అకాడమీ పురస్కారాలు

ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధిచెందిన అకాడమీ అవార్డులు (Academy of Motion Picture Arts and Sciences) (AMPAS) ప్రతీ యేటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు మరియు ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక బహుమతులు. దీని బహుమతి ప్రదానోత్సవం అత్యంత వైభోగంగా జరుపడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వీక్షిస్తారు.[1]

అకాడమీ పురస్కారాలు
87th Academy Awards
ఎందుకు ఇస్తారు సినిమా రంగంలో అత్యున్నత ప్రతిభను కనబరిచినందుకు
సమర్పణ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్
దేశం అమెరికా
మొదటి ప్రధానం మే 16, 1929
అధికారక వెబ్‌సైటు oscars.org

మొట్ట మొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం మే 16, 1929లో హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది. 1927, 1928 సంవత్సరాలలో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ మరియు విలియం డెమిలీ కలిసి ఇది ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. "About the Academy Awards". Academy of Motion Picture Arts and Sciences. Retrieved 2007-04-13.