జయప్రద

సినీ నటి, రాజకీయ నాయకురాలు

తెలుగు సినీరంగములో జయప్రద లేదా జయప్రద నహతా (Jayaprada Nahata)గా పరిచితురాలైన లలితారాణి నటి, పార్లమెంటు సభ్యురాలు. జయప్రద 1962 ఏప్రిల్ 3ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది.[1]

జయప్రద
జయప్రద

పాటల విడుదల సందర్భములో జయప్రద


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004
ముందు నూర్‌బానో
నియోజకవర్గం రాంపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1962-04-03) 1962 ఏప్రిల్ 3 (వయసు 61)
రాజకీయ పార్టీ సమాజ్‌వాది పార్టీ
వృత్తి సినిమా నటి, రాజకీయవేత్త
మతం హిందూ మతం

సినీ ప్రవేశం మార్చు

జయప్రదకు బాల్యములో డాక్టరు అవ్వాలని కోరిక ఉండేది. ఈమె తల్లి ఈమెను ఏడవఏటి నుండే నాట్య సంగీత శిక్షణకు పంపినది. తన తండ్రి, బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీరంగ ప్రవేశము వారిద్వారా లభించలేదు. 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను చూసి ఈమెకు జయప్రద అని నామకరణము చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో (తెలుగు, తమిళం, మలయాళము, కన్నడ, హిందీ, బెంగాలి) 300కు పైగా సినిమాలలో నటించింది.

పాఠశాల తర్వాత ఈమె రాజమండ్రిలోని రాజలక్ష్మి మహిళా కళాశాలలో చదివినది. ఈమె 1986 జూన్ 22న సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహమాడినది.

రాజకీయ ప్రవేశం మార్చు

నందమూరి తారక రామారావు ఆహ్వానముతో 1994 అక్టోబర్ 10తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశము చేసింది. ఆ తర్వాత ఈమె చంద్రబాబు నాయుడు పక్షములో చేరి తెలుగు దేశము పార్టీ యొక్క మహిళా విభాగమునకు అధ్యక్షురాలైనది. 1996 ఏప్రిల్ లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనది. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన తెలుగు దేశము పార్టీకి రాజీనామా చేసి జయప్రద ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుండి 2004 మే 13లోక్ సభకు ఎన్నికైనది.

జయప్రద నటించిన తెలుగు చిత్రాలు మార్చు

ఇవి కూడ చూడండి మార్చు

వీర్ (1995 సినిమా)

మూలాలు మార్చు

  1. Mana Telangana (1 February 2022). "జయప్రదకు మాతృ వియోగం". మన తెలంగాణ. Archived from the original on 1 ఫిబ్రవరి 2022. Retrieved 1 February 2022.
  2. Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.
  3. సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=జయప్రద&oldid=3890944" నుండి వెలికితీశారు