అమ్మోనియం సల్ఫైడ్

అమ్మోనియం సల్ఫైడ్ (Ammonium sulfide) ఒకరసాయనిక సంయోగ పదార్థం.ఈ సమ్మేళనపదార్థాన్ని డై అమ్మోనియం సల్ఫైడ్ అనికూడా అంటారు.

అమ్మోనియం సల్ఫైడ్
పేర్లు
IUPAC నామము
అమ్మోనియం సల్ఫైడ్
ఇతర పేర్లు
డైఅమ్మోనియం సల్ఫైడ్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [12135-76-1]
పబ్ కెమ్ 25519
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య BS4900000
SMILES [S-2].[NH4+].[NH4+]
ధర్మములు
(NH4)2S
మోలార్ ద్రవ్యరాశి 68.154 g/mol
స్వరూపం yellow crystals (> −18 °C)[1]
hygroscopic
సాంద్రత 0.997 g/cm3
ద్రవీభవన స్థానం decomposes at ambient temperatures
128.1 g/100 mL
ద్రావణీయత soluble in alcohol
very soluble in liquid ammonia
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు మూస:R31, R34, R50
S-పదబంధాలు (S1/2), S26, S45, S61
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Sodium sulfide
Potassium sulfide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక లక్షణాలు

మార్చు

అమ్మోనియం సల్ఫైడ్ పసుపురంగు స్పటికాలుగా ఏర్పడి ఉన్న ఘనపదార్థం.ఇది అస్థిరమైన లవణం. ఈ సమ్మేళనంయొక్క రసాయన ఫార్ములా (NH4)2S.అమ్మోనియం సల్ఫైడ్ సంయోగ పదార్థంయొక్క అణుభారం 68.154 గ్రాములు/మోల్.[2] అమ్మోనియం సల్ఫైడ్ సంయోగ పదార్థం యొక్క సాంద్రత 0.997 గ్రాములు/సెం.మీ3. సాధారణ వాతావరణ వత్తిడి వద్ద ఈ రసాయన పదార్థం వియోగం చెందును. అమ్మోనియం సల్ఫైడ్ నీటిలో కరుగును.సాధారణ ఉష్ణోగ్రత వద్ద 100 మి.లీ నీటిలో 128.1 గ్రాముల అమ్మోనియం సల్ఫైడ్ కరుగును. ఆల్కహాల్, అమ్మోనియా ద్రావణంలో అమ్మోనియం సల్ఫైడ్ కరుగును.

రసాయన చర్యలు

మార్చు

అమ్మోనియం సల్ఫైడ్ వాతావరణం లోని గాలితో అక్సీకరణ చెందటమం వలన పైరోఫొరిక్ (pyrophoric) గా మార్పు చెందును.అమ్మోనియం సల్ఫైడ్ చెమ్మ/తేమతో ప్రతి చర్యవలన నెమ్మదిగా వియోగం చెంది హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువును విడుదల చేయును. హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు మండే లక్షణాలు కలిగియున్నది. స్వచ్ఛమైన/శుద్ధమైన అమ్మోనియం సల్ఫైడ్‌ను నీటిలో కరగించిన మొదట వేడి విడుదల అగును[3]

ఉపయోగాలు

మార్చు
  • అరుదుగా అమ్మోనియం సల్ఫైడ్‌ను పొటోగ్రాఫిక్ డెవలపింగ్‌లో ఉపయోగిస్తారు.
  • అమ్మోనియం సల్ఫైడ్ ఒక రకమైన దుర్గంధం కలిగి ఉన్నందున దీనినిపరిహాసకృత్యముగా దుర్గందముకల్గించు స్టింక్ బాంబు (stink bomb) ల తయారిలో ఉపయోగిస్తారు.
  • క్షయకరణి కారకంగాఅమ్మోనియం సల్ఫైడ్‌ను ఉపయోగిస్తారు.
  • వస్త్ర తయారీలోఅమ్మోనియం సల్ఫైడ్‌ను ఉపయోగిస్తారు.

రక్షణ/భద్రత

మార్చు

అమ్మోనియం సల్ఫైడ్ ద్రవాణం చర్మాన్ని సోకడం వలన హైడ్రోజన్ సల్ఫైడ్‌ విషవాయువు విడుదల అయ్యి [4] విషప్రభావం కల్గించును.అందుచే ప్రమాదభరితమైనదిగా గుర్తించారు. 30 నిమిషాలకు మించి,500ppm ప్రమాణంలో అమ్మోనియం సల్ఫైడ్ ఆవిరులను పీల్చిన తలనోప్పి, తలతిప్పుడు, చూపు మందగించడం ( dizzines,, శ్వాసకోశ న్యూమొనియాకలిగే అవకాశమున్నది.600ppm కి మించి 30 నిమిషాలు అమ్మోనియం సల్ఫైడ్ ఆవిరుల ప్రభావానికి లోనైన మరణం సంభవించును.జీర్ణ వ్యవస్థలో చేరిన మ్యూకస్ పొరలు, కడుపులో ఇరిటేసన్ కలుగును.కళ్ళకు అమ్మోనియం సల్ఫైడ్ ద్రావణం స్పర్శ వలన కళ్ళు మండును.[3]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Pradyot Patnaik. Handbook of Inorganic Chemicals. McGraw-Hill, 2002, ISBN 0-07-049439-8
  2. "Diammonium Sulfide". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2015-07-28.
  3. 3.0 3.1 "Ammonium sulfide". chemicalbook.com. Retrieved 2015-07-28.
  4. "J. T. Baker: MSDS for Ammonium Sulfide". Archived from the original on 2015-05-06. Retrieved 2015-07-28.