అమెరికా అధ్యక్ష ఎన్నికలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆ దేశపు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు జరిగే పరోక్ష ఎన్నికలు. ఈ ఎన్నికల్లో అమెరికాలోని 50 రాష్ట్రాల్లో, వాషింగ్టన్, డి.సి.ల్లో ఎక్కడైనా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారు ప్రత్యక్షంగా కాకుండా ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఎలక్టర్స్ ఎలక్టోరల్ ఓట్ల ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ వోట్లలో పూర్తి మెజారిటీ సాధించిన వారు (ప్రస్తుతం 538 కి గాను 270) ఆఫీసుకు ఎన్నికవుతారు. ఏ అభ్యర్థి మెజారిటీ సాధించకపోతే హౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అలాగే ఉపాధ్యక్ష పదవికి కూడా ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోతే సెనేట్ సభ్యులు ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తారు.
చరిత్ర
మార్చుఎలక్టోరల్ కాలేజ్
మార్చుఅమెరికా రాజ్యాంగంలోని రెండవ అధికరణం మొదటగా ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో పాటుగా, అధ్యక్ష ఎన్నికల పద్ధతిని ఏర్పాటు చేసింది. రాజ్యాంగ నిర్మాతలు అధ్యక్షుడిని కాంగ్రెస్ ఎన్నుకోవాలని కోరుకున్నారు. ఇంకొంతమంది ప్రజా ఓటు ద్వారా ఎన్నుకోవాలని అన్నారు. ఆ రెండింటి మధ్యే మార్గమే ప్రస్తుత పద్ధతి.[1]
రాజకీయ పార్టీలు
మార్చుఅమెరికా రాజ్యాంగంలో తొలుత రాజకీయ పార్టీలకు స్థానం లేదు. ఎందుకంటే ఆ దేశపు రాజ్యాంగ నిర్మాతలకు పార్టీలు ప్రజలను వివిధ వర్గాలగా విడగొట్టడం ఇష్టం లేదు. ఆ దేశపు మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. తర్వాత 1796 లో వాషింగ్టన్ వారసుడు జాన్ ఆడమ్స్ ఎన్నుకునే సమయంలో అమెరికాలో రెండు పార్టీల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచీ విజేతలు ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీకి చెందిన వారే ఎన్నికవుతూ ఉన్నారు.[2][3] 1860 లో ఒకసారి, 1912 లో ఒకసారి మాత్రమే తృతీయ పక్షాలు మెజారిటీ సాధించాయి.
మూలాలు
మార్చు- ↑ Bugh, Gary (2010). Electoral College Reform: Challenges and Possibilities. Ashgate Publishing, Ltd. p. 40. ISBN 978-0-7546-7751-2. Archived from the original on October 3, 2021. Retrieved November 21, 2015.
- ↑ Richard Hofstadter, The Idea of a Party System: The Rise of Legitimate Opposition in the United States, 1780–1840 (1970)
- ↑ Gordon S. Wood, Empire of Liberty: A History of the Early Republic, 1789–1815 (Oxford History of the United States)