ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి ఒక తెలుగు దినపత్రిక.[2] సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్ మరికొందరు మిత్రులతో కలసి 1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో వేమూరి రాధాకృష్ణ సారథ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది. ఈ పత్రికకు అనుబంధంగా నవ్య వారపత్రిక, ఆంధ్రజ్యోతి జర్నలిజం పాఠశాల, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టివి ఛానల్ నడుపబడుతున్నాయి.
![]() | |
రకం | ప్రతిదినం |
---|---|
రూపం తీరు | బ్రాడ్షీట్ |
యాజమాన్యం | కె.యల్.ఎన్.ప్రసాద్ (తొలి దశ), ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్(మలిదశ) |
ప్రచురణకర్త | వేమూరి రాధాకృష్ణ |
సంపాదకులు | కె. శ్రీనివాస్ |
స్థాపించినది | 1960-07-01 విజయవాడ, ఆంధ్రప్రదేశ్, 2002-10-15(కొత్త నిర్వహణ)[1] |
ముద్రణ నిలిపివేసినది | 2000-12-30 నుండి 2002-10-14 |
కేంద్రం | హైదరాబాద్ |
జాలస్థలి | http://andhrajyothy.com |
చరిత్రసవరించు
1960-2000సవరించు
సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్ మరికొందరు మిత్రులతో కలసి ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్ పక్షాన1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు.[1] అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షత వహించిన సభలో కేంద్ర సమాచార శాఖ మంత్రి బి.వి.కేస్కర్ పత్రికను ప్రారంభించారు. నాలుగు ఎడిషన్లుగా ప్రచరించబడింది. 2000లో ప్రచురణ నిలిచిపోయింది.
మొదట నార్లతో విద్వాన్ విశ్వం, నండూరి రామమోహనరావు సహాయ సంపాదకులుగా పనిచేశారు. 1976లో నార్ల ఛీఫ్ ఎడిటర్ గా, నండూరి రామమోహనరావు ఎడిటర్ గా నియమితులైనారు. 1977 ఎన్నికల తరువాత నార్ల సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నండూరి సంపాదకత్వం స్వీకరించాడు. నండూరి రామమోహనరావు పదవీ విరమణ చేసిన తరువాత ఇనగంటి వెంకట్రావు సంపాదకులైనారు. ఆ తరువాత సంపాదకులుగా తుర్లపాటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ మొదలైనవారు పనిచేశారు. 2000 సంవత్సరాంతంలో ఆంధ్రజ్యోతి మూతపడింది.
2002-సవరించు
2002 అక్టోబరు 15 న పాత పత్రికలో సీనియర్ రిపోర్టరుగా పనిచేసిన వేమూరి రాధాకృష్ణ మేనేజింగ్ డైరెక్టరుగా, కె.రామచంద్రమూర్తి సంపాదకులుగా 9 ప్రచురణ కేంద్రాలతో ఒకేసారి తిరిగి ప్రారంభించబడింది. తరువాత 18 ప్రచురణ కేంద్రాలకు విస్తరించింది. 2008 నుండి కె. శ్రీనివాస్ సంపాదకుడిగా ఉన్నాడు. వేమన వసంత లక్ష్మి, నవ్య అనుబంధం, ఆదివారం అనుబంధం ఫీచర్ సంపాదకులుగా, జగన్ ఆన్లైన్ సంపాదకునిగా, పురందరరావు సీనియర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ గా ఉన్నారు.
అమ్మకాలు, చదువరులుసవరించు
తెలుగు రాష్ట్రాలలో 19 చోట్ల, బెంగుళూరు, చెన్నైలనుండి ముద్రితమవుతున్నది.
- అమ్మకాలు
ఆంధ్రజ్యోతికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ లో సభ్యత్వం లేదు కావున మూడవ వ్యక్తిచే తనిఖీ చేయబడిన సగటుఅమ్మకాలు తెలియవు,
- చదువరులు
ఐఆర్ఎస్ 2019 రెండవ త్రైమాసికం గణాంకాల ప్రకారం ఈనాడుకు తెలుగు రాష్ట్రాల్లో రోజువారి సగటున పత్రిక చదివేవారి సంఖ్య 22,39,000 వుండగా, గత నెలలో ఏనాడైనా పత్రిక చదివిన వారి సంఖ్య 58,49,000 గా ఉంది. గత త్రైమాసికంతో పోల్చితే రోజు వారి సగటు చదువరుల సంఖ్య 9.5% తగ్గింది. ఆంధ్రజ్యోతి తెలంగాణాలోని తెలుగు దినపత్రికలలో నాల్గవ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ లో మూడవ స్థానంలో ఉంది.[3]
భాషసవరించు
ఆంధ్రజ్యోతి శైలి, అన్న ప్రచురణ ఈ పత్రిక యాజమాన్యం ప్రచురించింది.
శీర్షికలు, విశిష్టతలుసవరించు
వారం | విశిష్టత |
---|---|
నవ్య మహిళల పేజీ | |
ఆదివారం అనుబంధం | |
వివిధ సాహిత్య వేదిక | |
దిక్చూచి (విద్య, ఉద్యోగావకాశాల ప్రత్యేకం) | |
సకల | |
చింతన | |
వైద్యం | |
సంస్కృతి |
ప్రముఖ కాలమిస్టులుసవరించు
శీర్షిక | కాలమిస్టు | ప్రచురణ వారం, విషయాలు |
---|---|---|
కె. శ్రీనివాస్ | వార్తావిశ్లేషణ | ||
రాజ్ దీప్ సర్దేశాయ్ | శుక్రవారం, వార్తావిశ్లేషణ | ||
మేనకా గాంధీ | జీవకారుణ్యం | ||
సుధీంధ్ర కులకర్ణి | | ||
భరత్ ఝన్ ఝన్ వాలా |వార్తా విశ్లేషణ | ||
రామచంద్ర గుహ | చారిత్రిక విశ్లేషణ | ||
తెలకపల్లి రవి | వార్తా విశ్లేషణ | ||
ఎ కృష్ణారావు |జాతీయ వార్తా విశ్లేషణ | ||
వేమూరి రాధాకృష్ణ | |
గతంలో ప్రాణహిత శీర్షికన అల్లం నారాయణ తెలంగాణ వాదం విశ్లేషించారు.
ఆన్ లైన్ రూపాలుసవరించు
ఆన్లైన్ సంచిక వివిధరూపాల్లో లభ్యమవుతున్నది.
- హెచ్టిఎమ్ఎల్ పాఠ్యం రూపంలో ఇంటర్నెట్ లో ఆంధ్రజ్యోతి [2] అందుబాటులో ఉంది. మొదట్లో స్వంత ఖతి "శ్రీ తెలుగు" వుపయోగించిన తరువాత ప్రామాణిక యూనికోడ్‌కి మార్చబడింది. పాత సంచికలు వెబ్సైట్ కొత్త రూపంతో అందుబాటులోలేవు
- పిడీయఫ్ ఆంధ్రజ్యోతి ఈపేపర్ లింకు
ఈ పిడీయఫ్ ఆన్‌లైన్ సంచికలో ఆంధ్రజ్యోతి పేపరును అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు.
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ఆంధ్రజ్యోతి", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 412–413.
{{cite book}}
: CS1 maint: extra punctuation (link) - ↑ 2.0 2.1 "ఆంధ్రజ్యోతి జాలస్థలి". Retrieved 2020-07-10.
- ↑ "Indian Readership Survey Q2,2019" (PDF). 2019-08-14. Archived from the original (PDF) on 2019-08-17.