అమర్ చిత్ర కథ

కామిక్ పుస్తకాల ప్రచురణ సంస్థ

అమర్ చిత్ర కథ ముంబై కేంద్రంగా పనిచేసే కామిక్ పుస్తకాల ప్రచురణ సంస్థ. దీనిని 1967 లో అనంత్ పాయ్ స్థాపించాడు. ఈ సంస్థ ధార్మిక కథలు, పురాణాలు, చారిత్రక వ్యక్తుల జీవిత చరిత్రలు, జానపద కథలను బొమ్మల (కామిక్స్) రూపంలో ప్రచురిస్తూ ఉంటుంది.

స్థాపన, ఉద్దేశ్యం

మార్చు

అనంత్ పాయ్ భారతీయ బాలలు గ్రీకు, రోమన్ పురాణాలకు సంబంధించిన ప్రశ్నలను అవలీలగా జవాబులు చెప్పేవారు కానీ వారిదైన చరిత్ర, సంస్కృతి, జానపద కథలను గురించి మాత్రం సమాధానాలు చెప్పలేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. దానికి ఉదాహరణ 1967 లో దూరదర్శన్ లో ప్రసారమైన ఒక క్విజ్ పోటీలో గ్రీకు పురాణాల గురించి ప్రశ్నలు సమాధానం చెప్పారు కానీ రామాయణంలో రాముడి తల్లి ఎవరంటే సమాధానం చెప్పలేకపోయారు.[1][2] భారతదేశంలో పిల్లలకు సాంస్కృతిక చరిత్రను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించాడు.

అప్పటిదాకా పనిచేస్తున్న ఇంద్రజాల్ కామిక్స్ ని వదిలేసి సొంతంగా అమర్ చిత్ర కథ సంస్థను ప్రారంభించాడు. ముందుగా ఓ పది అమెరికన్ ఫెయిరీ టేల్స్ పైన హక్కులు కొనుగోలు చేసి వాటిని ప్రచురించాడు. మొట్ట మొదటి భారతీయ కార్టూన్ కృష్ణ. ఇది అమర్ చిత్ర కథ నుంచి విడుదలైన 11 వ పుస్తకం.[3]

మూలాలు

మార్చు
  1. Now, Amar Chitra Katha gets even younger Vijay Singh, TNN, The Times of India, 16 October 2009.
  2. The World of Amar Chitra Katha Media and the Transformation of Religion in South Asia, by Lawrence A Babb, Susan S. Wadley. Motilal Banarsidass Publ., 1998. ISBN 81-208-1453-3. Chapt. 4, p. 76-86.
  3. Parthasarathy, Anusha (2011-12-26). "The serious side of comics". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-10-01.