అమ్రేలి

గుజరాత్ లోని జిల్లా

రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో అంరేలి జిల్లా (హిందీ: અમરેલી જિલ્લો) ఒకటి. అమ్రేలి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6,760 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,393,918. ఇందులో నగరప్రాంత జనసంఖ్య 22.45% . అమ్రేలి జిల్లా లోని సౌరాష్ట్రా నుండి యు.ఎస్.ఎలో నివసిస్తున్న ఎన్.ఆర్.ఐలు అధికంగా ఉన్నారు.

Amreli District

અમરેલી જિલ્લો
District
Amreli location in Gujarat
Amreli location in Gujarat
Country India
StateGujarat
HeadtownAmreli
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం1,513,614

ప్రముఖులుసవరించు

జిల్లాలో యోగిమహరాజ్, దన్‌బాపు, సన్యాసి ములదాస్, సన్యాసి భొజల్రాంబాపా, సన్యాసి ముక్తానద స్వామి, ఇంద్రజాలికుడు కె.లాల్. జవర్చంద్ మెహగహని (బగసర), డాక్టర్.జీవరాజ్ మెహతా మొదలైనవారు ఉన్నారు. అమ్రేలి జిల్లాలో " గిర్ నేషనల్ ఫారెస్ట్ శాక్చ్యురీ " ఉంది. ప్రస్తుతం ఇది విద్యాకేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుంది.[1]

పేరు వెనుక చరిత్రసవరించు

అంరేలి జిల్లా కేంద్రం అంరేలి పేరుతో జిల్లా ఏర్పాటు చేయబడింది. కి.శ 534 నుండి ఈ జిల్లా ఉనికిలో ఉంది. గతంలో ఇది అనుమాంజీ తరువాత అమరావతి పేర్లతో పిలువబడింది. అంరేలి సంస్కృత నామం అమరవల్లి.

చరిత్రసవరించు

ఆరంభంలో అమరేలి ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంతానికి పురాతన చరిత్ర ఉంది. ఈ ప్రాంతం పలు రాజ్యాలు, సామ్రాజ్యాలలో భాగంగా ఉంది. మరాఠీలు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడిన తరువాత 1780లో ఈ ప్రాతం వరకు తమభూభాగాన్ని విస్తరించారు. ఖతియార్ ద్వీపకల్పం మీద ఇతర పాలకులు పన్నులు విధించడం వలన కథియార్లు తమకు స్వంత రాజ్యం స్థాపించుకుని అమ్రేలీని తమకు రాజధానిని చేసుకున్నారు. ఇందులో ద్వారకా మండలం కూడా అంతర్భాగంగా ఉంది. ఈప్రాంతానికి విఠల్‌రావును దివానుగా (1801-1820 వరకు) చేసారు. తరువాత అంరేలి అభివృద్ధి, సుసంపన్నత అధికం అయింది. విఠల్‌రావు అమ్రేలి సమీపంలో ఉన్న అరణ్యప్రాంతాన్ని వ్యవసాయభూములుగా మార్చాడు. విఠల్‌రావు నాగనాథ్ మహాదేవ్ ఆలయం నిర్మించాడు. 1886లో గైక్వాడ్ పాలనలో అంరేలిలో మొదటి సారిగా ఉచిత, నిర్భంధ విద్యావిధానం అమలుచేయబడింది. 18 శతాబ్దం నుండి 1959 వరకు ద్వారకా, ఒఖమండలం ప్రాంతాలు గైక్వాడ్ - అంరేలి రాజ్యంలో భాగంగా ఉన్నాయి. అయినప్పటికీ 1959లో ఈ రెండు నగరాలు జామ్నగర్ జిల్లాలో కలుపబడ్డాయి. స్వాతంత్ర్యం తరువాత జిల్లా బాంబే రాజ్యంలో భాగంగా మారింది. భరతభూభాల పునర్నిర్మాణం తరువాత ఇది గుజరాత్ రాష్ట్రంలో భాగం అయింది.

ఆర్ధిక రంగంసవరించు

అంరేలి జిల్లా పారిశ్రామిక నేపథ్యం కలిగిన ప్రదేశం. జిల్లా అంతటా ఆయిల్ మిల్లులు విస్తరించి ఉన్నాయి. బగసరా తాలూకాలో వజ్రాలను సానపెట్టే పరిశ్రమలు ఉన్నాయి. సాబర్ కుండ్ల తాలూకా తూకం మిషన్లకు, ఇతర యంత్రాలకు పేరుపొందింది. రజులా, జఫ్రాబాదు తాలూకాలలో చేపల పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. అంరేలిలో 6 " గుజరాత్ ఇండస్ట్రియల్ డెవెలెప్మెంటు కార్పొరేషన్లు " ఉన్నాయి. జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంటు ఉంది. జిల్లాలో 4822 చిన్నతరహా పరిశ్రమలు, 5 మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో పరిశ్రమలకు 4947.35 లక్షలు పెట్టుబడి పెట్టబడింది. ఈ పరిశ్రమలలో 16,640 మంది పనిచేస్తున్నారు. అంరేలి ఆర్థికరంగం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. బగసరా నగరంలో బంగారు కవరింగ్ నగలు, సవరకుండల వజ్రాల తూకం మిషన్ల తయారీ పరిశ్రమ ఉంది. జిల్లాలో పిపావవ్, జఫ్రాబాద్, విక్టర్ పోర్ట్స్ ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయ ఆధారిత యంత్రాలు కూడా జిల్లాలో అధికరిస్తున్నాయి.

ప్రధాన పరిశ్రమలుసవరించు

 • జిల్లాలోని ప్రధాన పరిశ్రమలు ఉన్నాయి:
 • ఆల్ట్రాటెక్ సిమెంట్ కో లిమిటెడ్, కొవయ, తాల్: రాజుల.
 • నర్మదా, కో లిమిటెడ్ తాల్ సిమెంట్. జఫ్రబద్.
 • మెతదిస్త్ కొ.లిమిటెడ్., తాల్ (రజుల)
 • ధరమ్షి మొరార్జీ కెమికల్స్ లిమిటెడ్ జర్, తాల్. ధరి.
 • జి.హె.చ్.సి లిమిటెడ్, తాల్. రాజుల, జఫ్రబద్

విభాగాలుసవరించు

జిల్లాలో 11 తాలూకాలు ఉన్నాయి.

 • అమ్రెలి
 • బగసర
 • వదీ
 • బబ్ర
 • లథి, గుజరత్
 • లిలీ
 • సవర్ కుంద్ల
 • ధరి
 • ఖంభ
 • రజుల
 • జఫరబద్

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,513,614, [2]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 329వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 205 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 8.59%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 964:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 74.49%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

సంస్కృతిసవరించు

అంరేలి జిల్లాలో ప్రముఖ ఆలయాలలో నాగనాథ్ ఆలయం, గాయత్రి ఆలయం, ష్రీనాథ్‌జీ హవేలీ మొదలైన ప్రధాన ఆలయాలు ఉన్నాయి. అంరేలి జిల్లాలో ఇతర పర్యాటక ఆకర్షణలు తులషిష్యాం, ఉన (గుజరాత్), సరకేష్వర్ మహాదేవ్, బలన (జఫరాబాద్), దెల్వాడ, హొలి- ధరన్ నానా విశ్వధర్, ఒకుని - ధర్, హనుమాన్ గడ, సతధర్, గలధర- ఖొదియార్ ఆనకట్ట, కంకై మొదలైన ప్రదేశాలు ఉన్నాయి.

సుప్రసిద్ధ వ్యక్తులుసవరించు

 • కవి కలపి (1874-1900) రచయిత, ఒక ప్రఖ్యాత గుజరాతీ కవి, లాఠీ (గుజరాత్) నివసించారు.
 • డాక్టర్. జివరజ్ మెహతా.గుజరాత్ మొదటి ముఖ్యమంత్రి, స్వస్థలం అమ్రేలి
 • కవి ఝావేర్చంద్ మేఘాని, ఒక ప్రఖ్యాత గుజరాతీ కవి, ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. స్వస్థలం "బగసర" పట్టణం (అమ్రేలి). మహాత్మా గాంధీ నుండి రాష్త్రీయ షాయర్ (జాతీయ కవి) ప్రశంశలు అందుకున్నారు.
 • కవి శ్రీ రమేష్ పరేఖ్, అమ్రేలి చెందిన ప్రముఖ కవి.
 • " దిన పాఠక్ " అమ్రేలిలో జన్మించారు ఈయన ఒక ప్రముఖ నటుడు, గుజరాతీ థియేటర్ డైరెక్టర్, చలనచిత్ర నటుడు, ఉంది.
 • కవి కంత్; స్వస్థలం అమ్రేలి జిల్లాలోని చన్వంద్ గ్రామం
 • ముక్తనంద్ స్వామి (సంస్కృతం: मुक्त्तान्द स्वामी) (1758-1830) స్వామినారాయణ్ సంప్రదయ సాధు, పరమహంస. ఈయన అమ్రేలి జిల్లాలోని అమ్రపుర్ గ్రామంలో జన్మించారు.
 • డాక్టర్ ఎన్.డి రాథోడ్, అమ్రేలి చెందిన ఒక ప్రముఖ పరిశోధనా శాస్త్రవేత్త. డాక్టర్ రాథోడ్ యొక్క పరిశోధనలు వ్యవసాయ, అగ్రి జీవావరణ, ప్లాంట్ ఫిజియాలజీ, గడ్డి మొదలైనవి. రాథోడ్ పరిశోధనలు అగ్రికల్చరల్ అండ్ టెక్సాస్ మెకానికల్ కాలేజ్ (గతంలలో ఇది టెక్సాస్ ఎ & ఎం విశ్వవిద్యాలయం, యు.ఎస్.ఎ) చేత సత్కరించబడ్డాయి. ఈయన ఒక పరిశోధన హెడ్, ఫెలో షిప్, సైంటిస్ట్‌గా పనిచేసాడు. రాథోడ్ గుజరాత్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (భారతదేశం), టెక్సాస్ ఎఎం ఆవిశ్వవిద్యాలయం (యు.ఎస్.ఎ ) ; ప్రపంచ బ్యాంకులలో పరిశోధన సాగించాడు. డాక్టర్ రాథోడ్ ప్రాంతీయ కోపరేషన్ సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోపరేషన్ (ఎస్.ఎ.ఎ.ఆర్.సి ) లో హెడ్ రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేసాడు.
 • కె లాల్ మాజీషియన్స్;అమ్రేలి జిల్లాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ మెజీషియన్లలో ఒకడు.
 • యొగీజి మహారాజ్ సాధు ఙాంజీవందాస్ ( 1892 మే 23- 1971 జనవరి 23), ఈయనను సాధారణంగా యోగీజి మహారాజ్ అంటారు. భారత సాధు, బొచసన్వసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ రెండవ అధిపతి, ఈయనను భగవాన్ స్వమినారాయణ్ నాలుగో ఆధ్యాత్మిక వారసుడు అని భావిస్తున్నారు.
 • కాంజీ భూత బరొత్ ఈమె ప్రసిద్ధ గుజరాతీ సంస్కృతి గాయని.
 • గోర్దాన్దాస్ సొరథియ ; గొప్ప రచయిత అమ్రేలి జిల్లా . ఆయనను "అమ్రేలి ని ఆఅర్సి" అని పిలుస్తారు. గోర్దాన్దాస్ సొరథియ అమ్రేలి జిల్లా పుస్తకం రాశారు.
 • పిపా భగత్ పిపవవ్ : ప్రసిద్ధ సెయింట్ .
 • భోజ భగత్ ;జలారం (వీర్పుర్) కు గురువు .
 • అబిద్ సూర్తి (1935-) రచయిత, విషయుయల్ కళాకారుడు. వవెరలో జన్మించాడు.

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-13.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gabon 1,576,665 {{cite web}}: line feed character in |quote= at position 6 (help)
 4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301 {{cite web}}: line feed character in |quote= at position 7 (help)

వెలుపలి లింకులుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అమ్రేలి&oldid=3440535" నుండి వెలికితీశారు