అమ్మోనియం థయోసైనేట్

అమ్మోనియం థయోసైనేట్ అనేది ఒక అకర్బన సమ్మేళనం. దీని రసాయనిక ఫార్ములా NH4SCN. ఇది అమ్మోనియం కేటయాన్, థయో సైనేట్ అయానల సంయోగం వలన ఏర్పడిన లవణం

అమ్మోనియం థయోసైనేట్
Space-filling model of the ammonium cation
Space-filling model of the ammonium cation
Space-filling model of the thiocyanate anion
Space-filling model of the thiocyanate anion
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [1762-95-4]
పబ్ కెమ్ 15666
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:30465
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య XN6465000
SMILES [S-]C#N.[NH4+]
ధర్మములు
NH4SCN
మోలార్ ద్రవ్యరాశి 76.122 గ్రాం/మోల్
స్వరూపం రంగులేదు, ఆర్ద్రతాకర్షక స్పటికాకృతి ఘనరూపం
సాంద్రత 1.305 గ్రాం/సెం.మీ3
ద్రవీభవన స్థానం 149.5 °C (301.1 °F; 422.6 K)
బాష్పీభవన స్థానం 170 °C (338 °F; 443 K) (decomposes)
128 గ్రాం/100 మి.లీ (0 °C)
ద్రావణీయత ద్రవఅమ్మోనియా, ఆల్కహాలు, ఎసిటోన్ లలో కరుగును
అయస్కాంత ససెప్టిబిలిటి -48.1·10−6 cm3/mol
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము External MSDS
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

తయారు చెయ్యడం

మార్చు

కార్బన్ డైసల్ఫైడ్‌ను సజల అమ్మోనియాతో రసాయనిక చర్య జరపడం వలన అమ్మోనియం థయోసైనేట్ ఉత్పత్తి అగును.కార్బన్ డైసల్ఫైడ్‌ను సజల అమ్మోనియాతో రసాయనిక చర్య జరపడం వలన మొదట అమ్మోనియం డైథైయో కార్బోనేట్ అనే మధ్యస్థ రసాయన పదార్థం ఏర్పడును.ఇలా ఏర్పడిన అమ్మోనియం డైథైయో కార్బోనేట్ ను వేడి చెసిన అది అమ్మోనియం థయోసైనేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ గా వియోగం చెందును.

CS2 + 2 NH3(aq) → NH2C(=S)SNH4 → NH4SCN + H2S

భౌతిక లక్షణాలు

మార్చు

రంగులేని, తేమను ఆకర్షించే గుణమున్న స్పటిక లక్షణాలున్న ఘనపదార్థం.[1] మోలారు అణూభారం 76.122 గ్రాములు/మోల్.[2]

సాంద్రత

మార్చు

అమ్మోనియం థయోసైనేట్ యొక్క సాంద్రత 1.305 గ్రాములు/సెం.మీ3[3]

ద్రవీభవన స్థానం

మార్చు

అమ్మోనియం థయోసైనేట్ సంయోగ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 149.5 °C (301.1 °F; 422.6 K) [4]

బాష్పీభవన ఉష్ణోగ్రత

మార్చు

అమ్మోనియం థయోసైనేట్ బాష్పీభవన ఉష్ణోగ్రత లేదా స్థానం 170 °C (338 °F; 443 K), ఈ ఉష్ణోగ్రత వద్ద ఈ రసాయన సంయోగ పదార్థం వియోగం చెందును.

ద్రావణీయత

మార్చు

నీటిలో కొంతమేరకు కరుగును.100 మి.లీ నీటిలో128 గ్రాములు కరుగును.అలాగే ద్రవ అమ్మోనియా, ఆల్కహాలు,, ఎసిటోన్^లలో కరుగును.[5]

రసాయన చర్యలు

మార్చు

అమ్మోనియం థయోసైనేట్ గాలిలో స్థిరంగావుంటుంది.కాని వేడి చేసినపుడు థయో యూరియాగా ఇసోమెసన్ చెందును.

 

ఉపయోగాలు

మార్చు
  • అమ్మోనియం థయోసైనేట్ ను గుల్మనాశిని (herbicide) గా ఉపయోగిస్తారు.
  • థయోయూరియా చేయుటకు ఉపయోగిస్తారు.
  • అగ్గిపెట్టెల మందులో పారదర్శక రెసిన్ (బంకవంటి) తయారికి వాడెదరు.
  • పోటోగ్రఫిలో స్టబిలైజింగు ఏజెంట్ గా వాడెదరు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "AMMONIUM THIOCYANATE". cameochemicals.noaa.gov. Retrieved 2018-07-19.
  2. "Ammonium thiocyanate". sigmaaldrich.com. Retrieved 2018-07-19.
  3. "Ammonium thiocyanate Properties". chemicalbook.com. Retrieved 2018-07-19.
  4. "Melting Point". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2018-07-19.
  5. "Ammonium thiocyanate". chemspider.com. Retrieved 2018-07-19.