అమ్మాయిలంతే అదో టైపు

అమ్మాయిలంతే అదో టైపు 2017లో విడుదలైన తెలుగు సినిమా. గాయ‌త్రి రీల్స్ బ్యాన‌ర్‌పై వై.వి.ఎస్‌.ఎస్‌.ఆర్‌.కృష్ణంరాజు నిర్మించిన ఈ సినిమాకు కృష్ణమ్‌ దర్శకత్వం వహించాడు.[1] గోపీ వర్మ, మాళవికా మీనన్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2017 నవంబర్ 17న విడుదలైంది.[2]

అమ్మాయిలంతే అదో టైపు
దర్శకత్వంకృష్ణమ్‌
రచనకృష్ణమ్‌
నిర్మాతవై.వి.ఎస్‌.ఎస్‌.ఆర్‌.కృష్ణంరాజు
తారాగణంగోపీ వర్మ
మాళవిక మీనన్
శివాజీ రాజా
ఛాయాగ్రహణంశ్రీనివాస్‌
కూర్పుగోపీ సిందం
సంగీతంరాక్ స్టార్
నిర్మాణ
సంస్థ
గాయ‌త్రి రీల్స్
విడుదల తేదీ
17 నవంబరు 2017 (2017-11-17)
దేశం భారతదేశం
భాషతెలుగు

డబ్బున్న కుటుంబంలో పుట్టిన మాళవికా మీనన్, గోపీ వర్మ ఆటో డ్రైవర్‌ ని ప్రేమించి, తన తండ్రి శివాజీ రాజా గౌరవం కంటే తన ప్రేమే ముఖ్యమనుకొని తండ్రికి తెలియకుండా అతన్ని తీసుకొని హైదరాబాద్ కి వెళ్తుంది. ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల తండ్రి ప్రేమకి దూరమవుతుంది. ఆ తర్వాత ఎటువంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి? ఆ తరువాత జరిగే పర్యవసానలు ఏమిటి? తండ్రికి దగ్గరయిందా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: గాయ‌త్రి రీల్స్
  • నిర్మాత: వై.వి.ఎస్‌.ఎస్‌.ఆర్‌.కృష్ణంరాజు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణమ్‌
  • సంగీతం: రాక్ స్టార్
  • సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్‌
  • ఎడిటర్: గోపీ సిందం
  • పాటలు: పూర్ణాచారి

మూలాలు

మార్చు
  1. Andhra Bhoomi (24 September 2017). "అమ్మాయిలంతే...అదో టైపు". www.a.net. Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  2. The Times of India (2017). "Ammailu Anthe Ado Type Movie". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  3. Sakshi (18 September 2017). "తొందరపాటు నిర్ణయం". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  4. Zee Cinimalu (18 November 2017). "శివాజీ రాజా లీడ్ రోల్ లో `అమ్మాయిలంతే..అదో టైపు`" (in ఇంగ్లీష్). Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.