అమ్మోనియం బైకార్బొనేట్
అమ్మోనియం బైకార్బోనేట్ ఒక రసాయన సమ్మేళన పదార్థం.IUPAC ప్రకారం దీనిని అమ్మోనియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు.అంతియే కాకుండా బైకార్బోనేట్ ఆఫ్ అమ్మోనియాఅనికూడా వ్యవహరిస్తారు.
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
Ammonium hydrogen carbonate
| |||
ఇతర పేర్లు
Bicarbonate of ammonia, ammonium hydrogen carbonate, hartshorn, AmBic, powdered baking ammonia
| |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [1066-33-7] | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | BO8600000 | ||
SMILES | [O-]C(=O)O.[NH4+] | ||
| |||
ధర్మములు | |||
NH5CO3 | |||
మోలార్ ద్రవ్యరాశి | 79.056 g/mol | ||
సాంద్రత | 1.586 g/cm3 | ||
ద్రవీభవన స్థానం | 41.9 °C (107.4 °F; 315.0 K) decomposes | ||
11.9 g/100 mL (0 °C) 21.6 g/100 mL (20 °C) 36.6 g/100 mL (40 °C) | |||
ద్రావణీయత | insoluble in methanol | ||
ప్రమాదాలు | |||
ప్రధానమైన ప్రమాదాలు | Decomposes to release ammonia | ||
భద్రత సమాచార పత్రము | ICSC 1333 | ||
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | [1] | ||
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H302[1] | ||
GHS precautionary statements | none[1] | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
ఇతరఅయాన్లు | {{{value}}} | ||
ఇతర కాటయాన్లు
|
Sodium bicarbonate Potassium bicarbonate | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
భౌతిక ధర్మాలు
మార్చురంగులేని /వర్ణ రహిత ఘన పదార్థం. రసాయనికంగా ఇది అమ్మోనియం యొక్క బైకార్బోనేట్ లవణం. ఇది కార్బన్ డై ఆక్సైడ్/బొగ్గుపులుసు వాయువు, నీరు, అమ్మోనియాగా వియోగం పొందును. ఈ సమ్మేళం రసాయనిక ఫార్ములా (NH4) HCO3లేదా NH5CO3. అణుభారం 79.056 గ్రాములు/మోల్. సాంద్రత 1.586 గ్రాములు/సెం.మీ3. ద్రవీభవన ఉష్ణోగ్రత 41.9 °C, ఈ ఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం బైకార్బోనేట్ రసాయనిక వియోగం చెందును. నీటిలోదారాళంగా కరుగుతుంది. నీటి యొక్క ఉష్ణోగ్రత పెరిగే కొలది, అమ్మోనియం బై కార్బోనేట్ యొక్క నీటిలో కరుగుదల శాతం పెరుగుతుంది.
0 °C నీటి ఉష్ణోగ్రత వద్ద, 100 మీ.లీ.నీటిలో 11.9 గ్రాములు కరుగగా, 20 °C వద్ద 21.6 గ్రాములు, 40 °C వద్ద 36.6 గ్రాములు నీటిలో కరుగును. మిథనాల్ లో ఈ ఈసమ్మేళనం కరుగదు.
ఉత్పత్తి
మార్చుకార్బండై ఆక్సైడ్ ను, అమ్మోనియాను సంయోగం చెందించి అమ్మోనియం బైకార్బోనేట్ ను ఉత్పత్తి చెయ్యుదురు.
- CO2 + NH3 + H2O → (NH4)HCO3
అధిక ఉష్ణం వద్ద అమ్మోనియం బై కార్బోనేట్ అస్థిరమైనది, అస్థిరమైనది కావున అమ్మోనియా, కార్బన్ డైఆక్సైడ్‌లసంయోగ చర్యసమయంలో ద్రవం తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉండేలా చూడాలి. రసాయన చర్యానంతరం తెల్లనిఘన అవక్షేపముగా అమ్మోనియం బై కార్బోనేట్ ద్రవంలో ఏర్పడుతుంది. 1997 లో 100,000 టన్నుల అమ్మోనియం బై కార్బోనేట్ ను పైన పేర్కొన్న పద్ధతిలో ఉత్పత్తి చేసారు.
అమ్మోనియా వాయువును గాఢత కలిగిన సెసిక్యుకార్బోనేట్ జల ద్రావణం (2:1:1నిష్పత్తిలో (NH4) HCO3, (NH4)2CO3,, H2O కలిగిన జల ద్రావణం) లోకి పంపడం వలన దానిని సాధారణా అమ్మోనియం కార్బోనేట్ ( (NH4)2CO3) గా మార్చుతుంది.30°Cద్రావణ ఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం కార్బోనేట్ స్పటిక స్థితిలో ఏర్పడుతుంది. ఏర్పడిన అమ్మోనియం కార్బోనేట్‌కు గాలి తగిలే లాచేయ్యడం వలన, అధికంగా ఇన్న అమ్మోనియాను కోల్పోయి అమ్మోనియం బై కార్బోనేట్ గా పరివర్తన చెందుతుంది.
రసాయన చర్యలు
మార్చుఅమ్మోనియం బై కార్బోనేట్ నీటిలో కరుగు తుంది, నీటిలో కరగడం వలన క్షార ద్రవాన్ని ఏర్పరచును. ఇది ఎసిటోన్, ఆల్కహాల్ లలో కరుగదు. 36°Cకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం బై కార్బోనేట్ అమ్మోనియా, బొగ్గుపులుసు వాయువు, నీరుగా వియోగం చెందును. వియోగ చర్య ఉష్ణ గ్రహాక (endothermic) ప్రక్రియ కావటం వలన నీటి యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది.
- NH4HCO3 → NH3 + H2O + CO2.
ఆమ్లాలతో చర్య ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్/బొగ్గుపులుసు వాయువు ఉత్పత్తిఅగును.
- NH4HCO3 + HCl → NH4Cl + CO2 + H2O.
క్షారాలతో చర్యా ఫలితంగా అమ్మోనియా విడుదల అగును.
అమ్మోనియం బై కార్బోనేట్ పదార్థం, క్షారమృత్తిక లోహాల సల్ఫేట్‌లతో చర్య జరపడం వలన క్షార మృత్తిక లోహాల కార్బోనేట్ లు అవక్షేపగా ఏర్పడును.
- CaSO4 + 2 NH4HCO3 → CaCO3 + (NH4)2SO4 + CO2 + H2O.
క్షారలోహ హలైడులతో అమ్మోనియం బై కార్బోనేట్ చర్యవలన క్షారలోహబై కార్బోనేట్‌లు, అమ్మోనియం హాలైడ్‌లు ఏర్పడును.
- NH4HCO3 + NaCl → NH4Cl + NaHCO3;
- NH4HCO3 + KI → NH4I + KHCO3;
- NH4HCO3 + NaBr → NH4Br + NaHCO3
ఉపయోగాలు
మార్చుఆహార పదార్థాలను ఉత్పత్తి చెయ్యు పరిశ్రమలలో అమ్మోనియం బై కార్బోనేట్ నువుద్ధారణకారకంగాఉపయోగిస్తారు.కొన్నిరకాలవంటలలో (కేకులు), టపాసులలోఉపయోగిస్తారు.బేకింగు పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
రక్షణ-భద్రత
మార్చుఅమ్మోనియం బై కార్బోనేట్ చర్మం, కళ్ళు,, శ్వాసమండలము పై ప్రకోపనకారి/తాపజనక లక్షణాలను చూపును. అమ్మోనియం బై కార్బోనేట్ ప్రభావానికి గురైన వెంటనే లేదా కొంత సమయం తరువాత స్వల్ప కాలిక అనారోగ్యం పొందే అవకాశం ఉంది. అమ్మోనియం బై కార్బోనేట్ ధూళిని పీల్చిన ముక్కుకు, గొంతుకు ఉపిరితిత్తులకు మంటను నొప్పినికలిగించును. చీకాకుకలుగును., దగ్గు వచ్చును. తాత్కాలికంగా ఉపిరి పీల్చడం ఇబ్బందిగా ఉండును.
పలుమార్లు అమ్మోనియం బై కార్బోనేట్ ప్రభావానికి లోనైనా శ్వాసనాల జబ్బుగా మారి దగ్గు వచ్చును.