అమీర్ హైదర్ ఖాన్

అమీర్ హైదర్ ఖాన్ (2 మార్చి 1900– 27 డిసెంబర్ 1989) పాకిస్తాన్ కమ్యూనిస్ట్ కార్యకర్త, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవకారుడు.స్వాతంత్ర్య సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు.[1][2][3]

అమీర్ హైదర్ ఖాన్
అమీర్ హైదర్ ఖాన్
జననంఅమీర్ హైదర్ ఖాన్
1900 2 మార్చి
పంజాబ్ రాష్ట్రం
మరణం1989 27 డిసెంబర్
పాకిస్తాన్

జననం,వ్యక్తిగత వివరాలు

మార్చు

అమీర్ హైదర్ ఖాన్ 1900 లో పంజాబ్ రాష్ట్రం రావల్పిండి జిల్లాలోని సీలియన్ గ్రామంలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో) ఒక పేద కుటుంబంలో జన్మించారు.చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు.చిన్న వయసులో షిప్‌లోడర్‌గా పని చేయడానికి బొంబాయికి వెళ్ళాడు. ఓడలో ప్రయాణిస్తూ విదేశాలలో ఉన్న భారతీయ విప్లవకారులతో పరిచయం ఏర్పర్చుకున్నాడు. అమెరికాలో కొంత కాలం ఆటోమొబైల్ ఫ్యాక్టరీలో పనిచేశాడు. తరువాత USA కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు.తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చాడు.

కమ్యూనిస్టు ఉద్యమం

మార్చు

భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ సంస్థాపన కోసం స్వదేశం చేరుకొన్నాడు. బొంబాయిలో ఉద్యోగం చేస్తూ కార్మికుల ఉద్యమంలో పాల్గొంటూ కార్యాలయంలో పని చేస్తుండేవాడు.1929లో మీరట్ కమ్యూనిస్టు కుట్రకేసులో హైదర్ ఖానను బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి మద్రాసు వచ్చాడు. మద్రాసులో మొదట కామ్రేడ్ కంభంపాటి సీనియర్ను పార్టీ సభ్యునిగా చేర్చుకొన్నారు. తరువాత కామ్రేడ్ సుందరయ్యను సభ్యునిగా చేర్చుకొనడమేగాక, తాను అరెస్టు చేయబడి దీర్ఘకాలం జైళ్ళలో ఉండటంతో కామ్రేడ్ సుందరయ్యను తన స్థానంలో నియమించి దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు.మద్రాసులో అరెస్టయి జైలు జీవితం గడిపి, 1942లో విడుదలై,1945లో తన జన్మస్థలం రావల్పిండి వెళ్ళిపోయాడు.1945 లో స్వాతంత్య్రం తర్వాత 1988 భారతదేశంలో తన మొదటి పర్యటన చేశారు.[4]

అమీర్ హైదర్ ఖాన్ 1989 డిసెంబర్ 27 పాకిస్థాన్ లోని రావల్పిండిలో మరణించాడు.

గ్రంథ పట్టిక

మార్చు
  • Chains to Lose: Life and Struggles of a Revolutionary : Memoirs of Dada Amir Haider Khan, Hassan Gardezi, Patriot Publishers, 1989. ISBN 81-7050-097-4.[2]
  • Chains to Lose: Dada Amir Haider. Edited by Hasan.N.Gardezi. Pakistan Study Centre, Karachi University, 2007. (Two Volumes).[1][3]
  • Bengali Harlem and the lost histories of South Asian America, Vivek Bald, Harvard University Press, 2013.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Sarwat Ali (9 March 2008). "Strands of freedom". The News International (newspaper). Retrieved 31 October 2020.
  2. 2.0 2.1 KARACHI: Memoirs of a global revolutionary Dawn (newspaper), Published 6 December 2008, Retrieved 31 October 2020
  3. 3.0 3.1 Muhammad Ali Siddiqui (4 January 2008). "BOOK REVIEW: A Revolutionary's Tale". Academy of the Punjab in North America (APNA) website. Retrieved 31 October 2020.
  4. Vivek Bald (2013). Bengali Harlem and the lost histories of South Asian America. Harvard University Press. p. 153.