అమర్ సింగ్ (రాజకీయవేత్త)

సమాజ్‌వాదీ పార్టీ మాజీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌,[2] 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించిన అమర్‌సింగ్‌.1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 2016లో చివరి సారిగా పెద్దల సభకు ఎస్పీ నుంచి నామినేట్‌ అయ్యారు. ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు, సమాజ్ వాదీ పార్టీ నాయకులలో ఒకరు. అతను హిందీ పరిజ్ఞానం, రాజకీయ సంబంధాలకు కూడా ప్రసిద్ది చెందాడు.అతను సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి, భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ సభ్యుడు .అమర్‌సింగ్‌ 1996లో తొలిసారి యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2003 లో రాజ్యసభకు ఎన్నికయ్యారు, 2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి అణు ఒప్పందం విషయంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న సందర్భంలో సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో అమర్‌సింగ్‌ కీలకంగా వ్యవహరించారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 2010లో అమర్‌సింగ్‌, సినీనటి జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించారు. 6 జనవరి 2010 న సమాజ్ వాదీ పార్టీ అన్ని పదవులకు రాజీనామా చేశారు.  తరువాత, పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ 2 ఫిబ్రవరి 2010 న పార్టీ నుండి బహిష్కరించారు.అనంతరం బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌తో ఓ బ్లాగ్‌ను ఏర్పాటు చేసి, అందులో యాక్టివ్‌గా ఉండేవారు. 2011లో కొంతకాలం జైలు జీవితం అనుభవించారు. ఆపై రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించినా.. అనూహ్యంగా ‘రాష్ట్ర్టీయ లోక్‌ మంచ్‌’ పేరుతో పార్టీని ప్రారంభించారు. 2012 యూపీ ఎన్నికల్లో 360 మంది అభ్యర్థులను నిలబెట్టారు. ఒక్క సీటు కూడా సాధించలేకపోయారు. తర్వాత రాష్ట్రీయ లోక్‌ దళ్‌ తరఫున ఫతేపూర్‌ సిక్రీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2016 లో సమాజ్ వాదీ పార్టీకి తిరిగి వచ్చి రాజ్యసభకు ఎన్నికయ్యారు.2011 సంవత్సరంలో, అతను కొంతకాలం న్యాయ కస్టడీలో గడిపాడు. చివరికి రాజకీయాల నుండి రిటైర్ అయ్యారు. యూపీఏ 1 హయాంలో న్యూక్లియర్ డీల్ సందదర్భంగా కేంద్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని ప్రభుత్వానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు ఉపసంహరించుకుంది. ఆ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కేంద్రానికి మద్దతు ఇవ్వడంలో అమర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 39 మంది ఎంపీలు ఉన్న ఎస్పీ యూపీఏకు మద్దతు పలికింది. దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు.[3] అతను 2016 నుండి మరణించే వరకు రాజ్యసభ సభ్యుడు గా వున్నాడు . ఆగస్టు 1, 2020 న, 64 సంవత్సరాల వయసులో, సింగపూర్‌లోని ఆసుపత్రిలో మూత్రపిండాల వైఫల్యంతో అమర్ సింగ్ మరణించాడు.[4]

Amar Singh
2008 లో ఇండియా ఎకనమిక్ సమ్మిట్ లో మాట్లాడుతున్న సింగ్
భారత రాజ్యసభ సభ్యుడు [1]
In office
5 జూలై 2016 – 1 ఆగస్టు 2020
అంతకు ముందు వారుఅంబెత్ రాజన్
తరువాత వారుసయ్యద్ జాఫర్ ఇస్లాం
నియోజకవర్గంఉత్తర ప్రదేశ్
వ్యక్తిగత వివరాలు
జననం(1956-01-27)1956 జనవరి 27
అజమగర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
మరణం2020 ఆగస్టు 1(2020-08-01) (వయసు 64)
సింగపూర్
రాజకీయ పార్టీస్వతంత్ర
ఇతర రాజకీయ
పదవులు
సమాజ్‌వాది పార్టీ
రాష్ట్రీయ లోక్ దళ్
జీవిత భాగస్వామిపంకజ్ కుమారి సింగ్
సంతానం2
కళాశాలకలకత్తా విశ్వవిద్యాలయం
నైపుణ్యంరాజకీయ నాయకుడు

వ్యక్తిగత జీవితం

మార్చు

అమర్ సింగ్ 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో హరీష్ చంద్రసింగ్, శైల్ కుమారీ సింగ్ దంపతులకు జన్మించిన అమర్‌సింగ్‌ , తన విద్యాభ్యాసం అంతా కలకత్తాలోనే పూర్తి చేసి, కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ & ఎల్.ఎల్.బి పట్టా పొందారు.విద్యాభ్యాసం అనంతరం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన అమర్ సింగ్ కొంత కాలానికి మాధవరావు సిందియాకి అత్యంత సన్నిహితంగా మారి సుమారు 10ఏళ్ళు కలిసి రాజకీయ ప్రయాణం చేశారు.అతను ప్రఖ్యాత సినీ నటుడు అమితాబ్ బచ్చన్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ప్రత్యేక సన్నిహితుడు.అమర్‌సింగ్‌కు నటనలోనూ ప్రవేశముంది. హమారా దిల్‌ ఆప్‌ కే పాస్‌ హై, జేడీ తదితర సినిమాల్లో నటించారు.

మూలాలు

మార్చు
  1. "Samajwadi Party wins 7 Rajya Sabha seats in UP, Kapil Sibbal emerges victorious". NDTV. Archived from the original on 2019-08-23.
  2. "రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌ కన్నుమూత". Sakshi. 2020-08-01. Retrieved 2020-09-14.
  3. "అమర్ ‌సింగ్‌ కన్నుమూత". www.eenadu.net. Retrieved 2020-09-14.
  4. "రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి". BBC News తెలుగు. Retrieved 2020-09-14.