కందిమళ్ళ సాంబశివరావు

కందిమళ్ళ సాంబశివరావు (ఏప్రిల్ 5, 1960) రంగస్థల నటుడు, రచయిత[1], పరిశోధకుడు, అధ్యాపకుడు.[2] నాటకరంగ పరిశోధనకు భారతీయ నాటకరంగ చరిత్రలో తొలి డి.లిట్ అందుకున్నాడు.[3]

కందిమళ్ళ సాంబశివరావు
Kandimalla Sambasivarao.jpg
జననంఏప్రిల్ 5, 1960
కొలలపూడి, ప్రకాశం జిల్లా
జాతీయతభారతీయుడు
జాతితెలుగు
వృత్తిరంగస్థల నటుడు, రచయిత, పరిశోధకుడు , అధ్యాపకుడు
తల్లిదండ్రులుబలరామయ్య, తిరుపతమ్మ
బంధువులురాధ (భార్య)

జననంసవరించు

సాంబశివరావు 1960, ఏప్రిల్ 5న బలరామయ్య, తిరుపతమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా, కొలలపూడిలో జన్మించాడు.

ఉద్యోగంసవరించు

గుంటూరు జిల్లా, చిలకలూరిపేట కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు.

నాటకరంగ ప్రస్థానంసవరించు

చిన్నతనం నుండే నాటకరంగంపై ఆసక్తి పెంచుకున్న సాంబశివరావు, వివిధ కార్యక్రమాలలో పాల్గొనేవాడు. నాటక సాహిత్యంపై అవగాహన ఏర్పరచుకున్న ఈయన తెలుగు నాటకరంగం - నూతన ధోరణలు, ప్రయోగాలు అనే అంశంపై పరిశోధన చేసి నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి పొందాడు. వివిధ సదస్సుల్లో, పత్రికలలో నాటకరంగానికి సంబంధించిన అనేక వ్యాసాలు రాశాడు. కళా సంస్థలకు కార్యదర్శిగా, గౌరవ సలహాదారునిగా, న్యాయనిర్ణేతగా సేవలందిస్తున్నాడు.

నటించినవి

 1. రాజీనామా
 2. ధర్మ సంరక్షణార్థం
 3. కల్పాంతం
 4. వాళ్ళిద్దరితో వీళ్ళు ముగ్గురు
 5. కుందేటి కొమ్ము
 6. దండమయా విశ్వంభర
 7. జగన్నాథ రథచక్రాలు
 8. సారా సంహారం
 9. ముద్రారాక్షసం
 10. నల్ల సముద్రం
 11. ప్రార్థన
 12. ఖడ్గసృష్టి

రచించినవి

 1. ఉప్పుకప్పురంబు
 2. సారాసంహారం
 3. భూమిక
 4. ముద్రారాక్షసం
 5. నల్లసముద్రం
 6. వఱడు
 7. చైతన్యరథం
 8. ఖడ్గసృష్టి
 9. సహాయ నిరాకరణోద్యమం - చీరాల, పేరాల సత్యాగ్రహం (రూపకం) [4]
 10. న‌ల్లజ‌ర్ల‌రోడ్డు (నాటకీకరణ) [5]
 11. ఆకుపచ్చసూరీడు (నాటిక) [6]

ఇతర రచనలుసవరించు

 1. అభినయ భరతాచార్య చాట్ల శ్రీరాములు (చాట్ల శ్రీరాములు థియేటర్ ట్రస్ట్, హైదరాబాద్, 2010)
 2. గుంటూరు జిల్లా నాటకరంగ చరిత్ర (కందిమళ్ల రాధ, చిలకలూరిపేట, 2009)
 3. తెలుగు నాటక రంగం నూతన ధోరణులు-ప్రయోగాలు (కాకతీయ ప్రచురణ, చిలకలూరిపేట, 1995)
 4. సాక్షి గంగోత్రి పెదకాకాని పదిహేడళ్ళ ప్రత్యేక సంచిక (గంగోత్రి ప్రచురణలు, పెదకాకాని, 2007)
 5. భూమిక తెలుగునాట నాటకం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా, సాంస్కృతికశాఖ, 2016)

బహుమతులు - పురస్కారాలుసవరించు

 1. ఉత్తమ నాటక రచన పురస్కారం - ముద్రారాక్షసం (1997), అనగనగా ఆరు నాటికలు (2008) తెలుగు విశ్వవిద్యాలయం[7]
 2. ఉత్తమ నాటక రచన పురస్కారం - ఎన్.జి. రంగ ఫౌండేషన్ (1998)
 3. ఉత్తమ నాటక రచన పురస్కారం - ప్రజానాట్యమండలి
 4. ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[8]
 5. సరిలేరు నీకెవ్వరు విశిష్ట నాటక రచనా పురస్కారం - అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ (2014) [3]

మూలాలుసవరించు

 1. సాక్షి, తెలంగాణ, హైదరాబాద్ (13 October 2016). "కళాపిపాసి కేవీఆర్‌". Retrieved 5 April 2018. Cite news requires |newspaper= (help)
 2. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.633.
 3. 3.0 3.1 అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్, 25 వార్షికోత్సవ కరదీపిక. "విశిష్ట సాహితీమూర్తులు" (PDF). www.avkf.org. p. 14. Retrieved 5 April 2018.
 4. మాగంటి. "సహాయ నిరాకరణోద్యమం - చీరాల, పేరాల సత్యాగ్రహం". www.maganti.org. Retrieved 5 April 2018.
 5. గుంటూరు కళాపరిషత్ బ్లాగు. "గుంటూరు క‌ళాప‌రిష‌త్ 21వ వార్షిక నాట‌కోత్స‌వాలు". www.gunturkalaparishat.blogspot.in. Retrieved 5 April 2018.[permanent dead link]
 6. Chilakaluripet blog. "3rd day competitions in C.R.Club auditorium". www.chilakaluripet1.blogspot.in. Retrieved 5 April 2018.[permanent dead link]
 7. తెలుగు విశ్వవిద్యాలయం, సాహితీ పురస్కారాలు. "నాటకం, నాటిక" (PDF). www.teluguuniversity.ac.in. p. 9. Retrieved 5 April 2018.
 8. సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. మూలం నుండి 17 ఏప్రిల్ 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 17 April 2020.