అయనెస్కో యూజీన్

అయనెస్కో యూజీన్ (నవంబరు 26, 1909 - మార్చి 28, 1994) ప్రముఖ ఫ్రెంచి నాటక రచయిత.[1] అనిబద్ధ నాటక శైలీలో (అబ్సర్డ్ థియేటర్) నాటక రచనలు చేశాడు.

అయనెస్కో యూజీన్
అయనెస్కో యూజీన్
జననం(1909-11-26)1909 నవంబరు 26
స్లాటేనా, రుమేనియా
మరణం1994 మార్చి 28(1994-03-28) (వయసు 84)
జాతీయతఫ్రెంచి
వృత్తినాటక రచయిత

జననం - విద్యాభ్యాసం

మార్చు

అయనెస్కో రుమేనియాలోని స్లాటేనాలో 1909, నవంబరు 26న జన్మించాడు. బుఖారెస్ట్ విశ్వవిద్యాలయంలో ఫ్రెంచ్ లో పట్టభద్రుడై 1939లో పారీస్ లో డాక్టరేట్ డిగ్రీ పొందాడు.

రంగస్థల ప్రస్థానం

మార్చు

చిన్నతనం నుండే నాటకంపై ఆసక్తివున్న అయనెస్కో నాటక రచయితగా మారాడు. ఈ ప్రపంచంలో అర్థవంతంగాలేని మానవుని జీవన గతిని యథాతథంగా ఎలాంటి ముసుగులు లేకుండా చిత్రించే నాటకమే అనిబద్ధ నాటకం.[2] ఈయన ది చైర్స్, అమేడీ, ది విక్టిమ్ ఆప్ ది డ్యూటీ, ది పిక్చర్ వంటి నాటకాలను అనిబద్ధ ధోరణిలో రాశాడు.

రచించిన నాటకాలు

మార్చు
  1. బాల్డ్ ప్రైమాడొన్నా (1950)
  2. ది లెసన్ (1951)
  3. ది మోటార్ షో (1951)
  4. ది చైర్స్ (1952)
  5. ది లీడర్ (1953)
  6. ది విక్టిమ్ ఆ ది డ్యూటీ (1953)
  7. మేయిడ్ టు మ్యారీ (1953)
  8. అమేడీ, ఆర్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ (1954)
  9. జాక్, ఆర్ ది సబ్మిషన్ (1955)
  10. ది న్యూ టెనంట్ (1955)
  11. ది పిక్చర్ (1955)
  12. ఇంప్రూవైజేషన్ (1956)
  13. ది ఫూట్ ఆఫ్ ది వాల్ (1956)
  14. ది ఫ్యూచర్ ఈజ్ ఇన్ ఎగ్స్, ఆర్ ఇట్ టేక్స్ ఆల్ సోర్ట్స్ టు మేక్ ఏ వరల్డ్ (1957)
  15. ది కిల్లర్ (1958)
  16. ఫోర్ సమ్స్ (1959)
  17. రైనోసిరస్ (1959)
  18. ఎక్జిట్ ది కింగ్ (1962)
  19. లెర్నింగ్ టు వాక్ (1960)
  20. ఫ్రెంజీ ఫర్ టూ, ఆర్ మోర్ (1962)
  21. ఎగ్జిట్ ది కింగ్ (1962)
  22. స్త్రోల్ ఇన్ ది ఎయిర్ (1962)
  23. హంగర్ అండ్ థర్స్ట్ (1964)
  24. ది హార్డ్ బాయిల్డ్ ఎగ్ (1966)
  25. ది ఓవర్సైట్ (1966)
  26. ది మైర్ (1966)
  27. ది కిల్లింగ్ గేమ్ అకా హియర్ కమ్స్ ఏ ఛాపర్ (1970)
  28. ది డ్యూయల్ (1971)
  29. డబుల్ యాక్ట్ (1971)
  30. మక్బెత్ (1972)
  31. ఓహ్, వాట్ ఏ బ్లడ్ సర్కస్ అకా ఎ హెల్ ఆఫ్ ఎ మెస్ (1973)
  32. మ్యాన్ విత్ బ్యాగ్స్ (1977)
  33. జర్నీస్ అమాంగ్ ది డెడ్ (1980)
  34. ది విస్కౌంట్ (అసంపూర్ణం)

అయనెస్కో ఫ్రాన్స్ లోని పారిస్ లో 1994, మార్చి 28న మరణించాడు.

మూలాలు

మార్చు
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.195.
  2. తెలుగు నాటకరంగం నూతన ధోరణులు - ప్రయోగాలు, (పుట. 460), రచన. డా. కందిమళ్ళ సాంబశివరావు