అమీ లౌ ఆడమ్స్ (ఆంగ్లం: Amy Lou Adams; జననం 1974 ఆగస్టు 20) అమెరికన్ నటి. ఆమె హాస్య, నాటకీయ పాత్రలకు ప్రసిద్ధి చెందింది, ఆమె ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటీమణుల వార్షిక ర్యాంకింగ్స్‌లో మూడుసార్లు నిలిచింది. ఆమె ఆరు అకాడమీ అవార్డులు, ఏడు బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులు, రెండు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులకు నామినేషన్లతో పాటు రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులతో సహా పలు ప్రశంసలను అందుకుంది.

అమీ ఆడమ్స్
2016లో అమీ ఆడమ్స్
జననం
అమీ లౌ ఆడమ్స్

(1974-08-20) 1974 ఆగస్టు 20 (వయసు 49)
అవియానో, ఇటలీ
జాతీయతఅమెరికన్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1994–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
డారెన్ లే గాల్లో
(m. 2015)
పిల్లలు1

ఆమె డిన్నర్ థియేటర్‌లో డాన్సర్‌గా తన కెరీర్ ప్రారంభించింది, దానిని ఆమె 1994 నుండి 1998 వరకు కొనసాగించింది. డార్క్ కామెడీ డ్రాప్ డెడ్ గార్జియస్ (1999)లో సహాయక పాత్రతో ఆమె చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. ఆమె టెలివిజన్‌లో అతిథి పాత్రలు కూడా చేసింది. తక్కువ-బడ్జెట్ చలనచిత్రం "మీన్ గర్ల్" వంటి వాటిలో ఆమె నటించింది. ఆమె స్టీవెన్ స్పీల్‌బర్గ్ బయోపిక్ క్యాచ్ మీ ఇఫ్ యు కెన్ (2002)లో మొదటిసారిగా ప్రధాన పాత్ర పోషించింది, అయితే, ఆ తరువాత చాలా కాలం వరకు ఆమెకు ఏ అవకాశాలు రాలేదు. జూన్‌బగ్ (2005)లో ఆమె ఆడంబరమైన గర్భిణీ స్త్రీ పాత్రను పోషించి, ఆమె చక్కని పురోగతి సాధించింది. దీనికిగాను ఆమె తన మొదటి అకాడమీ అవార్డు ప్రతిపాదనను అందుకుంది.

మ్యూజికల్ ఫాంటసీ చిత్రం ఎన్‌చాన్టెడ్ (2007)లో ఆమె ఉల్లాసవంతమైన యువరాణిగా నటించింది, డ్రామా డౌట్ (2008) వంటి చిత్రాలలో ఇతర అమాయక, ఆశావాద మహిళల పాత్రలను పోషించింది. తదనంతరం స్పోర్ట్స్ ఫిల్మ్ ది ఫైటర్ (2010), సైకలాజికల్ డ్రామా ది మాస్టర్ (2012)లలో మరింత దృఢమైన పాత్రలను పోషించి సానుకూల సమీక్షలను ఆమె అందుకుంది. 2013 నుండి 2017 వరకు, ఆమె డీసి ఎక్స్‌టెండెడ్ యూనివర్స్‌లో సెట్ చేయబడిన సూపర్ హీరో చిత్రాలలో లోయిస్ లేన్ పాత్రను పోషించింది. క్రైమ్ ఫిల్మ్ అమెరికన్ హస్టిల్ (2013)లో సెడక్టివ్ కాన్ ఆర్టిస్ట్‌గా, బయోపిక్ బిగ్ ఐస్ (2014)లో పెయింటర్ మార్గరెట్ కీన్‌గా నటించినందుకు ఆమె ఉత్తమ నటిగా వరుసగా రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను గెలుచుకుంది. సైన్స్ ఫిక్షన్ చిత్రం అరైవల్ (2016), HBO మినిసిరీస్ షార్ప్ ఆబ్జెక్ట్స్ (2018), వైస్ (2018)లు ఆమె కెరీర్ కి మరింత మేలు చేసాయి.

ఆమె రంగస్థల పాత్రలలో 2012లో పబ్లిక్ థియేటర్ ఇన్‌టు ది వుడ్స్, 2022లో ది గ్లాస్ మెనేజరీ వెస్ట్ ఎండ్ థియేటర్లు ఉన్నాయి. 2014లో, ఆమె టైమ్ ద్వారా ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేరుపొందింది. అలాగే ఆమె ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలోనూ చేరింది.

మూలాలు మార్చు