అమెథిస్ట్
అమెథిస్ట్ లేదా గరుడపచ్చ అనేది స్పటికం యొక్క ఉదా రంగు రకం, తరచుగా దీనిని నగలలో ఉపయోగిస్తారు. దీని పేరు "నిషా కాని" అని అర్థానిచ్చే పురాతన గ్రీకు పదం ἀ a- ("కాని"), μέθυστος méthystos ("నిషా") నుండి వచ్చింది. ఈ రాయి త్రాగుడు నుంచి తన యజమానిని రక్షిస్తుందనే నమ్మకానికి ఒక సూచన. పురాతన గ్రీకులు అమెథిస్ట్ ను ధరించారు, ఇవి నిషాను నిరోధిస్తుందనే విశ్వాసంతో త్రాగుడు పాత్రలకు అలంకరించబడినవి. ఇది స్పటికం యొక్క అనేక రూపాలలో ఒకటి. అమెథిస్ట్ ఒక పాక్షిక విలువ గల రాయి, సంప్రదాయకంగా ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి జన్మరత్నం.
Amethyst | |
---|---|
Amethyst cluster from Magaliesburg, South Africa. |
|
సాధారణ సమాచారం | |
వర్గము | oxide mineral |
రసాయన ఫార్ములా | Silica (silicon dioxide, SiO2) |
ధృవీకరణ | |
రంగు | Purple, violet |
స్ఫటిక ఆకృతి | 6-sided prism ending in 6-sided pyramid (typical) |
స్ఫటిక వ్యవస్థ | rhombohedral class 32 |
Twinning | Dauphine law, Brazil law, and Japan law |
చీలిక | None |
ఫ్రాక్చర్ | Conchoidal |
మోహ్స్ స్కేల్ కఠినత్వం | 7–lower in impure varieties |
ద్యుతి గుణం | Vitreous/glossy |
వక్రీభవన గుణకం | nω = 1.543–1.553 nε = 1.552–1.554 |
దృశా ధర్మములు | Uniaxial (+) |
బైర్‌ఫ్రింజెన్స్ | +0.009 (B-G interval) |
Pleochroism | None |
కాంతికిరణం | White |
విశిష్ట గురుత్వం | 2.65 constant; variable in impure varieties |
ద్రవీభవన స్థానం | 1650±75 °C |
Solubility | insoluble in common solvents |
ప్రకాశపారగమ్యత | Transparent to translucent |
ఇతర గుణాలు | Piezoelectric |
చిత్రమాలిక
మార్చు-
అనేకముఖముల అమెథిస్ట్
-
ఎమెరాల్ద్ కట్ అమెథిస్ట్