తలనొప్పి అనేది తల లేదా మెడ ప్రాంతంలో ఎక్కడో చోట ఉండే నొప్పి. ఇది తల, మెడ యొక్క వివిధ పరిస్థితుల యొక్క ఒక రోగలక్షణం అయ్యుండవచ్చు. పైగా ఈ నొప్పి మెదడు చుట్టూ పెయిన్-సెన్సిటివ్ నిర్మాణాల యొక్క కలతకు కారణమవుతుంది. తల, మెడ యొక్క తొమ్మిది ప్రాంతాలు పెయిన్-సెన్సిటివ్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి, ఇవి క్రానియం (పుర్రె యొక్క అస్థి కవచము), కండరాలు, నాడులు, ధమనులు, సిరలు, చర్మాంతర్గత కణజాలం, కళ్ళు, చెవులు, నాసికా కుహరములు, మ్యూకస్‌ త్వచాలు. తలనొప్పి విషయంలో వివిధ వర్గీకరణ వ్యవస్థలు ఉన్నాయి. బాగా గుర్తింపు పొందినది అంతర్జాతీయ తలనొప్పి సొసైటీ. తలనొప్పి అనేది ఒక నిర్దిష్ట రోగలక్షణం కాదు, అంటే దీనర్ధం అనేక ఇతర కారణాలు ఉంటాయి. తలనొప్పి చికిత్స ఆధార కారణం పై ఆధారపడి ఉంటుంది, కానీ సాధారణంగా నొప్పి నివారణలు ఉంటాయి.

తలనొప్పి
SpecialtyNeurology Edit this on Wikidata

కారణాలు సవరించు

తలనొప్పులలో 200 పైగా రకాలున్నాయి. కొన్ని హానిచేయనివి, కొన్ని ప్రాణహానిని కలిగించేవి. నాడీ సంబంధ పరీక్ష ద్వారా తలనొప్పి గురించి, కనుగొన్నవి వివరించబడతాయి, అలాగే అదనపు పరీక్షలు అవసరమో లేదో, ఏది ఉత్తమ చికిత్సో నిర్ణయించబడుతుంది.

  • అలసట, శారీరకంగా గానీ ,మానసికంగా గానీ కలిగే ఒత్తిడి
  • నిద్రలేమి
  • అతినిద్ర
  • ఎక్కువగా ఏడవటం ,వేదన చెందడం
  • కంప్యూటర్ల ముందూ,ఆఫీసులోనూ,పని చేసే చోట ఒకె పొజిషన్లో ఎక్కువ సేపు కూచోవడం వలన కండరాలు పట్టేయడం.
  • డీహైడ్రేషన్
  • మలబధ్ధకం

పార్శ్వపు తలనొప్పి సవరించు

పార్శ్వపు తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పి చాలావరకు తలకు ఒక పక్క వస్తుంది. ఇది స్త్రీలలో అధికంగా వస్తుంది. వాంతులూ ఉండవచ్చు. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల ఈ నొప్పి వస్తుంది. చాలామంది పార్శ్వనొప్ప తలలో ఒకవైపే వస్తుందని భావిస్తుంటారు. కానీ కొన్నిసార్లు రెండు వైపులా కూడా రావచ్చు. ఈ రకం తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తలలో కొట్టుకుంటున్నట్లుగా.. వస్తూ పోతున్నట్లుగా.. తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావు. వాంతులు అవ్వినాక రిలాక్స్ అనిపిస్తుంది . ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ ఎక్కువైనా.. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ఈ రకం తలనొప్పి రావచ్చు. వాస్తవానికి ఇవన్నీ పార్శ్వనొప్పిని ప్రేరేపించేవేగానీ.. పార్శ్వనొప్పికి మూలకారణాలు కావు. పార్శ్వనొప్పి జన్యుపరమైన సమస్య. వంశంలో ఎవరికైనా ఉంటే మనకూ రావచ్చు. పురుషుల్లోనూ ఉండొచ్చుగానీ ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ. ఈ పార్శ్వనొప్పిని శాశ్వతంగా తగ్గించే మందేదీ లేదు. కాకపోతే దీన్ని తగ్గించి, నియంత్రించేందుకు మంచి చికిత్సలున్నాయి. ఇలా నియంత్రణలో ఉంచితే కొన్నాళ్లకు దానంతట అదే పోతుంది. కానీ మళ్లీ కొంతకాలం తర్వాత రావచ్చు.

తలనొప్పి ఉపశమనం కోసం ఆండ్రాయిడ్ యాప్ సవరించు

తలనొప్పి ట్రీట్ మెంట్ కోసం కొత్త మార్గాన్ని అన్వేషించిన శాస్త్రవేత్తలు కొత్త యాప్ను అభివృద్ధి చేశారు. తలనొప్పి కారణంగా ఎంత మొత్తంలో బాధను రికార్డు చేయడానికి యాప్ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ హెల్త్ ఇనిస్టిట్యూట్ బిహేవియరల్ బేసిస్ ఆఫ్ హెల్త్ ప్రోగ్రామ్ అనే సంస్థకు సంబంధించిన ప్రొఫెసర్ పాల్ మార్టిన్ అధ్యయనంలో భాగంగా యాప్ వాడినట్టు తెలిసింది.

తలనొప్పితో బాధపడేవారు ఉపశమనం పొందేందుకు లర్నింగ్ టు కోప్ విత్ ట్రిగ్గర్స్ (ఎల్ సీటీ) అనే విధానాన్ని మార్టిన్ డిజైన్ చేశారు. ఎల్ సీటీ తోపాటు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ విధానాన్ని ఉపయోగించినట్టు వెల్లడించారు. అలసట, శబ్ద కాలుష్యం, కలుషిత ఆహార పదార్థాల కారణంగా వచ్చే తలనొప్పి తీవ్రతను రికార్డు చేసి ఎలక్ట్రానిక్ హెడెక్ డైరీలో డేటాను నిక్షిప్తం చేస్తుందని శాస్త్రజ్క్షులు తెలిపారు. రోజువారి తలనొప్పి తీవ్రత రేటింగ్ ఆధారంగా బాధను అరికట్టేందుకు చికిత్సను డిజైన్ చేసే అవకాశం ఉంటుందన్నారు.[1]

తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు సవరించు

తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. తలనొప్పి రావడానికి చాలా కారణాలున్నాయి. రక్తపోటు వల్ల మెదడులో కణతుల వల్ల, రక్తనాళాలలో రక్తప్రసరణలో మార్పుల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, నిద్రలేమి వల్ల వచ్చే అవకాశం ఉంది. మగవారిలో రక్తపోటు, మానసిక ఒత్తిడి, మెదడులోని కణుతుల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి స్త్రీలలో అధికంగా చూస్తుంటాం. ఈ తలనొప్పి చాలావరకు తలకు ఒక పక్క భాగంలో వస్తుంది. వాంతులతో కూడిన తలనొప్పి ఉంటుంది. మైగ్రేన్ రావడానికి తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల వస్తుంది.

బయటి లంకెలు సవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-10. Retrieved 2014-09-11.
"https://te.wikipedia.org/w/index.php?title=తలనొప్పి&oldid=3788408" నుండి వెలికితీశారు