అమెరికా అల్లుడు

అమెరికా అల్లుడు 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, భానుప్రియ, కాంతారావు నటించారు. కె. చక్రవర్తి సంగీతం అందించాడు. చికాగో ఫిలింస్ పతాకంపై వేమూరి రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

అమెరికా అల్లుడు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
తారాగణం సుమన్,
భానుప్రియ ,
కాంతారావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ చికాగో ఫిల్మ్స్
భాష తెలుగు

అమెరికా అల్లుడు అనేది కుటుంబ ఆధారిత చిత్రం. ఇందులో చికాగోలో గుర్తింపు పొందిన డాక్టర్ డాక్టర్ రాజు (సుమన్) పల్లెటూరుకి చెందిన తన మరదలు రాధా (భానుప్రియ) ను వివాహం చేసుకున్నాడు.

వివాహం తర్వాత వారు యుఎస్‌ఎకు వచ్చినప్పుడు, రాధా మొదట్లో పాశ్చాత్య దేశాల కొత్త జీవనశైలికి సర్దుబాటు చేయలేకపోతుంది. అమాయకత్వం, అజ్ఞానం కారణంగా తలెత్తిన తప్పులతో రాజును తరచూ చికాకు పడతాడు.

ఆమె చేసిన పొరపాటు వల్ల, ఆసుపత్రిలో రాజు రోగులలో ఒకరు చనిపోతారు. కలత చెందిన రాజు రాధను విడిచిపెట్టాడు. రాధ వదలిపెట్టిన భార్యగా భారతదేశానికి వెళ్లడం ఇష్టం లేక యుఎస్ఎలో కొనసాగాలని నిర్ణయించుకుంటుంది.

ఆమె తన కాళ్ళ మీద నిలబడి తన బిడ్డను ఎలా చూసుకుంటుంది? చివరికి రాజు హృదయాన్ని ఎలా గెలుచుకుంటుంది? అనేది హృదయపూర్వక పద్ధతిలో ఈ సినిమా నిర్మించబడింది.[1]

నటవర్గం

మార్చు
 
వేల్చేరు నారాయణరావు

సాంకేతికవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

1:నా వాలుజడ కృష్ణవేణి , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం.

2: ఓ కూనలమ్మ , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం.పి.సుశీల

3:గోమాత మాయమ్మ, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. పి. సుశీల

మూలాలు

మార్చు
  1. "America Alludu (1985) (1985) | America Alludu (1985) Movie | America Alludu (1985) Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-10.

బాహ్య లంకెలు

మార్చు