అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా

అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మ అంటూ సాగే పాట అనువాద చిత్రం రఘువరన్ బి.టెక్. సినిమాలోనిది. తెలుగులో పాటని సినీగేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రచించగా, సంగీత దర్శకత్వాన్ని అనురుధ్ రవిచందర్ వహించారు. హీరో తల్లి అతని తప్పిదం వల్ల చనిపోయిన సందర్భంలో వచ్చే ఈ పాట తల్లి విలువను తెలియజెప్పే సాహిత్యంతో ఉన్నది.[1]

"అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా"
సంగీతంఅనిరుధ్ రవిచందర్
సాహిత్యంరామజోగయ్య శాస్త్రి
ప్రచురణ2015
భాషతెలుగు
రూపంసినిమా పాట, అనువాద గీతం
గాయకుడు/గాయనిదీపు, ఎస్.జానకి
చిత్రంలో ప్రదర్శించినవారుధనుష్, శరణ్య పొన్వణ్ణన్

నేపథ్యంసవరించు

రఘువరన్ బి.టెక్. సినిమాలోని ఈ గీతం తల్లి మరణం నేపథ్యంలో వస్తుంది. సినిమాలో కథానాయకుడు రఘువరన్ సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటాడు. వేరే రంగాల్లో ఎన్ని అవకాశాలు వచ్చినా తను చదివిన సివిల్ ఇంజనీరింగ్ లోనే పనిచేయాలన్న పట్టుదలతో నిరుద్యోగ జీవితం గడుపుతూంటాడు. ఐతే అతని తండ్రి ఎప్పుడూ ఉద్యోగం లేదని తిడుతూండగా తల్లితో గాఢమైన అనుబంధం ఉంటుంది. ఒకసారి తండ్రికీ, రఘువరన్ కీ గొడవ జరిగినప్పుడు తల్లి రఘువరన్ ని కొడుతుంది. తనను కొట్టిందన్న బాధలో తర్వాతిరోజు తల్లి ఫోన్ ఎత్తడు. ఆ సమయంలోనే ఆమె గుండెనొప్పితో చనిపోతుంది. తనవల్లే ఆమె మృత్యువుపాలయిందన్న బాధలో హీరో ఉండగా ఈ గీతం వస్తుంది.

మూలాలుసవరించు

  1. సాక్షి ఫ్యామిలీ, ప్రతినిధి (10 May 2015). "అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా". సాక్షి ఫ్యామిలీ.