా మానవత్వపు విలువలను ఎత్తి చూపటమేకాకుండా, సామాజిక, వ్యక్తిగత బలహీనతలను ఎండగట్టుతూ ఉంటాయి. ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక దూరదర్శన్ లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక అమరావతిలోనే చిత్రీకరించబడటం విశేషం.

అమరావతి కథలు వ్యాసంలో ఈ పుస్తకం గురించిన వివరాలు, కథల జాబితా ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క కథ గురించి మరిన్ని విశేషాలు నాలుగు వేరు వేరు వ్యాసాలలో పొందుపరచబడ్డాయి .

అమరావతి కథలు 76 నుండి 100 వరకుసవరించు

76.తెల్లవారిందిసవరించు

  • ముఖ్య పాత్రలు-సుబ్బడు
  • బాపు బొమ్మ-కల్లుకుండ కోడి గుడ్డు అయినట్టు, అందులోనుంచి పగలగొట్టుకుని బయటకు వస్తున్న సుబ్బడు పునర్జన్మ పోంది ఊదయిస్తున్న సూర్యుణ్ణి చూస్తున్నట్టు వేసి, కథలో సుబ్బడి మార్పును చిత్రరూపంగా చూపించారు బాపు.
  • కథ-ఇదొక తాగుబోతు కథ. డబ్బులున్నంతవరకూ రోజూ తాగడానికి అలవాటుపడి, వ్యసనానిమి బానిసైన సుబ్బడు, ఒక రోజు వాడికి కూలి డబ్బులు దొరకక తాగడం కుదరదు. ఆరోజు తెల్ల వారినాక మత్తుగా గాక మామూలుగా నిద్ర లేచిన వాడికి ప్రపంచం అంతా అందంగా కనబడుతుంది. "ఇటాగెప్పుడూ లేదే" అని అబ్బురపడిన సుబ్బడు మారినట్టుగా పాఠకునికి ఒక చక్కని భావనను ఇచ్చి కథ ముగించారు.

77.తంపులమారి సోమలింగంసవరించు

  • ముఖ్య పాత్రలు-సోమలింగం, బుచ్చమ్మ
  • బాపు బొమ్మ-హిందువు పిలకకీ, సాయెబు టొపీ తాడుకీ దయ్యమయ్యి ముడెడుతున్న సూమలింగం. కథలో, అతను మరణానంతరం కూడా తన తంపులమారితనాన్ని ప్రదర్శించటాన్ని చక్కగా చూపుతున్నది.
  • కథ-ఒక తంపులమారి సోమలింగం కథ. వాడికి నా అనే వాళ్ళెవరూ లేరు.ఒట్టి నికృష్టుడు. తింటానికున్నది, కాలక్షేపంగా తంపులు పెడుతుంటాదు. ఒక్క బుచ్చెమ్మకే దడిసి ఆవిడ ఎదురుపడడు సోమలింగం. తాను మరణించాక తనను కాల్చకుండా పూడ్చాలని కోరతాడు. వాడి కోరికననుసరించి ఊరి వారు వాడి శవాన్ని గోరీల దొడ్డిలో పూడ్చాటానికి తీసుకెళ్లాటం హిందూ ముస్లిం తగాదాగా మారి దొమ్మీ జరుగుతుంది. బుచ్చెమ్మ వచ్చి సోమలింగం కోరిక వెనకాల ఉన్న తంపులమారితనాన్ని వివరించినాక తమ తప్పు తెలుసుకున్న హిందువులూ ముస్లింలు ఏకంగా సోమలింగాన్ని కృష్ణోడ్డుకు మోసుకెళ్ళి బూడిద చెయ్యటంతో కథ ముగుస్తుంది. బుచ్చెమ్మలాగ ఇటువంటి తంపులమార్ల మాయలు తెలియ చెప్పేవాళ్ళుంటే బాగుండును అనిపిస్తుంది.

78.ఏడాదికో రోజు పులిసవరించు

79.దూరంగా సారంగధరసవరించు

80.అమావాస్య వెలిగిందిసవరించు

81.త, థి, తో, నసవరించు

82.స్తంభనసవరించు

83.పట్టుత్తరీయంసవరించు

84.మృత్యోర్మా...సవరించు

85.అంతా బాగానే ఉందిసవరించు

86.దీపం - జ్యోతిసవరించు

87.కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతిసవరించు

88.పూల సుల్తాన్సవరించు

89.పక్కవీధి జన్మంత దూరంసవరించు

90.టపా రాలేదు బొట్టు చెరగలేదుసవరించు

91.భోజనాంతే...సవరించు

92.ఓ నరుడా! వానరుడా!సవరించు

93.బిందురేఖసవరించు

94.నేనూ మేల్కొనే వున్నానుసవరించు

95.ఏడుపెరగనివాడుసవరించు

96.అరుగరుకో సుబ్బయ్య మేష్టారుసవరించు

97.ప్రణవమూర్తిసవరించు

98.సీతారమాభ్యాం నమ:సవరించు

99.శిఖరంసవరించు

100.మహా రుద్రాభిషేకంసవరించు