అమీర్ ఎలాహి
అమీర్ ఎలాహి (1908 సెప్టెంబరు 1 - 1980 డిసెంబరు 28) ఒకటి కంటే ఎక్కువ దేశాల తరఫున టెస్టు క్రికెట్ ఆడిన పదిహేను మంది క్రికెటర్లలో ఒకడు. [1] 1947లో ఆస్ట్రేలియాతో భారత్ తరఫున, స్వాతంత్ర్యం తరువాత పాకిస్తాన్ తరఫునా టెస్టులు ఆడినందున అతనికి ఈ గౌరవం లభించింది. అతను తన కెరీర్‌లో 6 టెస్టులు ఆడగా, అందులో పాకిస్తాన్ తరపున 5 ఆడాడు. భారత్‌పై కూడా ఆడాడు. పాకిస్థాన్‌కు తొలి సిరీస్‌లో, అతను కలకత్తాలో తన చివరి టెస్టు ఆడినప్పుడు, అతని వయస్సు 44 సంవత్సరాలు. అతను మీడియం పేసర్‌గా బౌలింగ్1ఉ ప్రారంభించి తరువాతి కాలంలో లెగ్ స్పిన్ బౌలరుగా మారాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అమీర్ ఎలాహి | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, బ్రిటిషు భారతదేశం | 1908 సెప్టెంబరు 1|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1980 డిసెంబరు 28 కరాచీ, సింధ్, పాకిస్తాన్ | (వయసు 72)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టులు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 40/1) | 1947 డిసెంబరు 12 ఇండియా - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1952 డిసెంబరు 12 పాకిస్తాన్ - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo.com, 2019 మార్చి 12 |
ప్రారంభ సంవత్సరాల్లో
మార్చుటెస్ట్ క్రికెట్‌లోకి ప్రవేశించే ముందు, అతను 1936లో భారత జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. 42.94 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 1947-48లో ఆస్ట్రేలియా పర్యటనలో 65.87 సగటుతో 8 వికెట్లు తీయగలిగాడు.స్వాతంత్ర్యం ముందు భారత్‌లో అమీర్ ఇలాహి ప్రసిద్ధ ఆటగాడు. రంజీ ట్రోఫీలో 24.72 సగటుతో 193 వికెట్లు తీశాడు.
స్వాతంత్య్రానంతరం పాకిస్థాన్‌కు వెళ్లి, ఆ తర్వాత పాకిస్థాన్ జట్టుతో కలిసి 1952–53లో పర్యటనకు భారత్ వచ్చాడు. అపుడు 38.76 సగటుతో 13 వికెట్లు తీశాడు. మద్రాస్‌లో (ప్రస్తుతం చెన్నై) అతను జుల్ఫికర్ అహ్మద్‌తో కలిసి చివరి వికెట్‌కు 104 పరుగులు చేశాడు. దీనిలో అతను 47 పరుగులు అందించాడు.
అమీర్ ఎలాహి 1980 డిసెంబరు 28 న 72 సంవత్సరాల వయసులో, కరాచీలో మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ "Amir Elahi". ESPN Cricinfo.