స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు

స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు పరకాల పట్టాభిరామారావు సంపాదకత్వంలో విడుదలైన తెలుగు పుస్తకం. దీన్ని 2000 సంవత్సరంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది.[1]భారత జాతీయోద్యమంలో కాంగ్రెస్ వాదులే కృషిచేశారన్న అభిప్రాయం దురదృష్టవశాత్తూ చరిత్ర పుస్తకాలు కలిగిస్తున్నాయి. కమ్యూనిస్టుల ప్రస్తావన వచ్చినా విడిగా రావడమే గానీ స్వాతంత్ర్య సమరంలోని ప్రముఖులుగా చరిత్రలో రాదు. భగత్‌సింగ్ వంటి ప్రముఖ స్వాతంత్ర్య విప్లవ యోధులు కమ్యూనిస్టులే. ఐతే 1940ల్లో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా అభివర్ణించి రష్యాను మిత్రదేశమైన బ్రిటన్‌ను సమర్థించడం, ఆపైన కాంగ్రెస్ చేసిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించడం వంటి పరిణామాలు దీనికి కారణం కావచ్చు. కానీ అనంతర కాలంలో బొంబాయి నేవీ తిరుగుబాటు వంటి పోరాటాలలో కమ్యూనిస్టులు చురుకుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన ప్రయత్నాలు, పోరాటాలను ఈ గ్రంథంలో వ్యక్తుల వారీగా రాశారు.ఇందులో ఎక్కువ భాగం " నేనెలా స్వాతంత్ర్యోద్యమంలోకి, కమ్యూనిష్టు ఉద్యమంలోకి వచ్చాను " అన్న సంక్షిప్త స్వీయ కథనాలు. మరికొన్ని కామ్రేడ్లు మరణానంతరం ఇతరులు వ్రాసినవి. వీనిలో ఎక్కువభాగం 1995, 1996 కమ్యూనిజం ప్రత్యేక సంచికలలో ప్రచురించబడినవి.[2]

ఇందులోని దేశభక్తులు

మార్చు
  1. అమీర్ హైదర్ ఖాన్ - దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ సంస్థాపకులు.
  2. కంభంపాటి సత్యనారాయణ - ఆంధ్రదేశంలో తొలి కమ్యూనిస్టు, మార్క్సిస్టు మేధావి, చరిత్రకారులు.
  3. పుచ్చలపల్లి సుందరయ్య - దక్షిణ భారతదేశంలోను, ఆంధ్రదేశంలోను కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత.
  4. పోలేపెద్ది నరసింహమూర్తి - రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ప్రథమ కార్యదర్శులలో ఒకరు.
  5. చండ్ర రాజేశ్వరరావు - భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు.
  6. మద్దుకూరి చంద్రశేఖరరావు - రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు.
  7. రావి నారాయణరెడ్డి - తెలంగాణా సాయుధ పోరాట అగ్రనాయకులు.
  8. ఐదుకల్లు సదాశివన్ - రాయలసీమ కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు.
  9. పి. వి. శివయ్య - మార్క్సిస్టు మేధావి, అభ్యుదయ రచయిత, గుంటూరు జిల్లా కమ్యూనిస్తు ఉద్యమ నిర్మాత.
  10. నండూరి ప్రసాదరావు - ఆంధ్ర రైతు ఉద్యమ అగ్రనాయకులు, మార్క్సిస్టు పార్టీ కురువృద్ధులు.
  11. పి. వి. రాఘవయ్య - బెనారస్ కమ్యూనిస్టు గ్రూపు ప్రముఖులు, న్యాయవాది, శాంతి స్నేహ ఉద్యమ ప్రముఖులు.
  12. వై. వి. కృష్ణారావు - అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు.
  13. మోటూరు హనుమంతరావు - ఆంధ్రప్రదేశ్ మార్క్సిస్టు పార్టీ అగ్రనాయకులు, ప్రజాశక్తి సంపాదకులు.
  14. నీలం రాజశేఖరరెడ్డి - రాష్ట్ర కమ్యూనిస్టు అగ్రనాయకులు.
  15. రాజ బహదూర్ గౌర్ - తెలంగాణా కమ్యూనిస్టు అగ్రనాయకులు, ట్రేడ్ యూనియన్ ప్రముఖులు, ప్రముఖ ఉర్దూ రచయిత.
  16. కె. ఎల్. మహేంద్ర - తెలంగాణా పోరాట యోధులు, కమ్యూనిస్టు అగ్రనాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు.
  17. బి. ధర్మభిక్షం - తెలంగాణా పోరాట యోధులు, రాష్ట్ర కల్లుగీత కార్మికోద్యమ పితామహులు.
  18. ఎ. గురవారెడ్డి - తెలంగాణా కమ్యూనిస్టు నాయకులు.
  19. దొడ్డా నరసయ్య - తెలంగాణా సాయుధ పోరాట యోధులు.
  20. పిల్లలమర్రి వెంకటేశ్వర్లు - ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ ఉద్యమ నాయకులు, తొలి కమ్యూనిస్టు శాసన సభ్యులు.
  21. వై. విజయకుమార్ - విశాఖ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు.
  22. వేములపల్లి శ్రీకృష్ణ - గుంటూరు జిల్లా కమ్యూనిస్టు నాయకులు, అభ్యుదయ రచయిత.
  23. ఎన్. శివరామిరెడ్డి - రాయలసీమ కమ్యూనిస్టు ఉద్యమ సీనియర్ నాయకులు.
  24. జోశ్యభట్ల సత్యనారాయణ - రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రముఖులు.
  25. మహీధర రామమోహన్ రావు - ముంగండ విశ్వసాహిత్యమాల సంస్థాపకులు. ప్రఖ్యాత నవలా రచయిత.
  26. చిర్రావూరి లక్ష్మీనరసయ్య - ఖమ్మం జిల్లా మార్క్సిస్టు ప్రముఖులు.
  27. ఏటుకూరి బలరామమూర్తి - మార్క్సిస్టు అధ్యయన వేత్త, ప్రఖ్యాత చరిత్రకారులు.
  28. పరకాల పట్టాభిరామారావు - విశాలాంధ్ర, కమ్యూనిజం పత్రికలలో సంపాదకులు, రచయిత.
  29. మోదుమూడి శ్రీహరిరావు - కృష్ణా జిల్లా కమ్యూనిస్టు నాయకులు.
  30. ఇందుకూరి సుబ్బరాజు - పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు.
  31. అల్లూరి వెంకట్రామరాజు - తూర్పు గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు.
  32. ముళ్లపూడి సూర్యనారాయణ - తూర్పు గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు.
  33. సి. వి. కె. రావు - రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు, జిల్లాలో తొలితరం కమ్యూనిస్టు నాయకులు.
  34. కొల్లా వెంకయ్య - గుంటూరు జిల్లా కమ్యూనిస్టు నాయకులు.
  35. కోడుగంటి గోవిందరావు - విశాఖ జిల్లా కమ్యూనిస్టు నాయకులు.
  36. కారుమూడి సత్యనారాయణరెడ్డి - పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు.
  37. మోటూరు పరంధామయ్య - నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు నాయకులు.
  38. మహ్మద్ రజబలీ - ఎమ్‌.ఎల్.ఎ., ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు నాయకులు.
  39. కంభంపాటి మాణిక్యాంబ - మహిళా నాయకురాలు.
  40. చండ్ర సావిత్రీదేవి - (రాష్ట్ర మహిళా ఉద్యమ ప్రముఖురాలు.
  41. ఆరుట్ల కమలాదేవి - ( మాజీ ఎమ్‌.ఎల్.ఎ. తెలంగాణ.

మూలాలు

మార్చు
  1. భారత డిజిటల్ లైబ్రరీలో స్వాతంత్ర సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు పుస్తకం.
  2. పరకాల పట్టాభిరామారావు(సం.) (2000-01-01). స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు.

వెలుపలి లంకెలు

మార్చు