తాడేపల్లి లక్ష్మీ కాంతారావు
కాంతారావుగా ప్రసిద్ధి పొందిన తాడేపల్లి లక్ష్మీ కాంతారావు (1923 నవంబర్ 16- 2009 మార్చి 22) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత.[1]
తాడేపల్లి లక్ష్మీకాంతా రావు | |
---|---|
![]() తాడేపల్లి లక్ష్మీ కాంతారావు | |
జననం | తాడేపల్లి లక్ష్మీకాంతా రావు 1923 నవంబరు 16 |
మరణం | 2009 మార్చి 22 | (వయస్సు 85)
మరణ కారణం | క్యాన్సర్ |
ఇతర పేర్లు | నట ప్రపూర్ణ, కత్తుల కాంతారావు, ఆంధ్రా ఎం.జి.ఆర్ |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1950 - 1990 |
జీవిత భాగస్వామి | సుశీల, హైమవతి |
పిల్లలు | ప్రతాప్, కేశవ, సుశీల, రాజా, సత్యం |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | రఘుపతి వెంకయ్య అవార్డు, రాష్ట్రపతి అవార్డు, నంది అవార్డు |
జననంసవరించు
కాంతారావు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామములో జన్మించాడు[2].
సినీ ప్రస్థానంసవరించు
తెలుగు సినిమాల్లో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు [3]. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఆయన స్వీయ చరిత్ర "అనగనగా ఒక రాకుమారుడు". ఆయన మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు మాటల్లో "తెలుగు చలనచిత్ర సీమకు రామారావు, నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు".
కాంతారావు కుమారుడు రాజా, సుడిగుండాలు సినిమాలో నటించారు. ఆ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.
చిత్ర సమాహారంసవరించు
నటుడిగాసవరించు
నిర్మాతగాసవరించు
- సప్తస్వరాలు (1969)
- గండర గండడు (1969)
- ప్రేమ జీవులు (1971)
- గుండెలు తీసిన మొనగాడు (1974)
- స్వాతి చినుకులు (1989)
మరణంసవరించు
కాంతారావు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాదులోని యశోద హాస్పిటల్లో రాత్రి గం 9.50 ని.లకు కన్నుమూశారు.
మూలాలుసవరించు
- ↑ Sakshi (19 February 2020). "కత్తిలా బతికి వెళ్లిపోయారు..." Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help) - ↑ http://ntippi.tripod.com/tollywood/legends/kantharao.html
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009