అమృతాంజనం

(అమృతాంజనము నుండి దారిమార్పు చెందింది)

అమృతాంజనం (ఆంగ్లం: Amrutanjan) అనునది నొప్పి నివారిణిగా వాడబడే ఔషధతైలం. ఇది అమృతాంజన్ హెల్త్ కేర్ అనే సంస్థకు చెందినది.[1][1]

అమృతాంజనం
అమృతాంజన్ నొప్పి నివారణి ఔషధ తైలం
రకంతలనొప్పి నివారిణి
ఆవిష్కర్తకాశీనాథుని నాగేశ్వరరావు
ప్రారంభ తేదీ1893 (1893)
కంపెనీఅమృతాంజన్ హెల్త్ కేర్
లభ్యతఅందుబాటులో ఉంది
ప్రస్తుత సరఫరాదారుఅమృతాంజన్ హెల్త్‌కేర్

పేరు మార్చు

అమృతాంజం పేరు అమృతం + అంజనం అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది.

చరిత్ర మార్చు

అమృతాంజనం అనబడే ఈ ఔషధ తైలాన్ని 1893 లో భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్టు అయిన కాశీనాథుని నాగేశ్వరరావు కనుగొన్నారు.[2] ఈ ఔషధంతో ఆయన ప్రసిద్ధి చెందాడు. ఆయన సంగీత కచేరీలలో ఉచితంగా సరఫరా చేసేవారు. ప్రస్తుతం కూడా ఈ ఔషధం ప్రసిద్ధి పొందినది. అమృతాంజన్ లిమిటెడ్ గా 1936 లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకొన్నది.[3]

వైద్యంలో ఉపయోగాలు మార్చు

ఈ ఔషధాన్ని తలనొప్పికి ఎక్కువగా వాడుతారు.

హోల్డింగ్ కంపెనీ మార్చు

ఈ ఉత్పత్తి అమృతాంజన్ హెల్త్‌కేర్కు చెందినది. ఇది ప్రస్తుతం శంభుప్రసాద్ (కాశీనాధుని నాగేశ్వరరావు గారి మనుమడు) చే నిర్వహింపబడుతున్నది.

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు