అమ్మోరు తల్లి

అమ్మోరు తల్లి 2020లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో ‘మూకుత్తి అమ్మన్‌’గా విడుదలైన ఈ సినిమాను తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో డబ్బింగ్‌ చేసి విడుదల చేశారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐసరి కె.గణేష్‌ నిర్మించిన ఈ సినిమాకు ఆర్‌.జె.బాలాజీ, ఎన్‌.జె.శరవణన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 14, 2020న డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలైంది.[1] నయనతార, ఆర్‌.జె.బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్‌, మధు, అభినయ, అజయ్‌ ఘోష్‌, తిరునవక్కరసు, మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు.[2]

అమ్మోరు తల్లి
Ammoru Thalli.jpg
దర్శకత్వం
 • ఆర్‌.జె.బాలాజీ
 • ఎన్‌.జె.శరవణన్‌
కథా రచయితఆర్‌.జె.బాలాజీ
నిర్మాతఐసరి కె.గణేష్‌
తారాగణం
ఛాయాగ్రహణందినేష్‌ కృష్ణన్‌.బి
కూర్పుఆర్‌.కె. సెల్వ
సంగీతంగిరీష్‌ గోపాలకృష్ణన్‌
నిర్మాణ
సంస్థ
వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్
పంపిణీదారుడిస్నీ+హాట్‌స్టార్‌
విడుదల తేదీ
2020 నవంబరు 14 (2020-11-14)
సినిమా నిడివి
134 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

కాశీబుగ్గ పట్టణంలో రిపోర్టర్‌గా పని చేస్తున్న ఏంగెల్స్‌ రామస్వామి (ఆర్‌.జె.బాలాజీ) అమ్మ, ముగ్గురు చెల్లెళ్ళతో కలిసి జీవిస్తుంటాడు. రామస్వామి భాద్యతలు చూసి తనకి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు. తమ కష్టాలను తీర్చమని తమ కులదైవమైన మూడు పుడకల అమ్మవారిని ప్రార్థించడానికి వెళ్తే, నిజంగా ప్రత్యక్షమైన అమ్మవారు (నయనతార) వారికి ఎలాంటి వరాలు ఇచ్చింది? ఆ తర్వాత ఆ కుటుంబం ఎలా మారిపోయింది? అసలు అమ్మవారు ఎందుకు ఈ భూమ్మీదకు వచ్చారు? నిజంగా ఆమె అమ్మవారేనా? అనేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులుసవరించు

 • నయనతార
 • ఆర్‌.జె.బాలాజీ
 • ఊర్వశి
 • స్మృతి వెంకట్‌
 • మధు
 • అభినయ
 • అజయ్‌ ఘోష్‌
 • తిరునవక్కరసు
 • మౌళి

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్
 • నిర్మాత: ఐసరి కె.గణేష్‌
 • కథ, స్క్రీన్ ప్లే: ఆర్‌.జె.బాలాజీ & టీమ్‌
 • దర్శకత్వం: ఆర్‌.జె.బాలాజీ, ఎన్‌.జె.శరవణన్‌
 • సంగీతం: గిరీష్‌ గోపాలకృష్ణన్‌
 • మాటలు: కె.ఎన్‌.విజయ్‌కుమార్‌
 • పాటలు: రెహ్మాన్‌
 • సినిమాటోగ్రఫీ: దినేష్‌ కృష్ణన్‌.బి
 • ఎడిటర్‌: సెల్వ ఆర్‌.కె
 • కొరియోగ్రఫీ: దినేష్‌

మూలాలుసవరించు

 1. Prajasakti (26 October 2020). "దీపావళికి 'అమ్మోరు తల్లి'". Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.
 2. Republic World (24 November 2020). "'Ammoru Thalli' 2020 cast: See cast of this 2020 fantasy drama" (in ఇంగ్లీష్). Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.
 3. Eenadu (14 November 2020). "రివ్యూ: అమ్మోరు తల్లి". Archived from the original on 15 నవంబర్ 2020. Retrieved 19 August 2021. Check date values in: |archivedate= (help)
 4. Prajasakti (23 November 2020). "మత రాజకీయాలపై వ్యంగ్యాస్త్రం : అమ్మోరు తల్లి". Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.